హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : మొదటి భార్య సమాధి దగ్గర భర్త ఆత్మహత్య .. అంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటంటే..

Telangana : మొదటి భార్య సమాధి దగ్గర భర్త ఆత్మహత్య .. అంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటంటే..

Great husband

Great husband

Telangana : ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వారి దాంపత్య జీవితానికి తీపి గుర్తుగా ఓ పాప పుట్టింది. ఇంతలోనే ఊహించని సంఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. అనుకోకుండా అతను మరో పెళ్లి చేసుకున్నాడు. అయినా మొదటి భార్య తీపి గుర్తులు వెంటాడటంతో కఠిన నిర్ణయం తీసుకున్నాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Kamareddy, India

(P.Mahendar,News18,Nizamabad)

ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వారి దాంపత్య జీవితానికి తీపి గుర్తుగా ఓ పాప పుట్టింది. ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే ఊహించని సంఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. అనుకోకుండా అతను మరో వివాహం ( Marriage)చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మొదటి భార్యను మర్చిపోలేక...ఆమె లేని జీవితాన్ని గడపడం ఇష్టం లేక అతను ఏకంగా తన ప్రాణాన్ని త్యాగం(Suicide) చేశాడు. కామారెడ్డి(Kamareddy)జిల్లాలో జరిగిన ఈసంఘటన స్థానికుల్ని ఎంతగానో కలచివేసింది.

BJP | Jayasudha : బీజేపీలోకి సహజనటి .. ఆ రోజునే జయసుధ పార్టీలో చేరడం ఖాయమని సంకేతాలుభార్యపై ప్రేమతో ..

కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన పుట్ట సురేష్ అదే గ్రామానికి చెందిన నిర్మల అనే యువతిని నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి ప్రేమ బంధానికి గుర్తుగా పాప పుట్టింది. అయితే భార్య నిర్మల అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మరణించింది. దీంతో సురేష్ మ‌నోవేద‌న‌కు గురైయ్యాడు. అయితే త‌ల్లి దండ్రులు సురేష్‌కు మ‌రో అమ్మాయితో వివాహం జ‌రిపించారు. వీరికి ఒక పాప జ‌న్మించింది.. అయినా మొద‌టి భార్య అకాల మరణాన్ని సురేష్ తట్టుకోలేకపోయాడు. త‌ర‌చు మొద‌టి భార్య స‌మాది వ‌ద్ద‌కు వెళ్ళి బాధప‌డేవాడు.

రెండేళ్ల పాటు విరహవేదన ..

భార్య లేని జీవితం తనకు వద్దు అంటూ.. సురేష్ ఈనెల రెండవ తేదీన భార్య నిర్మల సమాధి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. విష‌యం తెలిసిన కుటుంబ స‌భ్యులు వెంట‌నే సురేష్‌ని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందాడు. సురేష్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్ద‌రు చిన్నారులు తండ్రి లేని పిల్లలుగా మారాడం చూసిన బందువులు, కుటుంబ స‌భ్యులు క‌న్నీటి ప‌ర్యాంతం అయ్యారు. మృతుని తండ్రి పిర్యాదు మేర‌కు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Animal lover : వీధి కుక్కల కోసం లక్షల జీతం వదులుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ .. రీజన్‌ తెలిస్తే శభాష్ అంటారు


ప్రేమించిన భార్య కోసం..

ప్రేమ ఇద్దరు వ్యక్తులను ఏకం చేస్తే.. అదే ప్రేమ కొందరి వ్యక్తుల మధ్య విషాదాన్ని కూడా మిగులుస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అనేక కారణాలతో మోసం చేసిన ప్రభుద్ధులకు చెందిన వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం. కాని సురేష్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య దూరమవడాన్ని జీర్ణించుకోలేక..ఆమె లేని జీవితాన్ని గడపలేక చివరకు తన ప్రాణాన్ని సైతం వదిలేయాలనుకోవడం అందర్ని తీవ్రంగా బాధించింది.

First published:

Tags: Husband commit suicide, Kamareddy, Telangana News

ఉత్తమ కథలు