Nizamabad Counting: కాసేపట్లో నిజామాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్... గంటలోపే ఫలితం

Nizamabad MLC By-poll Counting: నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కాసేపట్లో ప్రారంభం కానుంది. రెండు రౌండ్లలో కౌంటింగ్‌ ప్రక్రియ ఉంటుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

news18-telugu
Updated: October 12, 2020, 7:00 AM IST
Nizamabad Counting: కాసేపట్లో నిజామాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్... గంటలోపే ఫలితం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Nizamabad MLC By-polls Counting: ఇప్పుడు అందరి దృష్టీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు పైనే ఉంది. నిజామాబాద్‌లోని పాలిటెక్నిక్‌ కాలేజీలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. రెండు రౌండ్లలో కౌంటింగ్‌ కొనసాగనుంది. మొదటి రౌండ్‌లో 600 ఓట్లు, రెండో రౌండ్‌లో మిగిలిన 221 ఓట్లను కౌంట్‌ చేస్తారు. ఉదయం 9 గంటల కల్లా ఫలితం వచ్చేస్తుంది. మొత్తం 824 మంది ఓటర్లు ఉండగా 821 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు వేశారు. ప్రాధాన్య ఓటింగ్‌ విధానంలో జరిగిన ఈ ఎన్నికల్లో కౌంటింగ్‌ ప్రక్రియ కూడా ప్రత్యేకంగా ఉండనుంది. ఈ ఎన్నికల్లో గెలుపు తమదేననే ఫుల్ కాన్ఫిడెన్స్‌లో ఉన్న టీఆర్ఎస్ శ్రేణులు... పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునేందుకు రెడీ అయ్యాయి.

కౌంటింగ్ ఇలా ఉంటుంది:

ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో మొత్తం 824 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో బోధన్‌కు చెందిన ఓ కౌన్సిలర్‌ చనిపోగా, మరో ఇద్దరు ఓటర్లు కరోనా వల్ల పోస్టల్‌ బ్యాలెట్‌ ఎంచుకున్నారు. 9న జరిగిన ఎన్నికల్లో 99.64 శాతం పోలింగ్‌ నమోదైంది. 821 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కామారెడ్డి జిల్లాలో 100 శాతం కాగా నిజామాబాద్‌లో 99.64 శాతం మంది ఓటేశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ కోసం అధికారులు 50 పోలింగ్‌ బూత్‌లకు 6 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో టేబుల్‌పైన 100 ఓట్లు లెక్కిస్తారు. రెండో రౌండ్‌లో రెండు లేదా మూడు టేబుళ్లు ఏర్పాటు చేశారు. రెండు రౌండ్లలోనే ఫలితాలను ప్రకటిస్తారు. మొదటి రౌండ్‌లో 600 ఓట్లు లెక్కిస్తారు. రెండో రౌండ్‌ లో మిగిలిన 221 ఓట్లను కౌంట్‌ చేస్తారు. మొత్తం రెండు రౌండ్ల తర్వాత ఆయా పార్టీల అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు ఏమైనా ఉంటే తీసుకుంటారు. లేదంటే ఈసీ అనుమతితో ఎవరు గెలిచిందీ ప్రకటిస్తారు. మొత్తం ప్రక్రియకు 2 గంటల్లో పూర్తవ్వనుంది.

ఓట్ల లెక్కింపులో ప్రత్యేక విధానం:
నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీలో మొదట పోలింగ్‌ స్టేషన్ల వారీగా బ్యాలెట్‌ బాక్సుల్లో పోలైన ఓట్ల మొత్తాన్ని లెక్కించి, తర్వాత మొదటి ప్రాధాన్య క్రమం ప్రకారం అభ్యర్థి వారీగా ఓట్లు లెక్కిస్తారు. ఈ క్రమంలో చెల్లుబాటు కాని ఓట్లను తీసేసి... చెల్లుబాటు అయిన ఓట్ల సంఖ్య ఆధారంగా గెలుపుకి కావాల్సిన కోటాను నిర్ణయిస్తారు. ఒకవేళ మొదటి రౌండ్‌లో ఎవరైనా అభ్యర్థి కోటాకు రావాల్సిన ఓట్లు పొందితే వారే విజేత అవుతారు. ఒకవేళ ఏ అభ్యర్థికీ కోటాకు కావాల్సిన ఓట్లు రాకపోతే తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థి ఓట్లను ఇతర అభ్యర్థులకు ప్రాధాన్య క్రమం ఆధారంగా పంచుతారు. ఈ ప్రక్రియ ఎవరో ఒక అభ్యర్థికి కోటాకు కావాల్సిన ఓట్లు పొందే వరకు కొనసాగుతుంది.

Nizamabad MLC by-polls counting, Nizamabad MLC bypoll counting, nizamabad news, nizamabad election, nizamabad counting, mlc by poll counting, trs candidate kavitha, Nizamabad MLC by-polls result, Nizamabad MLC by-poll conting time, Nizamabad MLC by-polls counting date, నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్, నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలు,
కవిత (File)




జోష్‌లో టీఆర్ఎస్:ఈ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత గెలుపు లాంఛనమే అంటున్నారు విశ్లేషకులు. పార్లమెంట్‌ ఎన్నికలలో ఓటమి తర్వాత 16 నెలలుగా ఆమె ఏ పదవినీ చేపట్టలేదు. ఉప ఎన్నిక షెడ్యూల్‌ వచ్చినప్పుడే టీఆర్‌ఎస్‌ తరఫున కవిత నామినేషన్‌ వేసినప్పుడే గెలుపు ఖాయం అని భావించినా... ఆమెకు భారీ మెజారిటీ వచ్చేలా టీఆర్ఎస్ నేతలంతా కృషి చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఓట్లు చీలకుండా చూశారు. పార్టీ వారితో పాటు ఇతరుల మద్దతు కూడగట్టి భారీగా ఓట్లు పడేటట్లు ప్రయత్నం చేశారు. ఇవాళ కౌంటింగ్‌లో కవితకు ఎన్ని ఓట్లు వస్తాయోనని అంతా ఎదురు చూస్తున్నారు. 100 శాతం పోలింగ్‌ జరగడంతో 700పైగా ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. కవితను విజేతగా ప్రకటించగానే భారీ ఎత్తున సంబరాలు చేసుకోవడానికి టీఆర్ఎస్ కార్యకర్తలు రెడీగా ఉన్నారు.

పోరాడిన కాంగ్రెస్‌, బీజేపీ:
ఈ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థులకు ఎన్ని ఓట్లు వస్తాయోనని కాంగ్రెస్‌ అభ్యర్తి వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి పోతంకార్‌ లక్ష్మీనారాయణ ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ఫలితాన్ని బట్టీ... ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకోనున్నారు.
Published by: Krishna Kumar N
First published: October 12, 2020, 7:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading