హోమ్ /వార్తలు /telangana /

Kamareddy canal: కాలువలోకి దిగితే తిరిగి వస్తామనే గ్యారంటీ లేదు.. దిగకపోతే బతుకుతామనే ఆశ లేదు.. ఆ ఊరి ప్రజలకు ఎన్ని కష్టాలో..!

Kamareddy canal: కాలువలోకి దిగితే తిరిగి వస్తామనే గ్యారంటీ లేదు.. దిగకపోతే బతుకుతామనే ఆశ లేదు.. ఆ ఊరి ప్రజలకు ఎన్ని కష్టాలో..!

కాలువు దాటుతున్న గ్రామస్థులు

కాలువు దాటుతున్న గ్రామస్థులు

దశాబ్దాలుగా ఆ కాలువ ఎంతో మంది ప్రాణాల‌ను (Lives) బలితీసుకుంది..  ఉపాధి కావాలంటే ప్రాణాలకు తెగించి కాలువ (Canal) దాటాల్సిందే.. కూలీనాలి చేసుకునే గ్రామ ప్రజలకు  (Village people) కాలువ దాట‌డం కత్తి మీద సాములా తయారైంది.

(పి మహేందర్​, News18, Nizamabad)

దశాబ్దాలుగా ఆ కాలువ దాటుతున్న‌ ఎంతో మంది ప్రాణాల‌ను (Lives) బలితీసుకుంది..  ఉపాధి కావాలంటే ప్రాణాలకు తెగించి కాలువ (Canal) దాటాల్సిందే.. కూలీనాలి చేసుకునే గ్రామ ప్రజలకు  (Village people) కాలువ దాట‌డం కత్తి మీద సాములా తయారైంది. పాలకులు మారినా ఆ గ్రామ‌స్తుల త‌ల‌రాత మాత్రం మార‌డం లేదు. ఎక్క‌డ వేసిన గొంగ‌డి అక్క‌డే అన్న‌ట్టుగా ఉంది.. కాలువ‌పై వంతేన నిర్మించి ఆదుకోవాల‌ని ఆ గ్రామాస్తులు వేడుకుంటున్నారు. కామారెడ్డి  (kamareddy) జిల్లా నాగిరెడ్డిపేట మండలం లింగంపల్లి కలాన్ (Lingampally kalaan) గ్రామం..  ఈ గ్రామంలో సుమారు ఐదు వంద‌ల కుటుంబాలు (Five hundred Families) ఉన్నాయి.. అయితే గ్రామ శివారు నుంచి పోచంపాడు కాలువ‌ (Pochampadu canal) వెళుతుంది.. ఎప్పుడు  కాలువలు నిండుగా  పారుతుంది.. దశాబ్దాలుగా  కాలువ దాటుతుండ‌గా చాలా మంది దుర్మరణం (Dying while crossing) చెందారు.. ఈ గ్రామ ప్రజలు ఉపాధి హామీ పనులకు వెళ్లాలంటే.. ఈ కాలువ‌ను దాటుకుని వెళ్లాలి. లేదా ఐదు కిలో మీట‌ర్లు తిరిగి రావాల్సి ఉంటుంది.. పడి  మీట‌ర్లు దిగితే పోయేది.. ఐదు కిలోల మీట‌ర్లు న‌డవ‌డం క‌ష్టంగా మారింది.. దీంతో  మ‌రో మార్గం లేదు..  కాలి నడకన వెళ్లేవారికి 5 కిలోమీటర్లు తిరిగి రావడం తీవ్ర ఇబ్బందిగా మారడంతో ప్రాణాలకు తెగించి ఈ కాలువ‌ను దాటుకుని వెళ్లుతున్నారు. ఇలా కాలువ దాటుతుండ‌గా ఇప్ప‌టికే ప‌దుల సంఖ్య‌లో ప్రాణాలు కోల్పోయారు.

కానీ ఈత రాని వారు..

కాలువ (canal) దాటుతున్న ఈ దృశ్యాన్ని చూస్తే వారి క‌ష్టం అర్థమవుతుంది. అయితే ఈత వ‌చ్చిన వారు అటూ ఇటూ వెళ్ళడానికి ధైర్యం చేస్తున్నారు.. కానీ ఈత రాని వారు మరొకరి సహాయం తీసుకుని వెళ్తున్నారు. అయితే ఈ వంతెన (Bridge) నిర్మించాల‌ని  గత పది సంవత్సరాలుగా గ్రామ ప్రజలు (Village people) అధికారులను నాయకులను కోరుతూనే ఉన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఈ విషయంపై మాట్లాడుతున్న నాయకులు.. ఆ తర్వాత పూర్తిగా మర్చిపోతున్నార‌ని గ్రామ‌స్తులు ఆవేద‌న చెందుతున్నారు.

నాయకులు (leaders) మారినా గ్రామ ప్రజల తలరాతలు మాత్రం మారడం లేదని వాపోతున్నారు. ఏది ఏమైనా అధికారులు పట్టించుకోని ప్రజల ప్రాణాలను గుర్తించి వంత్తేన నిర్మించాల‌ని వారు కోరుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని స్థితిలో ఉన్న మాకు ఉపాధి కూలీ కి వెళ్తే త‌ప్ప పొట్ట‌గ‌డ‌వ‌ద‌ని రాజ‌న్న అంటున్నారు. ప్ర‌తి దోతి నెత్తిన పెట్టుని పార‌, గ‌డ్డ‌పార ప‌ట్టు కుని కాలువ దాటుతున్నామ‌ని చెబుతున్నారు. ఆడ‌వారు కూడా మాతో పాటు నీటిలో నానుకుంటు కాలువ దాటుతున్నారు.. ఆవే త‌డిబ‌ట్ట‌ల‌తో ఉపాధి కూలీ పని చేస్తున్నారని చెప్పారు..

First published:

Tags: Kamareddy, Villagers

ఉత్తమ కథలు