(P.Mahendar,News18,Nizamabad)
ప్రేమించుకున్నారు.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.. అయితే ఆ ప్రేమ వివాహం విఫలమైందని పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. బాదితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన వరప్రసాద్, పూజ ప్రేమ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.. వీరి ప్రేమను పెద్దలకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లి పోయారు.
అయితే వర ప్రసాద్, పూజ పిబ్రవరి 24న ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. పెళ్లి చేసుకున్న తరువాత బీబీపేట పోలీస్ స్టేషన్ కి వెళ్లారు.. వరప్రసాద్, పుజలను సముదాయించి పోలీసులు అబ్బాయిని .. అమ్మాయిని ఎవరి ఇంటికి వారిని పంపించారు.. పది రోజుల తరువాత అబ్బాయిని పిలిచి అమ్మాయికి నీవు ఇష్టం లేదట అని చెప్పారు.. అంతే కాదు..పూజ కుటుంబ సభ్యులు వర ప్రసాద్ ను భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో మనస్థాపానికి గురైన వరప్రసాద్ పురుగుల మందు త్రాగాడు.
దీంతో వరప్రసాద్ కుటుంబ సభ్యులు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువచ్చారు... శనివారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందాడు.. వర ప్రసాద్ మృతికి కారణమైన పోలీసులను, పూజ కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మృతుని కుటుంబ సభ్యులు, జనగామ గ్రామస్తులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.. దీంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో పోలీసులు భారీగా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట చేస్తున్న ఆందోళన కార్యక్రమానికి చేరుకున్నారు..
మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకునే వరకు ఇక్కడి నుండి వెళ్లేది లేదని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట వారి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు.వర ప్రసాద్ మృతికి కారణమైనా వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Local News, Love marriage, Nizamabad, Telangana