Home /News /telangana /

NIZAMABAD LIFE IMPRISONMENT FOR GRANDSON WHO KILLED GRANDMOTHER IN NIZAMABAD DISTRICT SNR NZB

Crime news: ఆ ఒక్క మాటకే నానమ్మను చంపాడు .. ఎలాంటి శిక్షపడిందో తెలిస్తే షాక్ అవుతారు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Crime news: తండ్రి లేడని మ‌న‌వ‌డ్ని పెంచి పెద్ద చేసింది నానమ్మ. చెడు వ్యసనాలకు అలవాటు పడటంతో గట్టిగా మందలించింది. పదే పదే నానమ్మ మందలిస్తోందని మనవడు ఆమెను హతమార్చాడు. చివరు అతనికి ఎంత పెద్ద శిక్షపడిందో తెలుసా.

  • News18 Telugu
  • Last Updated :
  • Nizamabad, India
    (P.Mahendar,News18,Nizamabad)
    తండ్రిని కోల్పోయిన మ‌న‌వ‌డ్ని పెంచి పెద్ద చేసింది. మ‌న‌వ‌డు(Grandson)చెడు వ్యసనాలకు బానిసవడంతో మంద‌లించి మంచి బుద్దులు చెప్పింది. మనవడికి నానమ్మ చెప్పే మాటలు నచ్చలేదు. పదే పదే చేసిన తప్పే చేస్తూ అడ్డదారులు తొక్కాడు. ఒక రోజు మ‌ద్యం తాగి వ‌చ్చిన మ‌న‌వడ్ని నాన‌మ్మ గ‌ట్టిగా మంద‌లించింది. దీంతో ఆగ్ర‌హించిన మ‌న‌వ‌డు నాన‌మ్మ(Grandmother)ను దారుణంగా కొట్టి చంపాడు(Killed). నిజామాబాద్(Nizamabad)జిల్లాలో ఓ తండ్రి లేని బిడ్డను పెంచి, పెద్ద చేసిన నానమ్మను చంపిన కేసులో నిందితుడికి ఎంత పెద్ద శిక్ష పడిందో తెలుసా.

    Telangana : తెరపైకి జిల్లా పేరు మార్పు అంశం .. సర్దార్ సర్వాయి పాపన్నపేరుతో మార్చాలని బీజేపీ డిమాండ్



    నానమ్మ మర్డర్ కేసులో మనవడే దోషి..
    నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. పాలు పోసి పెంచితే పాము సైతం కాటేయక తప్పదనే సామెతను గుర్తు చేశాడు ఓ యువకుడు. భీంగల్ మండలం మెండోరా గ్రామానికి చెందిన కొమిరె లక్ష్మీకి ముగ్గురు కుమారులు. చిన్న కుమారుడు భూమన్న మృతి చెందడంతో అతని కొడుకు గంగాధర్ ఇంటిలోనే మరో గదిలో నివాసం ఉండేవాడు. తండ్రి లేని కొడుకు అని గంగాధర్‌ను ప్రేమగా చూసుకునేది నానమ్మ లక్ష్మీ. గంగాధర్ మ‌ద్యానికి బానిసయ్యాడు. చెడు అలవాటు మానుకోమని నానమ్మ లక్ష్మీ మనవడికి పదే పదే చెప్పింది. గంగాధర్‌ ఆమె మాటల్ని లెక్కచేయకుండా రోజు తాగొచ్చేవాడు.


    రెండేళ్ల క్రితం హత్య ..
    రోజు వచ్చినట్లుగా గంగాధర్‌ ఫూటుగా మద్యం తాగి ఇంటికొచ్చాడు. మళ్లీ నానమ్మ నిలదీయడంతో గొడవపడ్డాడు. తాగిన మత్తులో విచక్షణ కోల్పోయి ఇంట్లో నిద్రపోతున్న నాన‌మ్మ ల‌క్ష్మిపై ఇటుకలు, కర్రలతో అతి దారుణంగా కొట్టి హత్య చేశాడు. ఈసంఘటన ఇప్పుడు జరిగింది కాదు. 2020 ఫిబ్రవరి నెలలో జరిగింది. అప్పట్లోనే నిందితుడు గంగాధర్‌పై హత్య కేసు నమోదైంది. దీంతో గంగాధర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు. దీంతో నాన‌మ్మ ల‌క్ష్మీ హ‌త్య కేసులో హత్య నేరారోపణలు రుజువు అయ్యాయి.

    Bathukamma sarees : ఉచితంగా పంపిణికి సిద్ధంగా ఉన్న కోటి 10లక్షల బతుకమ్మ చీరలు .. ఎప్పటి నుంచి ఇస్తారంటే



    జీవితఖైదు విధించిన కోర్టు..
    పెంచి, పెద్ద చేసిన నానమ్మను చంపింది మ‌న‌వ‌డు గంగాధర్‌ అని న్యాయస్తానం నిర్ధారించింది. నిందితుడికి నిజామాబాద్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల జీవిత కారాగాక శిక్షతో పాటు 2 వేల రూపాయ‌ల జ‌రిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. పెద్దలు సత్ప్రవర్తనగా నడుచుకోవాలని చెప్పే మాటలను పెడ చెవిన పెట్టడమే కాకుండా వారిపైనే కిరాతకానికి ఒడిగట్టడం ఏమాత్రం క్షమించరాని నేరంగా కోర్టు పరిగణిస్తూ ఈ తీర్పు వెల్లడించింది.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Nizamabad, Telangana crime news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు