(న్యూస్18 తెలుగు ప్రతినిధిః పి మహేందర్)
ఉక్రెయిన్- రష్యా యుద్దం (Ukraine Russia war) కారణంగా ఉక్రెయిన్ లో చిక్కుకున్న నిజామాబాద్ (Nizamabad) జిల్లాకు చెందిన పది మంది విద్యార్థులు సొంతింటికి చేరుకున్నారు. విద్యార్థులంతా గత వారం రోజులుగా యుద్ద వాతావరణంలో భయం భయంగా కాలం వెల్లదీశారు. ఇంటికి ఏలా చేరుతామో అనే భయం వారిని వెంటాడింది. సైన్యం (Army) ఇచ్చే సూచనలు (Directions) పాటించి, ప్రాణాలు నిలబెట్టుకుని చివరకి సొంతింటికి చేరుకున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పిల్లల కొసం ఎదురు చూసిన తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. యుద్దం (Ukraine Russia war) మొదలైన నాటి నుంచి ఇంటికి వచ్చే వరకు వారికి ఏదురైన సమస్యలు, వారి ప్రాణ రక్షణ కోసం పడిన పాట్లు.. స్వదేశానికి రావాడానికి వారు ప్రయాణించిన తీరు.. ఇండియన్ ఎంబసీ చేసిన సహాయన్ని గురించి ఓ ఎంబీబీఎస్ స్టూడెంట్ చైతాలి (MBBS student Chaitali) వివరించింది .
శబ్దం వచ్చినప్పుడల్లా దాక్కునే వాళ్లం..
నిజామాబాద్ (Nizamabad) నగరానికి చెందిన సతీష్, సంగీత దంపతుల కూతురు చైతాలి (Chaitali) ఉక్రెయిన్ నుంచి క్షేమంగా ఇంటికి చేరుకుంది. దీంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అయితే ఉక్రెయిన్ లో విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉందని ఎంబీబీఎస్ (MBBS) చివరి సంవత్సరం చదువుతున్న చైతాలి చెబుతోంది. ఆమె మాట్లాడుతూ..‘‘ ఇక్కడి నుంచి ఎలా బయట పడుతామని చాలా భయమేసింది. ఎవరు కూడా వీధుల్లోకి రావద్దని అక్కడి మిలటరీ సూచనలు జారీ చేసింది. దీంతో మేం శబ్దం వచ్చినప్పుడల్ల మా అపార్టు మెంట్ కింద బంకర్ (Bunker) లోకి వెళ్లి దాక్కునే వాల్లం.. నేను నాతో పాటు మరో ఇద్దరు హైదరాబాద్ అమ్మాయిలు (Hyderabad girls) ఉండేవారిమి.. మేం ముందే సరిపడ ఫుడ్ తెచ్చుకున్నాం.. అయితే మా కళ్ల ముందే ఓ విద్యార్థి వీధిలోకి వెళ్లి ప్రాణాలు పొగోట్టుకున్నాడు.
స్కూల్ బస్సులు, టాక్సీలలో ప్రయాణించాం..
అక్కడి నుంచి బయట పడితేనే ఇండియాకు (India) వెళతామని అనిపించింది. దీంతో వెంటనే ఉదయం 8 గంటలకు మేం ఉన్న చోటు నుంచి బయలు దేరాం. దొరికిన రైలు ఎక్కేసి నియరెస్టు బార్డర్ వెళ్లాం. అక్కడ ఉన్న ఉక్రెయిన్ (Ukraine) వారు మాకు సాయం అందించారు. స్కూల్ బస్సులు, టాక్సిలలో మమ్మల్ని పంపించారు. అక్కడి నుంచి యహుదిన్ అనే ఉక్రెయిన్ పోలాన్ బార్డర్కు చేరుకున్నాం. అక్కడ ఇండియాన్ ఎంబసీ మమ్మల్ని ఇండియాకు పంపించింది. “అని చైతాలి చెప్పింది. భారత ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆమె ధన్యావాదాలు తెలిపింది. అక్కడే చిక్కుకున్న వారిని కూడా ఇండియాకు తీసుకు రావాలని ఆమె కోరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.