హోమ్ /వార్తలు /telangana /

Nizamabad: నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జోరుగా వ‌ర్షాలు.. వేల ఎక‌రాల్లో నీట మునిగిన పంటలు

Nizamabad: నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జోరుగా వ‌ర్షాలు.. వేల ఎక‌రాల్లో నీట మునిగిన పంటలు

భారీ వర్షాలకు కారుతున్న మత్తడి

భారీ వర్షాలకు కారుతున్న మత్తడి

నిజామాబాద్ జిల్లాలో ఆకాశానికి చిల్లు పడ్డట్టుగా వాన‌లు కురుస్తూనే ఉన్నాయి. గ‌తంలో ఎప్పుడు లేనంతగా వానాకాలం తొలినాళ్లలోనే కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి.

  (P Mahendar, News18, Nizamabad)

  అల్ప‌పిడ‌న ద్రోణి ప్ర‌భావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఆకాశానికి చిల్లు పడ్డట్టుగా వాన‌లు కురుస్తూనే ఉన్నాయి. గ‌తంలో ఎప్పుడు లేనంతగా వానాకాలం తొలినాళ్లలోనే కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జులై రెండో వారంలోనే చెరువులు.. కుంటలు.. ప్రాజెక్టులు నిండాయి. ఆరు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జనజీవనం స్తంభించింది. ఈ వ‌ర్షాలు జిల్లా చ‌రిత్ర‌లో నిలిచిపోయేల ఉన్నాయి.

  నిజామాబాద్ (Nizamabad) జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన‌లతో వేల ఎక‌రాల్లో పంట‌లు నీట మునిగాయి. అధికారుల అంచ‌నా ప్రకారం 32,482 ఎకరాల్లో పంట నీట మునిగింది. వరి నారుమడులు 4682..  నాట్లేసిన వరి 19,980.. సోయాబీన్ 5251.. మొక్కజొన్న 2383.. పత్తి 185 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు గుర్తించారు.  ఆనాదికార లేక్క‌ల ప్రకారం ఎక్కువే ఉంటుంద‌ని రైతులు అందోళ చేందుతున్నారు. ఆరు రోజులుగా ఆరు త‌డి పంట‌లు సోయాబిన్, మోక్క‌జోన్న‌, ప‌సుపు వంటి పంట‌లు కుల్లిపోయాయ‌ని రైత‌న్నాలు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. జ‌రిగిన న‌ష్టాన్ని అంచనా వేసి ఎక‌రానికి 40 వేల రూపాయ‌ల న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌ని వారు కోరుతున్నారు. జక్రాంపల్లి మండలం పడకల్ గ్రామ పెద్ద చెరువు కట్ట తెగిపోయింది. ఈ చెరువుకు ఇన్ ఫ్లో అధికంగా ఉండడంతో గత మూడు రోజుల నుండి అలుగు పోస్తుంది.. ఈ చెరువు తెగిపోవడంతో పడకల్, కేశ్ పల్లి, మనోహరాబాద్, కొలిప్యా క్ గ్రామాలకు ముప్పు ఉంచి ఉంది. అప్రమత్తమైన రెవెన్యూ అధికారులు గ్రామాల్లో డప్పు సాటింపు చేయించారు.  వ‌ర‌ద నీటిని దారి మళ్లించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.. వందలాది ఎకరాలలో పొలాలు నీట‌ మునిగిపోయాయి.

  ప్రభుత్వం ఆదుకోవాలని..

  మోపాల్ మండ‌లం ముదక్ పల్లి గ్రామంలో నిన్న గాజకుంట కట్ట తెగి వరద నీట మునిగిన ఇండ్లు, కట్ట తెగి ఇండ్లలో నీళ్లు వచ్చిన 10 కుటుంబాలను మాజీ ఎమ్మేల్సీ, కాంగ్రెస్ నాయ‌కుడు భూప‌తి రెడ్డి  పరామర్శించారు. వారికి నిత్యవసర సరుకులు అందించాను.  ఆ కుటుంబాలు గుడిసెల్లో కూలిన ఇండ్లలో ఉంటున్నారు.. వారికి ప్రభుత్వం ఆదుకోవాలని ముదక్పల్లి లో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కట్టించలేదని ఇల్లు కూలిన గుడిసెల్లో ఉంటున్న వారికి డబ్బులు బెడ్ రూమ్ ఇల్లు కట్టించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామ‌న్నారు. ఇండ్లు కూలిపోయిన వారికి మూడు లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇల్లు లేని వారికి ఇల్లు కట్టిస్తామన్నారు.కామారెడ్డి జిల్లా  నిజాంసాగర్ మండలంలోని శనివార్పేట్ తండా శివారులో ట్రాక్టర్ బోల్తాపడి యువకుడు మృతిచెందాడు.

  డ్రైవర్ అయిన చిన్న రవి ట్రాక్టరు తీసుకుని పొలానికి వెళ్లాడు. భూమి దున్నుతుండగా వాహనం బురదలో కూరుకుపోయింది. ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్లలేదు. పెద్ద రవి వద్దకు సమాచారం ఇచ్చాడు. ఆయన చేరుకుని బురద నుంచి తీసే క్రమంలో ట్రాక్టర్ బోల్తాపడి అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు వెంటనే జేసీబీతో వాహనాన్ని బయటకు తీశారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు, కుమారులున్నారు. ఉమ్మ‌డి జిల్లా వ్యాప్తంగా వ‌ర్షాల‌కు ర‌హదారులు ద్వంసం అయ్యాయి. కొన్ని చోట్ల వ‌ర‌ద నీటికి కొత‌కు గుర‌య్యాయి. నిర్మాణంలో ఉన్న వంతేన‌ల వ‌ద్ద కొత‌కు గురై ర‌క‌పోకాలు నిలిచి పోయాయి. ప్ర‌జ‌లను సురక్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించే ప‌నిలో జిల్లా యాంత్రంగం ఉంది.మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి నిన్న జిల్లాలో ప‌ర్య‌టించారు. జిల్లాలోని ప‌రిస్థితుల‌ను స‌మీక్షించారు.. లోలోతట్టు ప్రాంతాలపై ఫోకస్ చేయాల‌ని ఆయ‌న సూచించారు.

  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Farmer, Heavy Rains, Nizamabad, Telangana

  ఉత్తమ కథలు