(P.Mahendar,News18,Nizamabad)
ప్రేమకి కులం, మతం, ప్రాంతం, దేశం అనే తేడాలేదని తెలంగాణ అబ్బాయి(Telangana Boy), బంగ్లాదేశ్ అమ్మాయి(Bangladeshi girl)నిరుపించారు. ఉపాధి కోసం జోర్దాన్(Jordan)దేశం వెళ్లిన అబ్బాయికి.. అక్కడికే వచ్చిన బంగ్లాదేశ్ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే వారి ఆనుబంధానికి కరోనా (Corona)మహమ్మారి అడ్డుపడింది. దాంతో రెండేళ్ల ఎడబాటు తర్వాత మళ్లీ ఒక్కటయ్యారు. ఈ ప్రేమజంట పెళ్లి చూడాలేకపోయామని బాధపడిన కుటుంబ సభ్యులు మళ్లీ పెళ్లి చేసికి తమ సంతోషాన్ని అందరితో పంచుకున్నారు. ఈ ప్రేమికుల మళ్లీ పెళ్లికి నిజామాబాద్(Nizamabad)జిల్లా వేదిక అయ్యింది.
అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి..
ప్రేమలో ఏదో తెలియని ఆకర్షణ ఉంటుంది. అందుకే నచ్చిన వ్యక్తి ఎంత దూరంగా ఉన్న కలవాలని అనుకుంటూ కలిసిపోతారు. నిజామాబాద్ జిల్లాలో కూడా అదే జరిగింది. జిల్లాలోని వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన గుమ్మల యాదగిరి, కమల దంపతుల కుమారుడు గుమ్మల హరీష్ ఐదేళ్ల క్రితం ఉపాధి కోసం జోర్డాన్ దేశానికి వెళ్లాడు. అయితే బంగ్లాదేశ్‌కు చెందిన రిషి అనే అమ్మాయి కూడా ఉపాధి కోసం జోర్దాన్‌కు వచ్చింది. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమ మారడంతో ఒకరినొకరు విడిచి ఉండలేకపోయారు. పరస్పరం అంగీకారంతో నాలుగేళ్ల క్రితం జోర్దాన్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు.
పెళ్లి తర్వాత రెండేళ్ల ఎడబాటు..
హరీష్, రిషిల ప్రేమ కాపురానికి కరోనా అడ్డుపడింది. రెండేళ్ల క్రితం గుమ్మల హరీష్ స్వగ్రామమైన వేల్పూరుకు వచ్చాడు. అప్పుడు కరోనా సోకడంతోతిరిగి జోర్డాన్ వెళ్లలేకపోయాడు. పాస్‌పోర్ట్ రెన్యూవల్ , కోవిడ్ పరిస్థితుల కారణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు రెండేళ్లుగా కలవకుండా దూరంగా బ్రతికాడు. మరికొన్ని కారణాల వల్ల రిషి సైతం వేల్పూరు రాలేకపోయింది. లాక్‌డౌన్ తొలగించిన తర్వాత పరిస్థితులు పూర్తిగా అనుకూలించడంతో గత నెలరోజుల క్రితం రిషి వేల్పూర్‌లోని హరీష్ వద్దకు చేరింది.
రెండో సారి జరిగిన ప్రేమ పెళ్లి..
హరీష్ రిషిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశాడు. కరోనా కారణంగా ఆ పెళ్లి చూడలేకపోయామని బాధపడిన హరీష్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో మరోసారి పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టారు. కన్నవాళ్ల మాట కాదనలేకపోయిన హరీష్, రిషి మరోసారి వివాహం చేసుకున్నారు. ఆదివారం మంచి ముహూర్తం ఉండడంతో మండలంలోని వెంకటాపూర్ వేంకటేశ్వర ఆలయంలో వేదమంత్రాల సాక్షిగా కుటుంబసభ్యుల ఆశీర్యాల మధ్య మరోసారి ఒక్కటయ్యారు. బంగ్లాదేశ్ అమ్మాయితో వేల్పూరుకు చెందిన హరీష్ వివాహ వేడుకను గ్రామస్తులు కూడా ఆసక్తీగా తిలికించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Love marriage, Nizamabad, Telangana News