Home /News /telangana /

NIZAMABAD KAMAREDDY DISTRICT YOUNG FARMER WHO MADE LOW COST MACHINE FOR PLANTING PADDY SNR NZB

Farmer Talent : ఐటీఐ చదివిన యువకుడికి ఐఐటీ బ్రెయిన్‌ .. రైతుల మేలు కోసం ఏం కనిపెట్టాడో చూడండి

(FARMER TALENT)

(FARMER TALENT)

Farmer Talent: నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం కంటే ...కనిపెట్టాలనే ఉత్సాహం ఉంటే సరిపోతుందని కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువరైతు నిరూపించాడు. అందరూ టెక్నాలజీ సాయంతో వింత వస్తువులు, విచిత్రమైన యాప్‌లు కనిపెడుతుంటే.. తాను రైతులకు మేలు చేసే..ఖర్చు తగ్గించే యంత్రాన్ని తయారు చేసి శభాష్ అనిపించుకుంటున్నాడు.

ఇంకా చదవండి ...
  (P.Mahendar,News18,Nizamabad)
  నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం కంటే ...కనిపెట్టాలనే ఉత్సాహం ఉంటే సరిపోతుందని కామారెడ్డి(Kamareddy)జిల్లాకు చెందిన ఓ యువరైతు నిరూపించాడు. అందరూ టెక్నాలజీ(Technology) సాయంతో వింత వస్తువులు, విచిత్రమైన యాప్‌(App)లు కనిపెడుతుంటే.. రైతన్నకు మేలు చేసే వస్తువు సృష్టిస్తే బాగుంటుందని భావించాడు. పనిలో పనిగా ..వరినాట్లు వేసే యంత్రాన్ని(Spinning machine)తానే స్వయంగా తయారు చేసి రైతులకు ఖర్చుతో పాటు శ్రమ భారాన్ని తగ్గించాడు యువ రైతు నాగస్వామి(Nagaswamy).

  Cyber Crime : సైబర్‌ నేరగాళ్ల వలలో పడకుండా ఉండాలంటే ..సిద్దిపేట పోలీసులు చెప్పినట్లు చేస్తే చాలు  ఐఐటీ కాదు ఐటీఐ టాలెంట్..
  వ్య‌వ‌సాయంలో ఎన్నో నూత‌న ప‌ద్ద‌తులు అందుబాటులో ఉన్నాయి. వ్యవసాయం పూర్తిగా యంత్రాలతోనే సాగుతున్న పరిస్థితి కూడా కొన్నచోట్ల ఉంది. అయితే వరి సాగు విషయంలో మాత్రం నాట్లు వేసేందుకు గతంలో ఎన్నో యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. అందులో ఏవి పూర్తి స్థాయిలో  సౌకర్యంగా, లాభదాయకంగా లేకపోవడంతో రైతులు మళ్లీ కూలీలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తింది. వరి సాగుకు రైతులు పెట్టే ఖర్చు వరినాట్ల దగ్గరే ఎక్కువగా ఉండటంతో ఆ భారాన్ని తగ్గించడానికి కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన  కమ్మరి నాగస్వామి అనే యువరైతు నూతన యంత్రాన్ని తయారు చేశారు.  యువ రైతు రూపకల్పన..
  యువరైతు కమ్మరి నాగస్వామి చిన్న త‌నంలోనే  తండ్రి చనిపోవడంతో ఆర్ధికంగా ఇబ్బంది ప‌డ్డారు. ఐటీఐ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా ఉంటూ వచ్చాడు. కరోనా కష్టకాలం నాగస్వామి తలరాతను మార్చేసింది. ఉద్యోగాన్ని వదిలి స్వగ్రామానికి రావాల్సిన పరిస్థితి కలిగింది. ఉద్యోగం మానేసిన నాగస్వామి తమకున్న ఎకరం పొలంలో వ్యవసాయం చేస్తూ తల్లికి తోడుగా స్వగ్రామంలోనే బ్రతకాలని నిర్ణయించుకున్నారు. వ్యవసాయం చేయాలనుకున్న నాగస్వామికి వరినాట్లు వేసేందుకు రైతులు పడుతున్న అవస్థలు చూసి చలించిపోయాడు. ఖర్చుతో పాటు కూలీల కొరతను దృష్టిలో పెట్టుకొని తానే వరినాట్లు వేసేందుకు సొంతగా ఓ యంత్రాన్ని తయారుచేశాడు.

  Twist : రోడ్ యాక్సిడెంట్‌లో ట్విస్ట్ .. మృతుల్లో ఐదుగురు దొంగలే..! అసలేం జరిగిందంటే  వరినాటు యంత్రం తయారి..
  ప్రయత్నానికి సహాయం ఏదో రూపంలో ఉంటుందనే మాటను గుర్తుకు చేసుకున్న నాగస్వామి యూట్యూబ్ లో యాంత్రం గురించి పూర్తిగా అధ్యాయనం చేశారు. తన సోదరుడు సందీప్ కుమార్ సహకారంతో సంవత్సరం పాటు కష్టపడి వరినాటు వేసే యంత్రాన్ని తయారు చేశారు. ఈ వరినాటు యంత్రం తయారికి 12 వోల్ట్స్ రెండు బ్యాటరీలతో పాటు బీఆర్డీసీ మోటారును ఉపయోగించారు. దాదాపు 50 వేల రూపాయల ఖర్చుతో వరినాటే యంత్రాన్ని త‌యారు చేశారు యువరైతు నాగస్వామి. ఈ వరినాటు యంత్రం ఒకరు లాగుతూ ఉంటే బ్యాటరీల సాయంతో నడిచే మోటారుతో రూపొందించాడు.

  రైతులకు మేలు చేసే ఆలోచన..
  ఇక ఇది పని చేసే విధానం కూడా అంతే ప్రత్యేకంగా ఉండేలా డిజైన్ చేశారు యువరైతు. ఒకేసారి ఐదు వ‌రుస‌ల్లో నాట్లు వేస్తుంది. వ‌రి నారుకు మ‌ట్టి లేకుండా చేసి యంత్రంపైన పెడితే మోటర్‌కు అమర్చిన రెండు రాడ్లపై ఐదు వరినారు కుప్పలు పెట్టేలా అనువుగా తయారుచేశారు. ఎంతో శ్రమించి అతి తక్కువ ఖర్చుతో రైతులకు మేలు చేసే విధంగా ఉన్న ఈ వరినాటు యంత్రాన్ని ఉపయోగించి తన పొలంలోనే ప్రయోగాత్మకంగా వరి నాట్లు వేశారు రైతు నాగస్వామి.

  Minor Girl Rape : కలెక్టరెట్‌లో కామాంధుడు .. టెన్త్ విద్యార్ధినిపై రెండేళ్లుగా అత్యాచారం ఎక్కడంటే..?  ప్రశంసల వెల్లువ..
  యువరైతు పట్టుదల, తెలివి తేటలు చూసిన గ్రామస్తులు అతడ్ని అభినందించారు.అతి త‌క్కువ ఖర్చుతో యాంత్రాన్ని త‌యారుచేయంతో రైతుల‌కు వ‌రి నాటు ఖర్చులు త‌గ్గుతాయని నాగస్వామిని ప్ర‌శంశించారు. బిక్కనూరు వచ్చిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌కు ఎంపీపీ గాల్రెడ్డి  యువ రైతు త‌యారు చేసిన వ‌రి నాటే యంత్రాన్ని గురించి వివరించారు. దీంతో ఇంటింటికి ఇన్నోవేషన్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించే ప్రదర్శనకు జిల్లా నుంచి నాగస్వామిని పంపిస్తామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ తెలిపారు.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Farmer, Kamareddy, Telangana News

  తదుపరి వార్తలు