(P.Mahendar,News18,Nizamabad)
వైద్యో నారాయణో హరి అంటే వైద్యుడు దేవునితో సమానం అని అర్థం. ఆ మాటలను నిజం చేస్తూ ఓ మహిళ వైద్యురాలు. గర్భిణీ మహిళలకు ఆడబిడ్డ పుడితే ఫ్రీ వైద్యం అందిస్తుంది. సమాజంలో ఆడబిడ్డలు పుడితే వారి వైద్యానికి అయ్యే ఖర్చును కూడా భారంగా భరిస్తున్నారనే ఉద్దేశంతో వారి డెలివరీ కి అయ్యే ఖర్చు రూపాయి కూడా తీసుకోకుండా నార్మల్, సిజేరినయన్ చేసిన ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు. మా కుటుంబంలో అందరం ఆడపిల్లలమే ఆ కష్టం నాకు తెలుసు. గత మూడు నెలల్లో 25 డెలివరీలు చేసారు. ఆ మహిళ వైద్యురాలు పై ప్రత్యేక కథనం..
ఈ రోజుల్లో వైద్యం అంటేనే ఎంతో ఖర్చుతో కూడుకుంది. డబ్బులు లేనిదే డాక్టర్ నాడీ కూడా పట్టని రోజులు అయినా నేనున్నానంటున్నారు డాక్టర్ శ్రావణిక రెడ్డి. కామారెడ్డి జిల్లా కేంద్రలోని మాతృశ్రీ హాస్పిటల్ గర్బీణిలకు ఉచితంగా కాన్పులు చేస్తున్నారు. ఆర్థికంగా బాధపడుతున్న చాల కుటుంబాలల్లో ఆడపిల్ల పుట్టిందంటే బారంగా బావించే మీకు మేరు అండగా ఉంటామని బారోసా కల్పిస్తున్నారు స్త్రీ వైద్య నిపుణురాలు శ్రావణిక రెడ్డి. గత మూడు నెలలుగా 25 మంది ఆడబిడ్డలకు జన్మనిచ్చిన గర్బీణిలకు ఉచితంగా డెలివరీ చేసారు. అయితే ఎక్కువగా నార్మల్ డెలివరీలు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. నార్మల్ డెలివరీ కానీ సమయంలోనే సిజేరినయన్ చేస్తున్నారు. తన ఆసుపత్రిలో గర్బీణిలు ఆడ బిడ్డకు జన్మనిస్తే రూపాయి కూడా ఆశించాకుడా వైద్యు అందస్తు అందరి మన్ననలు పోందుతున్నారు.
ప్రైవేట్ హాస్పిటల్లో మా బిడ్డను డెలివరీకి తీసుకెళ్తే 40 వేలు అడిగారని బైంసాకు చెందిన రాథోడ్ గన్ రాజు చెబుతున్నారు. నేను ఓ గార్డేన్ లో కూలీ పని చేసుకుంటాను. నా వద్ద అంత డబ్బు లేదని నా కూతురిని ఉచిత కాన్పులు చేస్తున్నా మాతృశ్రీ హాస్పిటల్ తీసుకువచ్చాను. అయితే నా బిడ్డ ఆడపిల్లలకు జన్మనిచ్చింది. డాక్టర్ రూపాయి కుడా ఫీజ్ తీసుకోకుండా పూర్తిగా ఉంచితంగా వైద్యం అందించింది. తల్లి, బిడ్డ ఇద్దరు కూడా బాగున్నారు. ఈ రోజుల్లో ఇలాంటి డాక్టర్లు ఎక్కడ చూడలేదని స్థానికులు డాక్టర్ శ్రావణిక రెడ్డికి చాలా ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే చాలా ఉచిత హెల్త్ క్యాంపులు పెట్టి వైద్య సేవలు అందిస్తున్నారు.
అమ్మాయి పుడితే ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దని ఉద్దేశంతో మూడు నెలల క్రితం నుంచి ఉచిత కాన్పులు చేస్తున్నామని డాక్టర్ శ్రావణిక రెడ్డి చెబుతున్నారు. ఇప్పటి వరకు 25 మంది గర్బీనిలకు ఉచితంగా డెలివరీలు చేశాము. ముఖ్యంగా అమ్మాయిలు పుడితే పేరెంట్స్ ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారనే విషయాలను దృష్టిలో పెట్టుకొని వారి ఆర్థిక స్తోమత కూడా అంతంత మాత్రమే ఉంటుందని ఉద్దేశంతో వారికి ఏదైనా ఒకటి చేయాలనే సంకల్పంతో చేస్తున్నాను. నేను కూడా అమ్మాయిని కాబట్టి అమ్మాయిల సమస్య ఏంటో నాకు తెలుసు. మా హాస్పిటల్లో మాత్రం నార్మల్ డెలివరీ చేయడానికే ప్రయత్నిస్తున్నాము. కానీ పరిస్థితులను బట్టి సిజేరియన్ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కూడా నార్మల్ డెలివరీస్ పైనే ఫోకస్ చేస్తోంది. నార్మల్ డెలివరీ అయితే ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. మొదటి కాన్పులో సిజేరియన్ అయితే రెండవ కాన్నులో సిజేరియన్ చేయాలనేది లేదు. రెండో కాన్పులో కూడా నార్మల్ చేయవచ్చు అన్నారు. ఫ్యామిలీలో మేమందరం అమ్మాయిలేమే ఉన్నాము. నేను ఎంబిబిఎస్ చదువుకునే సమయంలో నేను గైనిక్ అయితే ఉచితంగా డెలివరి చేయాలనుకున్నాను అన్నారు అది ఇప్పుడు అమలుపరుస్తున్నాను. ఈ ఉచిత కాన్పులను కోనసాగించాలను కుంటున్నాను అన్నారు.
వైద్యులు అంటేనే కమర్షల్ గా ఉంటారనేది జెగమెరిగిన సత్యం. కానీ ఇలాంటి డాక్డర్ కూడా ఉంటారా..అనేలా స్త్రీవైద్య నిపుణురాలు శ్రావణిక రెడ్డి ఉచిత కాన్పులు చేస్తున్నారు. ఇలాంటి వైద్యులను ఆదర్శంగా తీసుకుని మరింత మంది వైద్యులు తమ సేవలను పేదలకు అందించాలని మనము కోరుకుందాం..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.