Home /News /telangana /

NIZAMABAD GIRL AND A BOY COMMITTED SUICIDE IN NIZAMABAD DISTRICT DUE TO RESENTMENT OF SEEING THEIR OLDER SISTER AS LOVERS SNR NZB

Students Suicide : ఔను వాళ్లిద్దరూ చనిపోయారు .. అన్నాచెల్లెలికి ఆ సంబంధం అంటగట్టడం వల్లే

(STUDENTS SUICIDE)

(STUDENTS SUICIDE)

Students Suicide : తమ మధ్య ఉన్న అనుబంధాన్ని సమాజంలోని కొందరు వ్యక్తులు తప్పుగా అర్ధం చేసుకున్నారని ఆవేదన చెందారు. పదే పదే అనుమానాపు చూపులు, వేధింపు ప్రశ్నలను తట్టుకోలేకపోయారు. చేయని తప్పును భరిస్తూ బ్రతకడం కంటే ఓ బాలిక, మరో యువకుడు దారుణమైన నిర్ణయం తీసుకున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nizamabad, India
    (P.Mahendar,News18,Nizamabad)
    తమ మధ్య ఉన్న అనుబంధాన్ని సమాజంలోని కొందరు వ్యక్తులు తప్పుగా అర్ధం చేసుకున్నారని ఆవేదన చెందారు. పదే పదే అనుమానాపు చూపులు, వేధింపు ప్రశ్నలను తట్టుకోలేకపోయారు. చేయని తప్పును భరిస్తూ బ్రతకడం కంటే ఓ బాలిక, మరో యువకుడు దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. అన్నచెల్లెల అనుబంధాన్ని తప్పుగా అర్ధం చేసుకుంటున్న సమాజం నోరు మూయించలేక చివరికి తనువు చాలించారు. అత్యంత విషాద సంఘటన నిజామాబాద్(Nizamabad)జిల్లాలో అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆప్యాయంగా ఉండే అమ్మాయి(Girl),అబ్బాయి(Boy) మధ్య అన్నచెల్లెల అనుబంధం ఉందని ఎందుకు అర్ధం చేసుకోరని ఆలోచింపజేస్తోంది.

    Cyber ​​Congress : ఆన్‌లైన్‌ క్లాసులు వినే స్టూడెంట్స్‌కి సైబర్‌ నేరాలపై అవగాహన..పోలీస్‌శాఖ ఐడియాతో సత్ఫలితాలు



    మరణవాంగ్మూలం..
    నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం దత్తపుర్ గ్రామానికి చెందిన వినయ్ కుమార్ తోండకూర్ గ్రామానికి చెందిన 17ఏళ్ల బాలిక ఇద్ద‌రు నిజామాబాద్ న‌గ‌రానికి చ‌దువు కొవడానికి వచ్చేపోతుండే వారు. ఇద్ద‌రూ ఒకే బ‌స్సులో రావ‌డం పోవ‌డంతో క‌లిసి క‌నిపించే వారు. ఆ విధంగా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. వినయ్ కుమార్ డీఎంఎల్‌టీ చేస్తున్నాడు. బాలిక పాలిటెక్నిక్ చ‌దువుతుంది. వీళ్లిద్దరి మధ్య ఉన్న పరిచయాన్ని సమాజం తప్పు పట్టింది. ఇద్దరూ ఒకే తల్లికి పుట్టకపోయినప్పటికి సొంత అన్నా, చెల్లెళ్లుగా మసులుకుంటూ వస్తున్నారు. అయితే వీరిద్దరి పరిచయాన్ని స్థానికులు, చుట్టూ ఉన్న మనుషులు తప్పుగా అర్ధం చేసుకున్నారు. ఇద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందని..ప్రేమికులు అన్నట్లుగా ప్రచారం చేస్తూ వచ్చారు. ఆ నిందను మోయలేక వినయ్, బాలిక మనస్తాపానికి గురయ్యారు.



    మాది అన్నాచెల్లెలి సంబంధం..
    అర్ధం చేసుకోలేని మనుషుల మధ్య బ్రతకడం వేస్ట్ అనుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నెల 8న గిరిరాజ్ కళాశాల పరిసర ప్రాంతంలో సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న ఇద్ద‌రిని స్థానికులు ముందుగా జిల్లా ప్ర‌భుత్వ జ‌న‌ర‌ల్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ.. అన్న వినయ్‌కుమార్ అదే రోజు మృతి చెందగా ...చెల్లెలు 17ఏళ్ల బాలిక గురువారం మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న త్రీ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతులు రాసిన సూసైడ్ నోట్‌లో తమ మధ్య ఎలాంటి తప్పుడు సంబంధాలు లేవని.. ఇద్ద‌ర‌ం అన్న చెల్లెలుగా ఉన్నామని పేర్కొన్నారు.

    Cyber ​​fraud : న్యాయవాదికి న్యూడ్ కాల్ చేసిన అమ్మాయిలు .. తర్వాత వీడియో చూసి షాక్



    మేం ఏ తప్పు చేయలేదు..
    బయటకు చెప్పుకోలని వింత సమస్య, సమాజం వేసే నిందలు భరించలేకపోతూ బాధితులు రాసిన సూసైడ్‌ నోట్‌లో ఏముందంటే ..మేమిద్దం బ్రదర్ అండ్ సిస్టర్. కాని ఈ సమాజం మా మధ్య ఫ్యామిలీ రిలేషన్ ఉందని ఇద్దరి మధ్య లవ్ ఎఫైర్ క్రియేట్ చేస్తున్నారు. మేం ఎప్పుడూ తప్పు చేయలేదు. మేం బ్రదర్ అండ్ సిస్టర్ అలానే ఉన్నాం. మానసికంగా, శారీరకంగా ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయలేదు. అలాంటి మా ఇద్దరి మధ్య తప్పుడు సంబంధం క్రియేట్ చేయడాన్ని భరించలేకపోతున్నాం. ఎన్నిసార్లు చెప్పినా ఎవ్వరూ ఆ విషయం అర్థం చేసుకోవడం లేదని ఆవేదనతో కూడిన అక్షరాల్ని మరణ వాంగ్మూలంగా లేఖలో పొందుపర్చారు.

    అర్ధం చేసుకోండి..
    చివరగా మేం ఏ తప్పు చేయలేదు. చేయని తప్పును ఒప్పుకోలేకే చనిపోవాలని నిర్ణయించుకున్నాం. మా చావుకి మేమే కారణం తప్ప మా ఫ్యామిలీలో ఏ ఒక్కరు కాదు. చివరి సారిగా చెబుతున్నాం మా మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ మాత్రమే ఉంది. ఎలాంటి తప్పుడు సంబంధం లేదని రాస్తూ పురుగుల మందు తాగారు. సమాజం ఒక అమ్మాయి, అబ్బాయి కలిసి మాట్లాడుకుంటే తప్పుగా అర్ధం చేసుకుంటారే తప్ప ఎందుకు అన్న చెల్లెలి అనుబంధం అనుకోరు. ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాతైనా మనుషుల్ని కాస్త అర్ధం చేసుకోవడానికి ...వాళ్లు చెప్పేది ఆలకించడానికి ప్రయత్నిస్తే బాగుంటుందని పోలీసులు సూచిస్తున్నారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Nizamabad, Student suicide, Telangana News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు