NIZAMABAD MAN WASHED AWAY IN RAMADUGU PROJECT WHILE TAKING SELFIE SU
సెల్పీ మీద మోజు.. ప్రమాదవశాత్తు ప్రాజెక్టులో పడి వ్యక్తి మృతి
నవీన్
సెల్ఫీ మీద పిచ్చితో నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడు మృతి చెందాడు. రామడుగు ప్రాజెక్టును చూసేందుకు వెళ్లి అక్కడ సెల్ఫీ దిగుతుండగా నీళ్లలో జారిపడి ప్రాణాలు కోల్పోయాడు
సెల్ఫీ మీద పిచ్చితో నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడు మృతి చెందాడు. రామడుగు ప్రాజెక్టును చూసేందుకు వెళ్లి అక్కడ సెల్ఫీ దిగుతుండగా నీళ్లలో జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు.. ధర్ఫలి మండలంలోని రామడుగు ప్రాజెక్టు పొంగిపోర్లుతుంది. దీంతో ప్రాజెక్ట్ అందాలు చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా ప్రజలు వస్తున్నారు. ఈ క్రమంలో నడిపెళ్లికి చెందిన నవీన్ అనే యువకుడు శనివారం ప్రాజెక్టును సందర్శించేందుకు వచ్చాడు. ప్రాజెక్టు వద్ద అలుగు పైకెక్కి సెల్ఫీ దిగే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కాలు జారీ నీటిలో పడిపోయాడు. దీంతో నిన్న సాయంత్రం నుంచి గజ ఈతగాళ్లు అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఫలితం కనిపించలేదు. దీంతో నవీన్ మృతదేహాం కోసం గాలింపు ముమ్మరం చేశారు.
ఇక, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకల వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉంది. అయితే ఈ దృశ్యాలను తమ ఫోన్లలో, కెమెరాల్లో బంధించే క్రమంలో కొన్ని చోట్ల యూత్ డేరింగ్ ఫీట్స్ చేస్తున్నారు. ఇలాంటి చర్యలు ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉందని చెబుతున్న పలువురు వినిపించుకోవడం లేదు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.