(P.Mahendar,News18,Nizamabad)
ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఆప్రేమజంటకు తీపి గుర్తుగా ఓ పాప పుట్టింది. అంతా బాగుందనుకునే సమయంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు..గొడవలకు కారణమయ్యాయి. అంతే ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్తను వదిలి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింటికి వెళ్లి భార్య ఆరు నెలలైనా తిరిగి భర్తతో కాపురం చేయడానికి రాలేదు. అంతే కాదు కట్టుకున్న వాడితో పాటు అతని తల్లిదండ్రులపై కూడా పోలీస్ కేసు(Police case)పెట్టింది ఆ ఇల్లాలు. కామారెడ్డి(Kamareddy)జిల్లాలో జరిగిన ఈసంఘటన ఫలితంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది. అసలేం జరిగిందంటే.
మొగుడిపై చిరాకు..
కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండల కేంద్రా నికి చెందిన మామిండ్ల కరుణాకర్ పాతరాజంపేట్ గ్రామానికి చెందిన ప్రవళ్లిక ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఇష్టపడి ఇరువైపుల పెద్దలను ఒప్పించి మరీ ప్రేమ వివాహం చేసుకున్నారు. రెండేళ్ల క్రితం ఒక్కటైన ఈజంటకు ఏడాది వయసున్న పాప ఉంది. కరుణాకర్ ప్రైవేటు ఫ్యాక్టరీలో డైలీ లేబర్‌గా పని చేస్తున్నాడు. ఆరునెలల క్రితం ప్రవళ్లిక భర్త కరుణాకర్‌తో గొడవపడింది. ఆ గొడవ కాస్తా పెద్దదిగా మారింది. భర్తపై విసుగుచెందిన ప్రవళ్లిక అక్కడి నుంచి పుట్టింటికి వెళ్లిపోయింది.
పుట్టింటికి వెళ్లిన భార్య
కోనరావు టలో నివాసముంటున్న తల్లిదండ్రుల దగ్గర ఉంటోంది ప్రవళ్లిక. భార్య పుట్టింటికి వెళ్లి ఆరు నెలలు గడవటంతో కరుణాకర్ భార్యను కాపురానికి రావాలని పిలిచాడు. అందుకు ఆమె నిరాకరించింది. అటుపై భర్త, అత్తమామలపై కోనరావుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు రెండు సార్లు కరుణాకర్‌ను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి కేసుపెట్టడం, పోలీస్ స్టేషన్‌కి పిలిపించడంతో కరుణాకర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
మనస్తాపంతో భర్త అఘాయిత్యం..
భార్య ఇకపై తనతో కాపురం చేయదని భావించుకున్నాడు. పరువు పోయిందనే భాధతో బుధవారం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు కరుణాకర్. మృతుడి తండ్రి కమలాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ఆనం ద్ గౌడ్ తెలిపారు. ప్రేమ పేరుతో తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్లే ఇలాంటి సంఘటనలు తలెత్తుతున్నాయని ..ఫలితంగా బంగారం లాంటి జీవితాలు నాశనం అవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. క్షణికావేశంలో తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాలతో వారి పిల్లలు ఆనాదాలు మారిపోతున్నారని చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.