హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nizamabad: కనుమరుగవుతున్న మేదరి బుట్టలు, చాట‌లు..ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని వేడుకుంటున్న మేద‌రులు   

Nizamabad: కనుమరుగవుతున్న మేదరి బుట్టలు, చాట‌లు..ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని వేడుకుంటున్న మేద‌రులు   

మేదరి బుట్టలు

మేదరి బుట్టలు

 పెళ్లిళ్లు, శుభకార్యాలు అవుతున్నాయంటే మొదటగా తీసుకువచ్చేవి వేదురు బొంగుల‌తో త‌యారు చేసే మేదరి బుట్టలు, చాట‌లు. కానీ మారుతున్న కాలంతో పాటు మేదరి బుట్టల బదులు ప్లాస్టిక్ బుట్టలు వచ్చాయి. దీంతో  వారికి ఉపాధి కరువైంది. అయినా కొన్ని కుటుంబాలు వృత్తిని న‌మ్ముకుని జీవనం సాగిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో మేద‌రి కార్మికుల క‌ష్టాల‌పై న్యూస్ 18 ప్ర‌త్యేక క‌థ‌నం.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Nizamabad

  (నిజామాబాద్ జిల్లా, న్యూస్ 18 తెలుగు ప్ర‌తినిధి, పి మ‌హేంద‌ర్)

  పెళ్లిళ్లు, శుభకార్యాలు అవుతున్నాయంటే మొదటగా తీసుకువచ్చేవి వేదురు బొంగుల‌తో త‌యారు చేసే మేదరి బుట్టలు, చాట‌లు. కానీ మారుతున్న కాలంతో పాటు మేదరి బుట్టల బదులు ప్లాస్టిక్ బుట్టలు వచ్చాయి. దీంతో  వారికి ఉపాధి కరువైంది. అయినా కొన్ని కుటుంబాలు వృత్తిని న‌మ్ముకుని జీవనం సాగిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో మేద‌రి కార్మికుల క‌ష్టాల‌పై న్యూస్ 18 ప్ర‌త్యేక క‌థ‌నం.

  Minister Mallareddy: ఐటీ రైడ్స్ విషయం కేసీఆర్ ముందే చెప్పారు..మంత్రి మల్లారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

  ఇంట్లో ఏదైనా దైవ కార్యం చేయ‌లంటే ముందుకు కొత్త బుట్ట (గుల్ల), చాటా కావాల్సిందే. అదే పెళ్లిలు అయితే మాత్రం తలంబ్రాలకు, అన్నం వ‌డించేందుకు కూడా వెదురు బొంగులతో త‌యారు చేసిన గుల్ల‌ల‌ను ఉప‌యోగించే వారు. ఇలా మేద‌రుల‌కు చేతి నిండా ప‌ని ఉండేది. అయితే మారు డిజిట‌ల్ యుగంలో వీటికి మ‌దులుగా ప్లాస్టిక్ గుల్ల‌లు, చాటలు వ‌చ్చాయి. దీంతో నిజామాబాద్ జిల్లా మేద‌రుల ప‌రిస్థితి దారుణంగా మారింది. బోధన్ పట్టణంలోని మేదరి కార్మికులు కుల వృత్తిని న‌మ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వీరి జీవన ఆధారమైన బుట్టల అల్లికలు. వీటిని మార్కేట్ లో పెట్టుకుని అమ్ముకుంటారు. అయితే వీరి గ‌తంతో పోర్చితే ఇప్పుడు డిమాండ్ త‌గ్గిపోయింది. దీంతో రోజు కూలీ కూడా ప‌డ‌డం లేద‌ని వాపోతున్నారు.

  Breaking News: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి భారీ షాక్..ఎట్టకేలకు ఆ ముగ్గురిపై కేసు నమోదు

  అయితే పెళ్లిళ్లు శుభకార్యాలు జరిగినప్పుడు పెద్ద ఎత్తున వ్యాపారం జరిగేది. కానీ రాను రాను ప్లాస్టిక్ బుట్టలు ప్లాస్టిక్ చాటలు రావడంతో మా యొక్క ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మా శ్రమకు తగిన కూలి కూడా దొరికే పరిస్థితి లేదు. తయారు చేయడానికి వాడే బొంగు సైతం 200 రూపాయలకు చేరుకుంది. ఇప్పుడు బుట్ట తయారు చేయడానికి పట్టే శ్రమకు..బుట్ట అమ్మితే వచ్చే డబ్బులకు కనీసం గిట్టుబాటు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకొని మాలాంటి వారికి ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. మా జీవనాధారమే ఈ మేతరి పని అని బుట్ట‌లు అమ్ముతున్నా గంగాధర్ చెబుతున్నారు. ఇది మా కులవృత్తి చెయ్యితోనే ఈ బుట్టలను గుళ్లను చాటలను తయారు చేస్తాము. ఇంత చేసుకుంటున్న మాకు గిట్టుబాటు కావ‌డం లేదు. మాకు ఉన్నది ఒక్కటే ఆధారం. ప్లాస్టిక్ వేరే వేరే డిజైన్స్ రావడంతో వాటి వెనకాల వెళుతున్నారు. నాలుగు బుట్టలు తయారు చేయాలంటే రెండు రోజులు పడుతుంది. కనీసం కూలి కూడా పడట్లేదని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

  మేము చిన్నగా వున్నప్పుడు ఈ బొంగు రూపాయికి వచ్చేదని వృద్ధురాలు చెబుతోంది.  ఈ బొంగు రూపాయి నుంచి రెండు, ఐదు, ఇప్పుడు రెండు వంద‌ల‌కు చేరింది. ఎప్పుడన్నా ఒక లారీ వచ్చినప్పుడు రెండు వంద‌లు పెట్టి బొంగు కొంటాము. అయితే  కొన్నిసార్లు బొంగు లోపల పాడైతే మేమే న‌ష్ట‌పోవాలి. ఒకప్పుడు బిచ్చగానికి బిచ్చమేయాలన్న గాని మా మేతరుల బుట్టి గుళ్లతోటి చేసేవారు. ఇప్పుడు అలాంటి ఆనవాల్లే లేకుండా పోయాయి. చిన్న చిన్న చాట‌లు, చిన్నచిన్న గుల్లలు, బీడీలు గుల్లలకు మంచి గిరాకి ఉండేది. ఇప్పుడు ఇందులో జీవనాధారం లేకపోవడంతో పిల్లలు చదువుకొని బయట కూలీలకు అటు ఇటు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గవర్నమెంట్ అన్ని కులాలకు  స‌హ‌యం అందిస్తుంది. ఆలాగే మాకూ  కూడా ఏదైనా స‌హ‌యం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.

  ఈ ఒక నెల అంతా చేసిన గుల్లలు ఒక పెళ్లి కార్యం వస్తే సరిపోయేవి కావు.  అలాంటిది ఇప్పుడు పెళ్లిళ్లలో మొత్తం ప్లాస్టిక్ వాడుతున్నారు. దాంతోటి మా జీవనాధారం లేకుండా పొతుంద‌న్నారు. మాకు తెలిసిన‌ పని బుట్ట‌లు అల్ల‌డం ఒకటే. మాకు వేరే పని ఏది రాదు అని మేద‌రి మ‌ల్ల‌య్య చెబుతున్నారు. మా జీవనాదారం మేద‌రి ప‌ని అయితే ఈ ప్లాస్టిక్ చాటలు ప్లాస్టిక్ గుళ్లలు రావడంతో మాకు బతుకు దెరువు కరువైపోతోంది. మాకు కూడా తెలంగాణ ప్ర‌భుత్వం అన్ని కులాల‌కు ఇచ్చిన‌ట్టుగా మాకు లోన్ ఇచ్చి అదుకోవాల‌ని కోరుతున్నారు.

  Published by:Rajashekar Konda
  First published:

  Tags: Nizamabad District, Telangana

  ఉత్తమ కథలు