నిజామాబాద్‌లో దారుణం, సాఫ్ట్ వేర్ ఉద్యోగిపై కబ్జారాయుళ్ల దాడి

భూకబ్జాదారులు వారి కబ్జాలకు అడ్డువచ్చే వారిపై దాడులకు సైతం వెనుకడడం లేదు. తాజాగా ఏరుగట్ల మండల కేంద్రంలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిపై కొందరు కబ్జాదారులు దాడి చేశారు.

news18-telugu
Updated: September 10, 2020, 11:05 PM IST
నిజామాబాద్‌లో దారుణం, సాఫ్ట్ వేర్ ఉద్యోగిపై కబ్జారాయుళ్ల దాడి
నిజామాబాద్ బోర్డ్
  • Share this:
నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూకబ్జాదారులు వారి కబ్జాలకు అడ్డువచ్చే వారిపై దాడులకు సైతం వెనుకడడం లేదు. తాజాగా ఏరుగట్ల మండల కేంద్రంలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిపై కొందరు కబ్జాదారులు దాడి చేశారు. ఏరుగట్ల గ్రామంలో 430 సర్వే నెంబర్ గల భూమి లో ప్రభుత్వానికి చెందిన భూమి ఉండడంతో దీని ఇన్ఫర్మేషన్ RTI యాక్ట్ ద్వారా సేకరించాడు. ఇది తెలుసుకున్న కబ్జాదారులు దీనికి సంబంధించిన విషయాలు నీకు ఎందుకు అని పలు మార్లు బెదిరింపులకు పాల్పడ్డారు. అయినా అతను లెక్కచేయకుండా ఆ ప్రభుత్వ భూమిలో ప్రభుత్వా నికి సంబంధించిన భవనాలు లేదా పిల్లల ఉద్యానవనం నిర్మించాలని పలువురు అధికారులకు వినతిపత్రాన్ని సమర్పించాడు. ఇది తెలుసుకున్న కొందరు కబ్జాదారులు అతనిని బైక్ పైకి వెంబడించి ఇంటి వద్ద విచక్షణ రహితంగా చితకబాదారు. దీనికి అడ్డు వచ్చిన బాధితుడి తల్లిని సైతం మహిళ అని చూడకుండా దౌర్జన్యనికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలు అన్ని అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.



వారి నుండి ఎలాగోలా తప్పించుకొని స్థానిక పోలీస్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేసాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు దాడి చేసిన తొమ్మిది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు మాట్లాడుతూ ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ భవనాలు లేదా పార్క్ నిర్మించాలని వినతిపత్రం ఇస్తే ఇలా దాడి చేయడం ఏంటన్నారు. దాడి చేసిన వారితో తనకు ప్రాణహాని ఉందని వారిపై కఠిన చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని కోరారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 10, 2020, 9:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading