(P.Mahendar,News18,Nizamabad)
ప్రకృతి అందాల మద్య సుందరంగా జాలు వారుతున్న జలపాతం తెలంగాణ(Telangana)లోని పర్యాటకుల్ని, ప్రకృతి ప్రేమికుల్ని కట్టిపడేస్తోంది. చూట్టు దట్టమైన అటవి ప్రాంతం ఎత్తైన అలుగు నుంచి కిందకు జాలు వారుతున్న జలపాతం(Waterfall)అందాలను చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు తరలివస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంగా గంటసేపైనా గడపాలని తహతహలాడుతున్నారు. తాము పొందుతున్న అద్భుతమైన అనుభూతిని గుర్తుండిపోయే విధంగా ఆ జలపాతం దగ్గర ఫోటోలు(Photos), సెల్ఫీలు(Selfies) దిగుతున్నారు. రోజు రోజుకు పర్యాటకులతో సందడిగా మారుతోంది నిజామాబాద్ జిల్లాలో సిర్నాపల్లి (Sirnapalli)జానకీబాయి చెరువు(Janakibai Pond).
రోడ్డు మార్గం వేయండి..
వర్షాకాలంలో ఈ చెరువుపై నుంచి జాలువారుతున్న జలపాతం పర్యాటకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తోంది. ఈ సుందర దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు. పై నుండి జలధార కిందికి రావడంతో కంటి చూపును తిప్పుకోకుండా చూస్తుండి పోతున్నారు. ప్రకృతి ఒడిలో కనువిందు చేస్తున్న ఈసుందర దృశ్యాల్ని చూడటానికి రెండు కళ్లు చాలవంటున్నారు ఇక్కడికి వచ్చే పర్యాటకులు. చాలా పొడవైన అలుగు ఎత్తైన ప్రదేశం నుండి నీటి దారలు కిందికి వస్తుండటంతో ఈ అహ్లాదకరమైన వాతావరణాన్ని పర్యాటకులు ఎంతగానో ఆస్వాదిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nizamabad, Telangana News, Tourist place