హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nizamabad: ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా MBBS ఫ్రీ సీట్ కొట్టింది..ఇదెలా సాధ్యమైందో తెలుసా?

Nizamabad: ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా MBBS ఫ్రీ సీట్ కొట్టింది..ఇదెలా సాధ్యమైందో తెలుసా?

కోచింగ్ లేకుండా MBBS సీట్

కోచింగ్ లేకుండా MBBS సీట్

లాంగ్ టార్మ్ కోచింగ్ తీసుకున్న మెడిసిన్ లో మంచి ర్యాంక్ కొట్ట‌డం సాధ్యం కాదు. కానీ ఓ విద్యార్థిని ఎలాంటి కోచింగ్ లేకుండా యూట్యూబ్‌లో క్లాసులు చూసి ఎంబీబీఎస్ లో ఆల్ ఇండియా 40వేల 958 ర్యాంక్, తెలంగాణ స్టేట్ ర్యాంక్ 703, మేరీట్ ర్యాంక్ 980   సాధించింది.  కృషి, ప‌ట్టుద‌ల, ల‌క్ష్యంపై ప్రేమ ఉంటే ఎంత‌టి కఠిన పరీక్షనైనా జ‌యించవ‌చ్చని నిజామాబాద్ బిడ్డ నిరూపించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nizamabad, India

నిజామాబాద్ జిల్లా, న్యూస్ 18 తెలుగు ప్ర‌తినిధి, పి మ‌హేంద‌ర్  

లాంగ్ టార్మ్ కోచింగ్ తీసుకున్న మెడిసిన్ లో మంచి ర్యాంక్ కొట్ట‌డం సాధ్యం కాదు. కానీ ఓ విద్యార్థిని ఎలాంటి కోచింగ్ లేకుండా యూట్యూబ్‌లో క్లాసులు చూసి ఎంబీబీఎస్ లో ఆల్ ఇండియా 40వేల 958 ర్యాంక్, తెలంగాణ స్టేట్ ర్యాంక్ 703, మేరీట్ ర్యాంక్ 980   సాధించింది.  కృషి, ప‌ట్టుద‌ల, ల‌క్ష్యంపై ప్రేమ ఉంటే ఎంత‌టి కఠిన పరీక్షనైనా జ‌యించవ‌చ్చని నిజామాబాద్ బిడ్డ నిరూపించింది. కోచింగ్ వెళ్ళడానికి ఆర్థిక స్థోమ‌త లేదని బాధపడకుండా త‌న‌కు వెసులు బాటుతో చ‌దువుకుని త‌న‌ లక్ష్యం దిశ‌గా ముందుకు సాగుతున్న హ‌రిక సిద్దిపేట మెడిక‌ల్ కాలేజీలో ఫ్రీ సీట్ సాధించింది.

Peddapalli: ఇంటింటా చదువుల పంటతో సత్ఫలితాలు.., స్మార్ట్‌ఫోన్‌లో రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండి

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవ్‌వాడకు చెందిన సతీశ్‌కుమార్, అనురాధలకు ఇద్ద‌రు పిల్ల‌లు. కొడుకు ఈశ్వ‌ర్, కూతురు హారిక ఉన్నారు. వీరి తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి బీడీ కార్మికురాలిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అయితే కూతురు, కోడుకును త‌న స్థోమ‌త‌కు మించి చ‌దివించింది. వారు మంచిగా  చ‌దువుకున్నారు. చ‌దువులో ఇద్ద‌రు కూడా చురుకైన వారే..కూతురు హారిక పదో తరగతి, ఇంటర్​మీడియట్​ పరీక్షల్లో మంచి ​మార్కులు సాధించింది. అయితే హ‌రికకు డాక్ట‌ర్ కావాల‌నే కోరిక ఉంది. అయితే వారి ఆర్థిక స్థోమ‌త లేక కోచింగ్ ఇప్పించలేక పోయారు. అయితే హ‌రిక మాత్రం త‌న ల‌క్ష్యం కోసం యూట్యూబ్ లో నీట్ క్లాసులు విని నీట్ ప‌రిక్ష‌కు సిద్ద‌మైంది.

ఇది చదవండి: గింజ గింజకూ విలువ, 35ఏళ్లుగా ఈయన చేస్తున్న పనికి సలాం కొట్టాల్సిందే..!

ప్ర‌తి రోజు క్లాస్ వింటూ సాద‌న చేసింది. దీంతో  ఈ సంవత్సరం నిర్వహించిన నీట్ ఎగ్జామ్‌లో  ఆలిండియా స్థాయిలో  40 వేల 958 ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 703 ర్యాంక్‌, మేరీట్ లో 980 ర్యాంక్ సాధించింది. సిద్దిపేటలోని మెడిక‌ల్ కాలేజీలో ఫ్రీ సీట్ వ‌చ్చింది.  తన కోరిక డాక్ట‌ర్ కావాల‌నే ల‌క్ష్యంలో మొద‌టి అడుగులో విజ‌యం సాధించింది. కానీ మెడిసిన్ చ‌దువాలంటే ఫీజు, హాస్టల్, బుక్స్ ఫీజులు కలిపి కనీసం రూ.రెండు లక్షల వరకు కట్టాల్సిన పరిస్థితి. ఈ డబ్బులు లేకపోవడంతో చదువుకు దూరమవుతానేమోనని ఆవేదన చెందింది. అయితే  తాను ఎంబీబీఎస్​ చదివేందుకు దాతలు ఆర్థిక సాయం అందించాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ క‌విత‌ను క‌లిసారు. అయితే ఎమ్మెల్సీ క‌విత త‌న చ‌దువుకు అయ్యే ఖ‌ర్చులు పూర్తిగా భరిస్తానని చెప్ప‌డంతో హ‌రిక సంతోషానికి అవధులు లేవు. మ‌రోవైపు బీజేపీ నాయ‌కులు ద‌న్ పాల్ సూర్య‌నారాయాణ కూడా విష‌యం తెలుసుకుని హ‌రిక ఇంటికి వెళ్లి క‌లిసారు. ద‌న్ పాల్ ల‌క్ష్మీ, విట్ట‌ల్ ట్రాస్ట్ ద్వారా 25 వేల తక్షణ స‌హ‌యం అందించారు. ఒక అన్నాల అండ‌గా ఉంటాన‌ని వారికి భరోసా ఇచ్చారు.

డాక్ట‌ర్ కావాల‌నేది నా అంబిష‌న్ అని హ‌రిక చెబుతుంది. అయితే మా చిన్నతనంలోని మా నాన్న గారు చనిపోయారు. మా ఆర్థిక స్తోమత కూడా అంతంతమాత్రంగా ఉంది.  సుభాష్ నగర్ లోని హోలీ మేరీ హైస్కూల్లో మేడం త‌క్కువ పీజ్ తీసుకుని నాకు మా అన్న‌కు చ‌దువును ఇచ్చారు. టెన్త్ లో కూడా మంచి మార్కులు రావడంతో మేడం నన్ను కాకతీయ కాలేజీలో ఫ్రీ సీట్లు ఇప్పించింది. ఇంటర్ కూడా కంప్లీట్ చేశాను..  డాక్టర్ అవ్వాలనే నా అంబిషన్. నా అంబిషన్ను పులిపిల్ చేసుకోవడానికి కోచింగ్ ఇప్పించే ప‌రిస్థితి లేదు. దీంతో యూట్యూబ్ లో నీట్ క్లాసెస్ విని చదువుకున్నాను.. పరీక్షకు సిద్ధమయ్యాను. నీట్ ప‌రిక్ష రాసాను.. నీట్ లో నాకు 563 మార్క్ లు వచ్చాయి.  ఆల్ ఇండియా 40,958వ‌ ర్యాంక్,  తెలంగాణ‌ స్టేట్ 703  ర్యాంక్, మేరీట్ లో 980వ‌ ర్యాంక్  వచ్చింది. మెడికల్ కాలేజ్ సిద్దిపేటలో నాకు సీట్ వచ్చింది. అయితే కాలేజీలో ఫీజు కట్టేందుకు మాకు ఇబ్బందిగా ఉంది. మా ఆర్థిక స్తోమత స‌రిపోవ‌డం లేదు. దీంతో నా చ‌దువుకు సహాయం చేయాలని ఎమ్మెల్సీ కవిత మేడంను మా అమ్మ‌, అన్న, నేను క‌లిసాము.. క‌విత‌ మేడం సహాయం చేసేందుకు ఒప్పుకున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేసింది.

First published:

Tags: MBBS, Nizamabad, Telangana

ఉత్తమ కథలు