హోమ్ /వార్తలు /తెలంగాణ /

Crime news: అందమే ఆమె పాలిట శాపమైంది .. భర్తను అనుమాన పిశాచిగా మార్చింది.. అసలేం జరిగిందంటే

Crime news: అందమే ఆమె పాలిట శాపమైంది .. భర్తను అనుమాన పిశాచిగా మార్చింది.. అసలేం జరిగిందంటే

nizamabad murder

nizamabad murder

Crime news: ఆనుమానం పెనుభూత‌మై నిండు ప్రాణాన్ని బలిగొంది. క‌ట్టుకున్న భార్య‌ను భర్తే  దారుణంగా హత్య చేశాడు. ఈ  ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. హత్య చేసిన తర్వాత భర్త ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Nizamabad, India

    (P.Mahendar,News18,Nizamabad)

    ఆనుమానం పెనుభూత‌మై నిండు ప్రాణాల‌ను బ‌లి తీసుకుంటుంది. భార్య‌, భ‌ర్త‌ల మ‌ధ్య అనుమానం అనే పిశాచి కార‌ణంగా ప‌చ్చ‌ని సంసారాలు ముక్కల‌వుతున్నాయి. కాల‌కాలం క‌లిసి ఉంటామని బాస‌లు చేసి పెళ్లిలు చేసుకున్న జంట‌లు విడిపోతున్నాయి. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా వారి పిల్లలను అనాథలను చేస్తున్నారు. నిజామాబాద్(Nizamabad)జిల్లా కేంద్రంలో కూడ ఇదే తరహా ఘటన జరిగింది. అనుమానంతో భార్యను దారుణంగా హత్య చేశాడో కిరాతకపు భర్త.

    Occult worships: ఆదిలాబాద్​లో కలకలం.. ఆరోగ్య కేంద్రం ముందు క్షుద్రపూజలు చేసిన దుర్మార్గులు..

    అనుమానం తీసిన ప్రాణం..

    నిజామాబాద్ న‌గ‌రానికి చెందిన సయ్యద్ ఖలీం కూతురు అనీస్ ఫాతీమాకు 2013లో సయ్యద్ సుల్తాన్‌తో వివాహం జరిగింది. పాతీమా, సుల్తాన్  దంపతులకు ఓ కూతురు, కుమారుడు ఉన్నారు.  సాఫిగా సాగుతున్న‌ వీరి సంసారంలో ఇటీవల అనుమానం అనే  బీజం పడింది. భార్య ఫాతిమా ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న సుల్తాన్.. తరచూ ఆమెను  వేధింపులకు గురి చేస్తూ హింసిస్తున్నాడు. అయితే భర్తకు అత్త కూడా తొడ‌వ్వ‌డంతో  తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి.

    భార్యను చంపానంటూ మామకు ఫోన్ ..

    భర్త అనుమానంతో విసిగిపోయిన అనీస్ ఫాతీమా నెలన్నర క్రితం తన ఇద్దరు పిల్లలతో కలిసి నిజామాబాద్ 3వ టౌన్ పరిధి లోని బ్యాంక్ కాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకుని వేరుగా ఉంటుంది. అయితే  శనివారం రాత్రి 8గంటల సమయంలో సయ్యద్ సుల్తాన్ తన మామ సయ్యద్ ఖలీంకు ఫోన్ చేసి పిల్లలను చూడటానికి భార్య ఫాతీమా వ‌ద్ద‌కు వెళ్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత కొంత సమయానికి మళ్లీ ఫోన్ చేసి నీ కూతురుని చంపేశానంటూ ఫోన్‌ చేయడంతో షాక్‌ అయ్యారు. మీ కుమార్తెను చంపి తన పిల్లలను తీసుకుని వెళ్తున్నానని చెప్పి కాల్ కట్ చేశాడు.

    Snake: జీవితాలను చిదిమేసిన సర్పం.. ఆ గిరిజన కుటుంబానికే ఎందుకు అలా జరిగింది?

    అల్లుడిపై పోలీస్ కంప్లైంట్ ..

    దీంతో  కంగారు పడిన సయ్యద్ ఖలీం హుటాహుటిన కూతురు ఇంటికి వెళ్లారు.ఇంట్లో మెడకు చున్నీ బిగించి ఉన్న ఫాతీమా విగతజీవిగా పడి ఉంది. దీంతో వెంటనే ఆయన నగర మూడో టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనుమానంతోనే తన కూతురిని వేధింపులు గురిచేసి, మెడకు చున్నీ బిగించి సయ్యద్ సుల్తాన్ హత్య చేశాడని హతురాలి తండ్రి ఖలీం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ విజయ్ బాబు తెలిపారు.

    Published by:Siva Nanduri
    First published:

    Tags: Husband kill wife, Nizamabad, Telangana crime news

    ఉత్తమ కథలు