ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన వ్యక్తి.. 15 ఏళ్ల తర్వాత తిరిగి సొంతూరికి.. కొద్ది రోజుల్లోనే అతడికి అసలు నిజం తెలిసి..

ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి

ఓ వ్యక్తి ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. తన తండ్రి బాగోగులు చూసుకోమని మేనత్తకు చెప్పి గల్ఫ్ దేశానికి వెళ్లిపోయాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 ఏళ్ల తర్వాత గల్ఫ్ నుంచి తిరిగి వచ్చాడు. గల్ప్ నుంచి తిరిగొచ్చిన తర్వాతే అతడికి ఓ దారుణ నిజం తెలిసింది.

 • Share this:
  ఓ వ్యక్తి ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. తన తండ్రి బాగోగులు చూసుకోమని మేనత్తకు చెప్పి గల్ఫ్ దేశానికి వెళ్లిపోయాడు. అతడి తండ్రి చనిపోయినప్పుడు ఓసారి వచ్చినా, మళ్లీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వెంటనే వెళ్లిపోయాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 ఏళ్ల తర్వాత గల్ఫ్ నుంచి తిరిగి వచ్చాడు. గల్ప్ నుంచి తిరిగొచ్చిన తర్వాతే అతడికి ఓ దారుణ నిజం తెలిసింది. మేనత్త చేసిన మోసం గురించి బయటికొచ్చింది. అంతే తనకు న్యాయం చేయాలంటూ ఊళ్లో పంచాయితీ పెట్టించాడు. అయినప్పటికీ లాభం లేకపోవడంతో అధికారుల చుట్టూ తిరిగాడు. అయినా ఫలితం లేకపోవడంతో చివరకు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు వెళ్లి అక్కడే ఆత్మహత్యాయత్నం చేశాడు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం యానంపల్లి గ్రామానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి కొన్నాళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. తన తండ్రి బాగోగులు చూసుకోమని మేనత్తకు చెప్పి అతడు ఎడారి దేశానికి వలస వెళ్లాడు. అతడి తండ్రి చనిపోయినప్పుడు కూడా ఓసారి వచ్చి అన్ని కార్యక్రమాలు చూసుకుని వెంటనే వెళ్లిపోయాడు. తాజాగా 15 ఏళ్ల తర్వాత అతడు స్వగ్రామానికి వచ్చాడు. ఇక్కడే ఉండి సెటిల్ అవుదామనుకున్నాడు. అయితే అప్పుడే అతడికి ఓ దారుణ నిజం తెలిసింది. తండ్రి పేరు మీద ఉన్న ఎకరం 20 కుంటల భూమి, ప్రధాన రహదారి పక్కనే ఉండే 144 గజాల స్థలాన్ని మేనత్త అమ్మేసుకుందనీ, అక్రమంగా సొమ్ముచేసుకుందని సంతోష్ కు తెలిసొచ్చింది. దీంతో అతడు తనకు జరిగిన అన్యాయం గురించి పెద్ద మనుషుల వద్ద పంచాయితీ పెట్టించాడు.

  ఇది కూడా చదవండి: ఆ రోడ్డు కింద ప్రతీ అడుగుకో శవం.. తవ్వితే బయటపడే ఎముకల గుట్టలు.. వెన్నులో వణుకుపుట్టించే రియల్ స్టోరీ ఇది..!

  అయినప్పటికీ లాభం లేకపోవడంతో కనిపించిన అధికారినల్లా పట్టుకుని తనకు న్యాయం జరిపించాలని కోరాడు. చివరకు కలెక్టర్ దృష్టికి తన సమస్యను తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం ప్రజావాణి ఉండటంతో అతడు కలెక్టరేట్ కు వచ్చాడు. కలెక్టరేట్ ఎదుట కిరోసిన పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు అతడిని నిలువరించారు. అతడి గురించి తెలుసుకుని, కలెక్టర్ కు అతడి దరఖాస్తును అందజేశారు. ‘నా పొలాన్ని నాకు అప్పగించండి. నా ఫ్లాట్ ను నాకు ఇప్పించండి. నాకు న్యాయం చేయండి‘ అంటూ అతడు కోరుతున్నాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకోని స్టేష‌న్ కు త‌ర‌లించారు. అయితే ఈ విష‌యం పై విచారించి న్యాయం చేస్తామ‌ని అధికారులు తెలిపారు.
  ఇది కూడా చదవండి: చేయని నేరానికి 20 ఏళ్లు జైల్లోనే మగ్గిపోయిన విష్ణు.. 43 ఏళ్ల వయసులో నిర్దోషిగా విడుదలయ్యాక ప్రస్తుతం ఏం చేస్తున్నాడంటే..
  Published by:Hasaan Kandula
  First published: