Home /News /telangana /

NIZAMABAD KNIFE ATTACK IN KAMAREDDY DISTRICT CLASH BETWEEN NEIGHBOURS SNR NZB

Crime news : కామారెడ్డి జిల్లాలో పొరుగింటి వారితో కొట్లాట .. సైకోలా ప్రవర్తించడానికి కారణం ఏంటో తెలుసా

(కత్తిపోట్లు)

(కత్తిపోట్లు)

Crme News: ఇరుగు పొరుగు మధ్య జరిగిన చిన్న గొడవ కత్తులతో దాడి చేసి చేసుకునే వరకు వెళ్లింది. నూతన ఇంటి నిర్మాణం సందర్భంగా నిర్మాణానికి ఉపయోగించే సామాన్లను రోడ్డుపై వేశారంటూ గొడవదు దిగాడు. సర్ధిచెప్పేందుకు మధ్యలో వెళ్లిన వారిపై కత్తితో పొడిచాడు. ఈఘటనలో కత్తిపోట్లకు గురైన ఇద్దరూ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇంకా చదవండి ...
    (P.Mahendar,News18,Nizamabad)
    కామారెడ్డి Kamareddyజిల్లాలో దారుణ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇరుగు, పొరుగు ఉంటున్న ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన చిన్న వివాదం కత్తులతో దాడిKnife attack చేసుకునే వరకు వెళ్లింది. ఈఘర్షణలో అడ్డుకునేందుకు మధ్యలో వెళ్లిన వాళ్లు సైతం కత్తిపోట్లకు గురయ్యారు. ఒక వ్యక్తి క్షణికావేశంలో నరరూప రాక్షసుడిలా ప్రవర్తించడం చూసి పోలీసులు(Police)సైతం ఆశ్చర్యపోయారు.

    ఇది చదవండి : అందమైన అడవిలో.. ఎడారి వంటల విందు.. అరబ్ మండీ.. తింటే వదలరు



    రోడ్డుపై సామాన్లు వేశారని..
    కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లికి చెందిన ఈశ్వ‌ర్ బాయి తనకు చెందిన కాళీ స్తలంలో కొత్తగా ఇల్లు నిర్మిస్తోంది. ఇంటి నిర్మాణం కోసం తెచ్చిన ఇసుక‌, కంక‌రా, ఇటుక, సిమెంట్‌ బస్తాలను రోడ్డుపైనే వేశారు. నూతనంగా నిర్మిస్తున్న ఇంటి పక్కన ఉంటున్న అంగళ్ల స్వామి అనే వ్యక్తి కారులో వచ్చిన సమయంలో రోడ్డుపై ఇంటి నిర్మాణ సామాన్లు అడ్డుగా వేసి ఉండటంతో ఈశ్వర్‌బాయి భర్త, కొడుకుతో గొడవ పడ్డాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న చుట్టుపక్కల వాళ్లు వచ్చి సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.



    పొరుగింటి వాళ్లతో పంచాయితీ..
    అదే రోజు రాత్రి ప‌ది గంట‌ల స‌మ‌యంలో  ఈశ్వరబాయి పొరుగున ఉంటున్న వాళ్లతో ఉదయం జరిగిన గొడవపై మాట్లాడుతుండగా అంగళ్ల స్వామి కత్తి పట్టుకొని వచ్చాడు. ఈశ్వ‌ర్ బాయి కొడుకు శ్రీనివాస్‌ని వెంబడించి కత్తితో దాడి చేయబోయాడు. ఇంతలో శ్రీనివాస్‌ మేనమామ బాజి నరేంద్రరావు, కొమ్మసంతోష్ అనే మరో వ్యక్తి అడ్డుపడటంతో వారిని కత్తితో గాయపరిచాడు. ఇంటి పక్కన ఉంటున్న వారితో జరిగిన గొడవ విషయంలో అనవసరంగా ఇద్దరు వ్యక్తులను కత్తితో దాడి చేయడంతో ఇద్దరూ తీవ్ర‌గాయ‌పడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందకున్న పోలీసులు స్పాట్‌కి చేరుకొని బాధితుల్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

    ఇది చదవండి: 40ఏళ్లుగా రంగస్థలంపై ఆధారపడి కళకళలాడిన జీవితాలు .. ఇప్పుడు సర్కారు సాయం కోరుతున్నాయి



    రక్తం కళ్ల చూసిన వైనం..
    పాత కక్షలను మనసులో ఉంచుకొనే అంగళ్ల స్వామి తమపై హత్యాయత్నం చేయబోయాడని ఈశ్వరబాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు స్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వామి అనే వ్యక్తి ఎందుకింత క్రూరంగా ప్రవర్తించాడో తెలుసుకుంటామని పోలీసులు చెప్పారు. ఈకేసులో లోతుగా విచారించి నిందితుడికి శిక్షపడేలా చూస్తామని స్ధానిక ఎస్‌ఐ తెలిపారు.

    ఇది చదవండి : ఆ ఫోన్‌కాల్స్‌తో కరీంనగర్ జిల్లా ప్రజలు పరేషాన్ .. ఏం అడుగుతున్నారో తెలిస్తే షాక్ అవుతారు


    Published by:Siva Nanduri
    First published:

    Tags: Crime news, Kamareddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు