హోమ్ /వార్తలు /తెలంగాణ /

NIA RIDES : తెలంగాణలో ఎన్‌ఐఏ దాడులు .. ఆ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలే టార్గెట్‌గా సీక్రెట్ ఆపరేషన్

NIA RIDES : తెలంగాణలో ఎన్‌ఐఏ దాడులు .. ఆ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలే టార్గెట్‌గా సీక్రెట్ ఆపరేషన్

NIZAMABAD NIA RIDES

NIZAMABAD NIA RIDES

NIA RIDES: తెలంగాణలో జాతీయ దర్యాప్తు, విచారణ సంస్థలు దాడులు కలకలం రేపుతున్నాయి. ఎన్‌ఐఏ బృందాలు నిజామాబాద్‌ జిల్లాలో సోదాలు చేపట్టింది. రెండ్రోజులుగా ఈ సీక్రెట్ ఆపరేషన్‌ నిర్వహించాలని ఎన్‌ఐఏ అధికారులు భావించినట్లుగా సమాచారం అందుతోంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nizamabad, India

  (P.Mahendar,News18,Nizamabad)

  తెలంగాణలో జాతీయ దర్యాప్తు, విచారణ సంస్థ(NIA)లు దాడులు కలకలం రేపుతున్నాయి. ఓవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో ఈడీ మెరుపు దాడులు చేస్తుంటే మరోవైపు ఉగ్రవాద కదలికల అనుమానాలతో ఎన్‌ఐఏ బృందాలు నిజామాబాద్‌ జిల్లాలో సోదాలు చేపట్టింది.నిజామాబాద్(Nizamabad)జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల కదలికలు, ఆర్ధిక లావాదేవీలపై నిఘా పెట్టిన అధికారులు జీఎస్టీ(GST) అధికారుల సహకారంతో దాడులను ముమ్మరం చేస్తున్నారు. రెండ్రోజులుగా ఈ సీక్రెట్ ఆపరేషన్‌(Secret operation) నిర్వహించాలని ఎన్‌ఐఏ అధికారులు భావించినట్లుగా సమాచారం అందుతోంది.

  Hyderabad | Amit Shah : కేంద్రమంత్రి అమిత్‌షా కాన్వాయ్‌కి కారు అడ్డుపెట్టిన వ్యక్తి ఎవరో తెలిసిపోయింది..

  ఇన్వెస్టిగేషన్‌ ఎవరిపైన..?

  నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికార బృందాలు నిజామాబాద్ జిల్లాలో వాలిపోయాయి. జిల్లాలో సీక్రెట్‌గా అడుగుపెట్టిన అధికారులు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు పలువుర్ని టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే సోదాలు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇద్దరు ప్రజాప్రతినిధుల ఆర్థిక అంశాలపై ప్రత్యే కంగా నిఘా పెట్టినట్టు తెలిసింది. జీఎస్టీ విభాగానికి చెందిన సుమారు 20 మంది అధికారులను కూడా ఎస్ఐఏ ఆఫీసర్లు వెంట తీసుకెళ్లారని సమాచారం ఉంది. శనివారం దాడుల్ని ప్రారంభించిన ఎన్‌ఐఏ అధికారులు విషయాన్ని ఏమాత్రం బయటకు పొక్కకుండా వ్యవహరిస్తున్నాయి.

  సీక్రెట్ ఆపరేషన్ ..

  సోదాలకు గలకారణాలను అటు జీఎస్టీ, ఇటు ఎస్ఐఏ సిబ్బంది అధి కారికంగానూ, అనధికారికంగానూ వెల్లడించడం లేదు. ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఆర్థిక అంశాలపై ఎస్ఐఏ ఫోకస్ పెట్టినట్లు ప్రాథమిక సమాచారం. నాలుగు రోజుల క్రితమే తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాలని నిర్ణయించుకున్న ఎన్‌ఐఏ అధికారులు అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో శనివారం నుంచి సోదాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. పట్టణానికి చెందిన ఇద్దరిని ప్రశ్నించి వదిలే సినట్లు తెలిసింది. ఈ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు విదేశాలతో వివిధ రకాల వ్యాపారాలు ఉన్నాయనే అంశానికి సంబంధించి ప్రత్యేకంగా నిఘా పెట్టినట్లు సమాచారం.

  Online Services : ఆన్‌లైన్‌లోనే ఆర్టీవో సేవలు .. ఆఫీసులకు వెళ్లాల్సిన పని లేకుండా చేసిన కేంద్రమంత్రిత్వశాఖ

  సోదాల వెనుక సీక్రెట్ ఏంటీ..?

  అయితే నిజామాబాద్ జిల్లాలో ఎన్‌ఐఏ సోదాల వెనుక అసలు మర్మమేమిటి అనే విషయం మాత్రం బయటకు రావడం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంతో లింకులు రాబట్టేందుకు చేస్తున్నారా లేక జిల్లాకు చెందిన ఏ నేతను టార్గెట్ చేసి ఈ సోదాలు చేపడుతున్నారనే సందేహాలకు సమాధానం రావడం లేదు. ఒకవేళ టెర్రర్ ఫండింగ్ విషయమా..? లేక విదేశాల నుంచి భారీ స్థాయిలో ఆర్థికపరమైన లావా దేవీలకు నేరాలతో లింకు ఉండడమా..? ఇలాంటి అనేక సందేహాలు నెలకొన్నాయి.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: NIA, Nizamabad, Telangana News

  ఉత్తమ కథలు