హోమ్ /వార్తలు /తెలంగాణ /

Pensions: " 57 ఏళ్లు నిండిన వారికి వచ్చే నెల నుంచి పెన్షన్లు ’’: బాన్సువాడ పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత 

Pensions: " 57 ఏళ్లు నిండిన వారికి వచ్చే నెల నుంచి పెన్షన్లు ’’: బాన్సువాడ పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత 

సభలో మాట్లాడుతున్న కవిత

సభలో మాట్లాడుతున్న కవిత

బాన్సువాడలో పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా కారణంగా కొన్ని పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. అయినా కూడా, పెన్షన్, రైతు భీమా, రైతు బంధు, లాంటివి ఎక్కడా ఆగలేదన్నారు.

  కామారెడ్డి (Kamareddy) జిల్లా బాన్సువాడ లో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC kavitha) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాన్సువాడ లో భారీ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు బాన్సువాడ అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు . పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత (MLC kavitha) మాట్లాడుతూ.. కరోనా కారణంగా కొన్ని పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. అయినా కూడా, పెన్షన్, రైతు భీమా, రైతు బంధు, లాంటివి ఎక్కడా ఆగలేదు. పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందని అనేక మంది మాటలు చెప్పారు తప్ప, పల్లెల కోసం ఎవరూ ప్రణాళిక వేసుకొని పనిచేయలేదు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని ఏండ్లకు, మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాత్రమే, పల్లె బాగుపడాలె, ఆరోగ్యంగా ఉండాలని , పల్లెలు పరిశుభ్రంగా ఉండాలని సీఎం కేసీఆర్ గారు పల్లె ప్రగతి ప్రారంభించారు. ఒక ఇళ్లు ఎలా పరిశుభ్రంగా ఉంటుందో, పల్లె కూడా పరిశుభ్రంగా ఉండాలని సీఎం కేసీఆర్  (CM KCR)గారు భావించారు.

  ఒక్కపూట కూడా కరెంటు పోలేదు..

  కరోనా కారణంగా కొన్ని పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. అయినా కూడా, పెన్షన్, రైతు భీమా, రైతు బంధు, లాంటివి ఎక్కడా ఆగలేదు. కరోనాతో మూడేండ్లు ఇబ్బంది పడ్డా, ఒక్క పూట కూడా మిషన్ భగీరథ నీళ్లు ఆగలేదు. ఒక్కపూట కూడా కరెంటు పోలేదు. రైతు బంధు, పెన్షన్ ఆగలేదు. ఇది కేవలం మన నాయకుడి పట్టుదలతోనే సాధ్యమైంది. వచ్చే నెల నుండి 57 ఏండ్లకే పెన్షన్ ను కూడా ప్రారంభించుకుందాం.

  రాష్ట్రం నుండే పాలన జరగడం కాదు, అధికార వికేంద్రీకరణ ద్వారా పల్లెల్లో ఉండే సర్పంచ్ లు, ఎంపీటీసిలు , స్థానిక‌ ప్రజాప్రతినిధుల చేతుల్లో మా ఊరికి ఏం కావాలో ‌మేమే తేల్చుకుంటాం అనే అధికారాన్ని ఇచ్చి, అధికారంతో పాటు నెలనెలా ఠంచనుగా డబ్బులు కూడా ఇచ్చి పల్లెలను బాగు చేసి కార్యక్రమం దేశం మొత్తంలో కేవలం తెలంగాణలో జరుగుతుంది. జరుగుతున్న అభివృద్ధి ‌కళ్ల ముందు కనబడుతుంది” అని కవిత అన్నారు.

  గ్రామపంచాయతీలకు నయా పైసా బాకీలేకుండా..

  మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ.. గ్రామంలో పచ్చదనం పెంచేందుకు నర్సరీలు, డంపింగ్‌ యార్డులు, చెత్తను వేరు చేసే పద్ధతి, అంతిమ సంస్కారాలకు వైకుంఠ ధామాల వంటివి పల్లెప్రగతిలో భాగంగా ఏర్పాటు చేసుకున్నామన్నారు.  గ్రామాల్లో రైతు వేదికలు, కల్లాలు, రైతులకు ఎదురు పెట్టుబడి, రైతు బీమా, పెన్షన్లు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, ఇలా అన్ని సదుపాయాలు ఎప్పుడూ జరగలేదని, కేవలం సీఎం కేసీఆర్‌ వల్లే సాధ్యమయ్యాయని మంత్రి చెప్పారు. ప్రభుత్వం గ్రామపంచాయతీలకు నయా పైసా బాకీలేకుండా ఇచ్చేసిందని వెల్లడించారు.

  కేంద్రం నుంచి రూ.1450 కోట్ల నిధులు రావాల్సి ఉందని వెల్లడించారు. పల్లె ప్రగతి సాధించిన ఫలితాలు ఇక్కడి గల్లీల నుంచి ఢిల్లీకి చేరాయన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్‌ చొరవ, అధికారుల శ్రమ, ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమయిందని తెలిపారు. ఈ ప్రగతి ఇలాగే కొనసాగాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని, దానికి తగినట్లుగా అవసరమైన నిధులు ఇస్తున్నారని చెప్పారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Kamareddy, Kavitha, Nizamabad, Pensions

  ఉత్తమ కథలు