హోమ్ /వార్తలు /తెలంగాణ /

Love Story: ప్రేమజంటపై పెద్దల పగ .. వద్దంటే పెళ్లి చేసుకున్నారని ఏం చేశారో తెలుసా..?

Love Story: ప్రేమజంటపై పెద్దల పగ .. వద్దంటే పెళ్లి చేసుకున్నారని ఏం చేశారో తెలుసా..?

lovers fight

lovers fight

Love Story: రెండేళ్లుగా ప్రేమించుకున్నారు.. వీరి పెళ్లికి పెద్ద‌లు ఆంగీక‌రించాలేదు.. దీంతో పెద్ద‌ల‌ను ఎదిరించి వివాహం చేసుకున్నారు.. ప్రియురాలి కుటుంబ స‌భ్యుల నుంచి ప్రాణాహ‌ని ఉంద‌ని ప్రేమ జంట పోలీస్ కమిషనర్ ను ఆశ్రయించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Nizamabad, India

(P.Mahendar,News18,Nizamabad)

రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. వాళ్ల పెళ్లికి పెద్ద‌లు ఆంగీక‌రించాలేదు. దీంతో పెద్ద‌ల‌ను ఎదిరించి వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ప్రేమజంట బెదిరింపులు, దాడులను ఎదుర్కొంది. ప్రియురాలి కుటుంబ స‌భ్యుల నుంచి ప్రాణాహ‌ని ఉంద‌ని గ్రహించి రక్షణ కల్పించమంటూ ప్రేమ జంట పోలీస్ కమిషనర్(Commissioner of Police) ను ఆశ్రయించింది. నిజామాబాద్(Nizamabad)జిల్లా నందిపేట( Nandipet)మండల కేంద్రంలో ఈ ట్రాజిడీ లవ్ స్టోరీ జరిగింది. నందపేటకు చెందిన నితీష్(Nitish)అనే 23ఏళ్ల యువకుడు నిహారిక (Niharika)రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. కలిసి జీవించాలని నిర్ణయించుకొని పెళ్లి చేసుకుంటామని పెద్దలకు చెప్పారు. అందుకు అమ్మాయి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.

ఒక్కటైన ప్రేమజంట..

ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో మేజర్లైన నితీష్, నిహారిక నిజామాబాద్‌లోని ఆర్యసమాజ్ లో ఈ నెల 15న వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహం ఇష్టం లేని అమ్మాయి నిహారిక తల్లిదండ్రులు, వారి బంధువులు నితీష్‌ని బెదిరించసాగారు. గత రెండు రోజుల క్రితం నితీష్ కుటుంబ సభ్యులపై దాడి చేయడంతో భయపడిపోయిన ప్రేమజంట సీపీ కార్యాలయానికి వెళ్లి జరిగినదంతా చెప్పారు. తమకు నిహారిక కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని ఎలాగైనా రక్షణ కల్పించాలని వేడుకున్నారు. నిహారిక బంధువులు నితీష్‌ ఇంటికొచ్చి దాడి చేసిన సీసీ ఫుటేజ్‌ని సీపీకి అందజేశారు.

Telangana: TS PSC పేపర్ లీక్‌ స్కామ్‌లో మరో నలుగురు బుక్ ..సిట్‌ అధికారులకు ఎలా దొరికారంటే

పెద్దలతో ప్రాణహాని..

ప్రేమజంటను యువతి కుటుంబ సభ్యులు బెదిరించిన వీడియోలకు సంబంధించిన సీసీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ముందుగా ప్రేమజంట రక్షణ కోసం ఆర్మూర్‌లోని ఏసీపీ ఆఫీస్‌కు వెళ్లారు. అక్కడ అధికారులు అందుబాటులో లేకపోవడంతో నిజామాబాద్ సిపి కార్యాలయానికి వచ్చి కంప్లైంట్ చేశారు. పోలీస్ కమిషనర్ నాగరాజు ప్రేమజంట కంప్లైంట్‌ను మహిళా పోలీస్ స్టేషన్ కు రిఫర్ చేశారు. మహిళా పోలీస్ స్టేషన్ లో ప్రేమ జంటతో పాటు వారి కుటుంబ సభ్యులకు సిఐ కౌన్సిలింగ్ ఇవ్వ‌నున్నారు.

పోలీసుల్ని ఆశ్రయించిన జంట..

ఈవిషయంలో నితీష్‌ నిహారిక కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని తమకు ర‌క్ష‌ణ కావాల‌ని కోరుతున్నాడు. అటు అమ్మాయి నిహారిక కూడా తనకు, తన భర్తకు మా ఫ్యామిలీతో హానీ ఉందని చెబుతోంది. అంతే కాదు తమ ప్రేమ పెళ్లికి సహాకరించిన వ్యక్తిని కూడా కొట్టారని దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

First published:

Tags: Love marriage, Nizamabad police, Telangana News

ఉత్తమ కథలు