మూడవ విడత దిశ సమావేశం నిజామాబాద్ ఎంపీ అరవింద్ అధ్యక్షతన కలెక్టరేట్ లోని ప్రగతి భవన్లో నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కల్నల్ సంతోష్ కుమార్ ఆత్మ శాంతికై రెండు నిమిషాలు మౌనం పాటించారు. అంతకు ముందు ఎంపీ, కలెక్టర్ కలిసి కలెక్టరేట్ ప్రాగణంలో హరితహారం లో భాగంగా మొక్కలు నాటారు. ఈ సమావేశంలో DRDA, IHHL, NREGS, Housing, 2 BHK, R & B, PR Roads, Medical & Health, Covid, National Highways తదితర ఆంశాలపై సమీక్షా నిర్వహించారు. కమిటీ సభ్యులు అడిగిన వాటికి, కొత్త ఫ్యామిలీస్ వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టుకుంటే వారికి మంజూరు ఉంటుందని తెలిపారు. గ్రామాలలో కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణానికి 10 శాతం గ్రామ పంచాయతీ నిధుల నుండి భరిస్తే 90% ప్రభుత్వం నిధులు ఇస్తుందన్నారు. ఎంపీ ఆర్వింద్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. మీరు అన్ని విషయాలు తెలుసుకొని మాకు వివరించాలి. కానీ మీటింగ్ కు వచ్చిన తరువాత సవరించడం బాగాలేదని ఎంపీ మండిపడ్డారు. మాధవనగర్ రైల్వే బ్రిడ్జి పనులు ఎందుకు ముందుకు సాగడం లేని అధికారులను ప్రశ్నించారు. దాని అధికారులు సమాధానం ఇవ్వలేక పోయారు. ప్రజలకు అవసరం అయినా వాటిపై పోకస్ చేసి ఆ పనులను పూర్తి చేయలని అయన చెప్పారు.
డబుల్ బెడ్ రూం పనులపై జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ అర్బన్ లో నిర్మిస్తున్న కొత్త కలెక్టరేట్ వెనకాల డ్రైనేజీ వాటర్, వర్షం నీటి వలన పనులు ఆలస్యం జరుగుతుందని, వాటిని మళ్లించి వెంటనే నిర్మాణం పనులు ప్రారంభిస్తామన్నారు. ఇసుక 8 మండలాల నుంచి 29 మండలాలకు అందివ్వాలని అందుకే ఆలస్యం జరుగుతుందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dharmapuri Arvind, Nizamabad, Telangana