Home /News /telangana /

NIZAMABAD GOVERNMENT SCHOOL TEACHER BRUTALLY BEAT STUDENTS IN NIZAMABAD DISTRICT FOR NOT WRITING EXAMS PROPERLY SNR NZB

Telangana : 8వ తరగతి స్టూడెంట్స్‌ని చితకబాదిన గవర్నమెంట్ స్కూల్ టీచర్ .. కారణం అదేనంట..!

(Teacher Cruelty)

(Teacher Cruelty)

Telangana : 8వ తరగతి చదువుతున్న విద్యార్ధుల్ని స్కూల్ టీచర్‌ చితకబాదాడు. వీపులు వాచిపోయేలా..చేతులు కందిపోయేలా పశువుల్ని కొట్టినట్లుగా కొట్టాడు. కేవలం వాళ్లు ఆ పని చేశారనే కోపంతో ఈవిధంగా రెచ్చిపోయాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Nizamabad, India
    (P.Mahendar,News18,Nizamabad)
    ఉపాధ్యాయులు(Teacher)అంటే పాఠాలు, విద్యాబుద్దులు నేర్పే వాళ్లు. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణలో పెట్టడం, వాళ్లకు సమాజం పట్ల, పెద్దల పట్ల గౌరవ, మర్యాదలు నేర్పడం గురువుల ప్రధాన బాధ్యత. కాని ఆ జిల్లాలో మాత్రం ప్రభుత్వ స్కూల్‌(Govt School)లో చదువుతున్నారు కదా అని టీచర్ పిల్లలను పశువులను కొట్టినట్లు కొట్టారు. అయితే టీచర్లకు అంత కోపం రావడానికి కారణం ఏమిటి..? విద్యార్ధులు(Students)అంత పెద్ద తప్పు ఏం చేశారని తల్లిదండ్రులు (Parents)ఆరా తీస్తే టీచర్‌లు చెప్పిన సమాధానం వాళ్లకు ఆగ్రహం తెప్పించింది.

    Telangana : డబుల్ బెడ్రూం ఇల్లు తిరిగి ఇచ్చిన దంపతులు .. మంత్రి ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా..?



    ఎగ్జామ్ సరిగా రాయలేదని..
    విద్యాబుద్ధులు నేర్పే గురువులు అంటే దేవుళ్లతో సమానమని పిల్లకు చిన్నప్పటి నుంచి స్కూల్‌లో నేర్పిస్తారు. అందుకే మాృతదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటూ తల్లిదండ్రుల తర్వాత గురువులకే మూడో స్థానం కల్పించారు. అంతటి ఉన్నతస్థానంలో ఉండే గురువులు అంతే హుందాగా, గౌరవంగా పిల్లల్ని ప్రయోజకులుగా మార్చాలి. విద్యాబుద్ధులు నేర్పాలి. కాని నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి మండలం జానకంపేట్‌లోని జిల్లా ప‌రిషాత్ ఉన్న‌త పాఠశాలలో ఎనిమిద‌వ త‌ర‌గ‌తి చ‌దువుత‌ున్న ఐదుగురు విద్యార్ధులను అనీల్ కుమార్ అనే ఉపాద్య‌యుడు చితకబాదాడు. గొడ్డును బాదినట్లుగా విద్యార్ధులపై తన ప్రతాపాన్ని చూపించాడు.



    విద్యార్ధుల్ని చితకబాదిన టీచర్ ..
    గురువారం స్కూల్‌లో విద్యార్ధులకు ఎగ్జామ్ పెట్టారు టీచర్ అనీల్‌కుమార్. అందులో బాధిత విద్యార్దులు ఐదుగురు సరిగా పరీక్ష రాయలేదు. ఆ కారణంతో ఐదుగురు విద్యార్థుల‌ను విచ‌క్ష‌ణారహితంగా వీపుపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. చేతులు మెలిపెట్టి వీపు వాచి పోయేల క‌ట్టాడ‌ని విద్యార్ధులు తమను కొట్టిన దెబ్బలు చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. సార్ కొట్టిన దెబ్బలకు కనీసం ఊపిరి కూడా ఆడలేదని అంటున్నారు. ఉపాధ్యాయుడు అనీల్‌కుమార్ చేతిలో దెబ్బలు చిన్న స్టూడెంట్స్ విగ్నేష్, అర్జున్‌ని ఆసుపత్రికి తరలించారు.

    Varalakshmi Vratham 2022: శ్రావణమాసం రెండో శుక్రవారమే వరలక్ష్మీ వ్రతం చేయడానికి ప్రత్యేకత..?



    పేరెంట్స్ ఆగ్రహం ..
    మార్కులు తక్కువ వచ్చినందుకు ఈవిధంగా ఓ ఉపాధ్యాయుడు స్టూడెంట్స్‌ని ఎందుకు స్కూల్‌కి వస్తున్నార్రా అంటూ చెప్పుతో కొడతానంటూ బెదిరించడంతో విద్యార్ధులు భయపడిపోయారు. దాంతో స్కూల్‌కి వెళ్లాలంటేనే భయంగా ఉందని తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల బాగుందని మా మనవడ్ని ఈ సంవత్సరమే స్కూల్‌లో చేర్పిస్తే ఒక టీచర్ రాక్షసుడిలా మారి పిల్లల్ని ఇంతలా కొట్టాలా అంటూ పేరెంట్స్ మండిపడుతున్నారు. పిల్లలు సరిగా పరీక్షలు రాయలేదంటే పాఠాలు అర్ధం కాకపోవడం వల్లే అని ఎందుకు అనుకోరు..అర్ధమయ్యేలా పాఠాలు చెబితే బాగానే రాస్తారు కదా అని అంటున్నారు. పిల్లల్ని చేతులు,వీపులు వాచేలా కొట్టిన ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్కూల్ హెడ్‌మాస్టార్, ఎంఈఓను కోరారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Nizamabad, Students, Telangana News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు