హోమ్ /వార్తలు /తెలంగాణ /

NIA in Nizamabad: నిజామాబాద్ జిల్లాలో ఎన్​ఐఏ త‌నిఖీలు.. అదుపులోకి డిగ్రీ విద్యార్థి

NIA in Nizamabad: నిజామాబాద్ జిల్లాలో ఎన్​ఐఏ త‌నిఖీలు.. అదుపులోకి డిగ్రీ విద్యార్థి

nia rides

nia rides

నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో ఆదివారం తెల్లవారుజాము నుంచి ఎన్ ఐఏ (NIA) తనిఖీలు కొనసాగుతున్నాయి. జిల్లాలో 26 బృందాలు నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ( PFSI) శిక్షణ తీసుకున్న వారు.. శిక్ష‌ణ‌ ఇచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని తనిఖీలు చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nizamabad, India

  (P. Mahendar, News18, Nizamabad)

  నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో ఆదివారం తెల్లవారుజాము నుంచి ఎన్ ఐఏ (NIA) తనిఖీలు కొనసాగుతున్నాయి. జిల్లాలో 26 బృందాలు నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ( PFSI) శిక్షణ తీసుకున్న వారు.. శిక్ష‌ణ‌ ఇచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని తనిఖీలు చేస్తున్నారు. న‌గ‌రంలోని ఆటోనగర్ చెందిన అబ్దుల్ ఖాదర్ (Abdul Khadar) ఏప్రిల్ మాసంలో పిఎఫ్ఎస్ఐ  PFSI)  ఆధ్వర్యంలో యువతకు శిక్షణ ఇస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే.. 400 మందికి శిక్షణ (Training) ఇవ్వగా 30 మంది పై పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. అందులో నలుగురిపై దేశద్రోహం కేసులు నమోదు కావడంతో ఈ కేసును ఎన్ఐఏ విచారణ చేపట్టింది. పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్నవారిని ఇదివరకే ఎస్ఐఏ విచారించింది. జిల్లాలో అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై కేంద్ర నిఘా సంస్థలు దృష్టి సారించాయి.  జూన్ మాసంలో ఆర్మూర్ కు చెందిన ఇద్దరు ఖాతాలోకి విదేశీ నిధులు రావడంపై ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.. ఈ రోజు నిజామాబాద్ నగరంతో పాటు బోధన్, ఆర్మూర్ పట్టణంలో తనిఖీ నిర్వహించారు.

  ఎడపల్లి మండలంలోని తనిఖీలు జరిగాయి. నిజామాబాద్ నగరంలోని ఆటోనగర్ కు చెందిన డిగ్రీ ద్వితీయ సంవత్సర విద్యార్థిని (Degree Student) ఎన్ఐఏ టీం అదుపులోకి తీసుకుంది. అతని వద్ద మూడు లాప్ టాప్ (Laptops)లతోపాటు బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలు సీజ్ చేసి హైదరాబాద్కు తరలించారు.

  ఎదపల్లికి చెందిన మల్టీ కంప్యూటర్ సర్వీస్ ప్రొవైడర్ నిర్వాహకునికి 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. నగరంలోని చంద్రశేఖర కాలనీకి చెందిన యువకుడికి సైతం నోటీసులు ఇచ్చినట్టు సమాచారం.. జిల్లా వ్యాప్తంగా 26 బృందాలు తనిఖీలు నిర్వహిస్తుండడంతో పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. జిల్లాలో ఎన్ ఐఏ, ఈడీ (ED), జీఎస్టీ (GST) అధికారులు తనిఖీల విషయంలో జోరుగా సోషల్ మీడియాలో వివిధ రకాలుగా పోస్టులు వైరల్ అవుతున్నాయి.

  ఎడపల్లి మండలం MSC పారం లో NIA సోదాలు నిర్వహించారు.గ్రామం లో ఆన్లైన్ నిర్వాహకుడు ముఖిమ్ వద్ద నుంచి పాస్ ఫోర్ట్, రెండు బ్యాంక్ కాతా పుస్తకాలను, రెండు మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్న NIA బృందం.. రెండు రోజుల్లో హైదరాబాద్ NIA ఆఫీస్ కు రావాలని ఆదేశించార‌ని ముఖిద్ తెలిపారు.

  కరీంనగర్ జిల్లాలోనూ..

  నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కరీంనగర్ లోనూ సోదాలు నిర్వహించింది . ఆదివారం తెల్లవారుజామున కరీంనగర్‌లోని హుస్సేనిపురాలో దాడులు చేసి ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్ నుండి వచ్చిన ప్రత్యేక బృందం కరీంనగర్ లో సోదాలు నిర్వహించడం కలకలకం సృష్టించింది . జగిత్యాలకు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ సమీప బంధువుల ఇంట్లో షెల్టర్ తీసుకున్న సమాచారం అందుకున్న టీం సోదాలు నిర్వహించి అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం ఉంది. ఇర్ఫాన్ ను విచారణ కోసం హైదరాబాద్ తరలించినట్టు తెలుస్తోంది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: NIA, Nizamabad

  ఉత్తమ కథలు