తెలంగాణలో మరో మెడికో స్టూడెంట్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఈ రోజు ఉదయం జరిగింది. విద్యార్థి మృతితో కాలేజీలో విషాదం నెలకొంది.అయితే అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
పెద్దపల్లి జిల్లాకు చెందిన సనత్ నిజామాబాద్ లో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇతని వయస్సు 21 సంవత్సరాలు. ఎంబీబీఎస్ మూడో సంవత్సరం ఫైనల్ పరీక్షలు పూర్తి చేసిన సనత్ ప్రాక్టికల్ పరీక్షల కోసం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఉన్నట్టుండి సనత్ హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు హాస్టల్ కు చేరుకున్నారు. విగత జీవిగా పడి ఉన్న కొడుకును చూసి బోరున విలపించారు. సనత్ మృతితో తోటి మిత్రులు విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సనత్ ఆత్మహత్యకు గల కారణాల గురించి ఆరా తీస్తున్నారు.
అయితే నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో గడిచిన మూడు నెలల కాలంలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జనవరి మాసంలో అదిలాబాద్ జిల్లా జన్నారం మండలం చెందిన ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న దాసరి హర్ష ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు. ఆ సంఘటన మర్చిపోక ముందే మెడికల్ కళాశాల విద్యార్థులు మరో మెడికో స్టూడెంట్ ఆత్మహత్య కలకలం రేపింది. ప్రభుత్వ వైద్య కళాశాలలో జరుగుతున్న వరుస సంఘటనలు విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. సనత్ సూసైడ్ పై నిజామాబాద్ ఒకటో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
లక్ష్మణుడు లేని రామాలయం ఇదొక్కటే..మీరు చూశారా? ఎక్కడుందంటే?
ఇక వరంగల్ ప్రీతి ఆత్మహత్య ఘటన కూడా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. సీనియర్ సైఫ్ వేధింపులు తట్టుకోలేక హానికరమైన ఇంజక్షన్ చేసుకున్న ప్రీతీ వారం రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది అయితే ప్రీతిది ఆత్మహత్య కాదు హత్య అని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.