తెలంగాణ రాష్ట్రంలో మిట్ట మధ్యాహ్నం కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి ఆర్వింద్ అన్నారు. సీఎం కేసీఆర్ గుండాలను పెంచి పోషిస్తున్నానని అయన ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలో 40రోజుల క్రితం హత్యకు గురైన మమత కుటుంబానికి న్యాయం చేయాలని ఆ గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నిజామాబాద్ ఎంపీ ఆర్వింద్ పాల్గొని మద్దతు తెలిపారు. పోలీస్ కమిషనర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. సీపీ కార్తీకేయకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. సిరికొండ మండలం న్యావనంది గ్రామానికి చెందిన మమత అనే మహిళ హత్యకు గురైంది. నేటికి 40రోజులు పూర్తవుతున్నా... పోలీసుల దర్యాప్తు ముందుకు సాగడం
లేదని అయన మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీకీ తొత్తులుగా మారారని అయన అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో రౌడీయిజం ఎక్కువైందన్నారు. ఎమ్మెల్యే ఆనుచరుడు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, పోలీసులను సీఎం కేసీఆర్ తన దౌర్జన్యాలకు వాడుకుంటున్నారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి నేరస్తులను శిక్షించాలని ఎంపీ
డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dharmapuri Arvind, Nizamabad, Telangana