హోమ్ /వార్తలు /telangana /

Ukraine Russia war: మెట్రో రైలు బ్రిడ్జి కింద బిక్కుబిక్కు మంటూ ఉన్నాం.. గంట గంటకూ బాంబులు పడుతూనే ఉన్నాయి.. ఉక్రెయిన్​ నుంచి వచ్చిన ఎంబీబీఎస్​ విద్యార్థిని హరిప్రియ ఆవేదన

Ukraine Russia war: మెట్రో రైలు బ్రిడ్జి కింద బిక్కుబిక్కు మంటూ ఉన్నాం.. గంట గంటకూ బాంబులు పడుతూనే ఉన్నాయి.. ఉక్రెయిన్​ నుంచి వచ్చిన ఎంబీబీఎస్​ విద్యార్థిని హరిప్రియ ఆవేదన

హరి ప్రియ

హరి ప్రియ

ఉక్రెయిన్‌ నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతోంది. ఉక్రెయిన్ నుంచి తెలుగు విద్యార్థులు భారత్ చేరుకుంటున్నారు. అయితే ఉక్రెయిన్ లో వైద్య విద్య అభ్యసిస్తున్న హరిప్రియ తన కుటుంబ‌స‌భ్యుల వ‌ద్ద‌కు చేరుకుంది. ఆమె మాట్లాడుతూ..

(న్యూస్18 తెలుగు ప్రతినిధిః పి మ‌హేంద‌ర్)

ఆపరేషన్‌ గంగ (Operation ganaga) పేరుతో ఉక్రెయిన్‌ నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతోంది. ఉక్రెయిన్ నుంచి తెలుగు విద్యార్థులు భారత్ చేరుకుంటున్నారు. దిల్లీ తెలంగాణ భవన్‌కు చేరుకున్న విద్యార్థులను స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఉక్రెయిన్ లో వైద్య విద్య అభ్యసిస్తున్న హరిప్రియ తన కుటుంబ‌స‌భ్యుల వ‌ద్ద‌కు చేరుకుంది.

కామారెడ్డి (kamareddy) జిల్లా బిబిపేట్ మండల కేంద్రానికి చెందిన హరిప్రియ (Haripriya) ఉక్రెయిన్ లోని ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో మూడో సంవత్సరం వైద్య విద్యను అభ్యసిస్తోంది. వైద్య విద్య కోసం హరిప్రియ గత మూడు సంవత్సరాల క్రితం ఉక్రెయిన్ దేశంకు వెళ్ళింది. అక్కడ రెండు సంవత్సరాల పాటు  విద్యనభ్యసించి, 10 నెలల క్రితం స్వగ్రామమైన బిబిపేట గ్రామానికి వచ్చింది.  గ‌త 8 నెలల క్రితం తిరిగి వైద్య విద్య కోసం హరిప్రియ  ఉక్రెయిన్ కు వెళ్ళింది. అయితే హరిప్రియ విద్యనభ్యసిస్తున్న ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిట్ సమీపంలోనే యుద్ధం జరుగుతుంది. గత నెల 26వ తేదీన రష్యా ఉక్రెయిన్ యుద్ధం (Ukraine Russia war) ప్రారంభం కావడంతో విద్యాసంస్థలను ఉక్రెయిన్ ప్రభుత్వం మూసివేసింది. దీంతో హరిప్రియ ఉండే ప్రాంతంలోనే యుద్ధం జరుగుతుండటంతో హరిప్రియతో పాటు మిగిలిన పది మంది విద్యార్థులు యూనివర్సిటీ రైల్వే బంకర్లో తలదాచుకున్నారు.

ఎప్పుడు ఏమవుతుందోనని  విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. సుమారు నాలుగు రోజులపాటు తిండి, నీళ్లు దొరకక ఇబ్బంది పడ్డారు. చివరకు యూనివర్సిటీ రైల్వే బంకర్  నుంచి బయటపడ్డ హరిప్రియ (haripriya)తో పాటు పది మంది విద్యార్థులు ఇతర ప్రాంతంలో గల ఎయిర్ పోర్టుకు చేరుకొని కేంద్రప్రభుత్వం సాయంతో భారతదేశానికి వచ్చారు.  శుక్రవారం తెల్లవారుజామున హరిప్రియ స్వగ్రామమైన బిబిపేట గ్రామానికి చేరుకుంది. హరిప్రియ సురక్షితంగా ఇంటికి చేరుకోవడంతో తండ్రి చంద్రశేఖర్, త‌ల్లి భైరవాలతలు కుమార్తె హరిప్రియ ను ఆలింగనం చేసుకొని ఆనంద బాష్పాలు కార్చారు. స్పందించి తమ కుమార్తె హరిప్రియను  స్వగ్రామానికి సురక్షితంగా చేర్చిన ప్రభుత్వానికి హరిప్రియ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.


అయితే  ఉక్రెయిన్ లోని ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో చదువుకునేందుకు వెళ్లానని హ‌రిప్రియ చెబుతుంది..  ‘‘ప‌ది రోజుల పాటు చాలా ఇబ్బంది ప‌డ్డాం.. ఎప్పుడు ఏం జ‌రుగుతుంది.. అనేది ఎవ‌రికి తెలియదు.. ఫుడ్ కూడా  లేదు. నేను ఇంటికి చేరుకుంటాన‌ని అనుకోలేదు. గంట గంట‌కు బాంబులు ప‌డుతూనే ఉన్నాయి. మెట్రో రైల్వే అండర్ బ్రిడ్జి కింద (Hide Under Metro station bridge) బిక్కుబిక్కు మంటూ నరకయాతన ప‌డ్డాం.. మేం ఏలాగోల ఇంటికి చేరుకున్నాం. ఇంకా అక్క‌డ ఉన్న వారిని వారి వారి స్వ‌స్థాల‌కు చేర్చాల‌ని కోరుతున్నా’’ అన్నారు..

First published:

Tags: Kamareddy, Nizamabad, Russia-Ukraine War, Telangana students

ఉత్తమ కథలు