Home /News /telangana /

NIZAMABAD NIZAMABAD DISTRICT GANG WAS ARRESTED WHO STOLE 10 LAKHS BY PROMISING TO GIVE GOLD AT A LOW PRICE SNR NZB

Crime news : 35వేలకే తులం బంగారం .. 10లక్షలు పట్టుకొని వెళ్లిన వ్యక్తి పరిస్థితి ఏమైందో తెలుసా..?

(NIZAMABAD DONGALU)

(NIZAMABAD DONGALU)

Crime news: బంగారం, ఖరీదైన వస్తువులు తక్కువ ధరకు ఇప్పిస్తామని చెప్పే వాళ్లను నమ్మితే అంతే సంగతులు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ వ్యాపారిని కొందరు మోసగాళ్లు సినిమా స్టైల్లో బురిడి కొట్టించారు. అతడి నుంచి ఎంత డబ్బు దోచుకున్నారో తెలుసా.

ఇంకా చదవండి ...
(P.Mahendar,News18,Nizamabad)
బంగారం(Gold) అంటే అందరికి ఇష్టమే. అందులో తక్కువ ధరకు అమ్ముతున్నారంటే వెనకా ముందు చూడకుండా కొనేవాళ్లే చాలా మంది ఉంటారు. అలాగే ఆశపడి ఓ బాధితుడు 10వేలకు ఆశపడి పది లక్షల రూపాయలు వదిలించుకున్న సంఘటన నిజామాబాద్(Nizamabad)జిల్లాలో చోటుచేసుకుంది. నలుగురు యువకులు కలిసి ఓ వ్యాపారిని బురిడి కొట్టించాడు. ఇద్దరు వ్యాపారస్తులు, మరో ఇద్దరు మీడియేటర్స్‌గా వ్యవహరిస్తూ సినిమా స్టైల్లో చీటింగ్ చేశారు. కొమురంభీమ్ ఆసిఫాబాద్(Komurambheem Asifabad) జిల్లాకు చెందిన శేఖర్ (Shekhar)అనే వ్యక్తి 35వేలకే తులం బంగారం ఇస్తున్నారంటూ మంచిర్యాల(Mancheryala)కు చెందిన పదితపు శ్రీనివాస్‌(Srinivas)కి చెప్పాడు. శ్రీనివాస్‌ రియల్‌ ఎస్టేట్ వ్యాపారి(Realtor), కొడుకు ఎన్‌ఆర్‌ఐ(NRI) కావడంతో డబ్బులు బాగా ఉన్నాయని తెలిసే అతడ్ని టార్గెట్ చేసుకొని ఈ విధంగా పథకం వేశారు.

Telangana | Corona : తెలంగాణ యూనివర్సిటీలో మళ్లీ మహమ్మారి విజృంభణ .. కొత్తగా ఆ కేసులు 18నమోదు


లక్షల్లో ముంచారు..
రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్‌ శేఖర్ చెప్పిన మాటలు నమ్మి తక్కువ ధరకే గోల్డ్ వస్తుందని ఆశపడి కొనేందుకు సిద్ధమయ్యాడు. దాంతో శేఖర్ ఈనెల19వ తేదిన పది లక్షలు తీసుకొని టౌన్‌లోని ప్రగతి హాస్పిటల్ వెనుకకు రమ్మని చెప్పాడు. డబ్బుతో వచ్చిన శ్రీనివాస్‌ని మోసం చేయడానికి ముందుగానే శేఖర్ వ్యక్తితో పాటు అతని స్నేహితుడు ఆదిలబాద్ జిల్లా పిప్రీకి చెందిన శంకర్‌తో చేతులు కలిపాడు. వీరిద్దరికి తోడు రాజు, మల్లేశ్ అనే మరో ఇద్దరు కలిసి వ్యాపారి శ్రీనివాస్‌ డబ్బులు తీసుకొని ప్రతిమ హాస్పిటల్‌ దగ్గరకు రాగానే నకిలీ పోలీసుల వేషంలో వచ్చిన రాజు, మల్లేష్, శంకర్‌ దాడి చేసి బాధితుడి దగ్గర డబ్బులు తీసుకొని పారిపోయారు. ముగ్గురితో పాటు తన వెంట వచ్చిన శేఖర్‌ కూడా పారిపోవడంతో శ్రీనివాస్‌కి అనుమానం వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.



నలుగురు అరెస్ట్ ..నలుగురు పరారీ ..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితును ప‌ట్టుకున్నారు. వ్యాపారిని నమ్మించన శేఖర్‌తో పాటు ఇంద్రవెల్లికి చెందిన మండలి బక్కన్న,  నిర్మల్ జిల్లా ఖానాపూర్ కు చెందిన హత్వాల్ అభిషేక్ , శంకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల దగ్గర నుంచి 4ల‌క్ష‌ల 84వేల క్యాష్, స్విఫ్ట్ డిజైర్ కారు, హోండా యాక్టివా టూ వీలర్‌ను రికవరీ చేసుకున్నట్లుగా సీపీ ఆర్‌. నాగ‌రాజు తెలిపారు. ఈకేసుతో సంబంధం ఉన్న మరో నలుగురు రాజు, మల్లేష్, విజయ్, లింగం అలియాస్ రాజేష్‌లు పరారీలో ఉన్నారు. త్వరలో వారిని కూడా పట్టుకుంటామని సీపీ తెలిపారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Gold smuggling, Nizamabad, Telangana crime news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు