Home /News /telangana /

NIZAMABAD FREEDOM FIGHTER DATTATREYA SIRPURKARS FAMILY URGES GOVERNMENT TO ERECT STATUE SNR NZB

Independence Day 2022: స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయనో పోరాట యోధుడు .. కనీసం సొంత ఊరిలో కూడా ఒక్క విగ్రహం లేదు

Freedom Fighter

Freedom Fighter

Independence Day 2022: భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన పోరాడారు. అయితే ఏనాడు తాను చేసినా త్యాగాల‌ను బయటి ప్రపంచానికి చెప్పుకోలేదు. భార‌త ప్ర‌భుత్వం నుంచి ఆ కుటుంబం ఇప్పటి వ‌ర‌కు ఏలాంటి గుర్తింపు లేదు. కనీసం ఇప్పుడైనా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nizamabad, India
  (P.Mahendar,News18,Nizamabad)
  భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన పోరాడారు. అయితే ఏనాడు తాను చేసినా త్యాగాల‌ను బయటి ప్రపంచానికి చెప్పుకోలేదు. భార‌త ప్ర‌భుత్వం(Government of India) నుంచి ఆ కుటుంబం ఇప్పటి వ‌ర‌కు ఏలాంటి ప్ర‌శంస ప‌త్రం కూడా పొందలేదు. ఎలాంటి స‌న్మానాల‌కు కూడా నోచుకోలేదు. భారతదేశానికి బానిస సంకెళ్ల నుంచి విముక్తి కలిగి 75ఏళ్లు పూర్తైన సందర్భంగా ఇప్పుడు ఆయన పేరు తెరపైకి వచ్చింది. తెలంగాణ(Telangana)లోని నిజామాబాద్‌(Nizamabad)జిల్లాలోనే పుట్టి ఎన్నో త్యాగాలు చేసిన ఆయన విగ్రహాన్ని నెలకోల్పాలని ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

  Crime news : జెండా పండుగకు వెళ్లి వస్తున్న భార్య పీక కోసి చంపిన భర్త .. కారణం తెలిస్తే షాక్ అవుతారు  ఆ యోధుడు పుట్టింది ఇక్కడే..
  నిజామాబాద్ జిల్లా మోపాల్ మండ‌లం సిర్పూర్ గ్రామానికి చెందిన మణిక‌ర్ణిక బాయి. సాంబ నాయ‌క్ దంప‌తుల కుమారుడు ద‌త్తాత్రేయ రావు అలీయ‌స్ మీల‌ట‌రీ ద‌త్తు, ద‌త్తోపంత్ రావు నాయ‌క్, ద‌త్తు పంతులు అని పిలిచే వారు. 2ఏప్రిల్ 1920న జ‌న్మించారు. వీరిది జ‌మీందార్ కుటుంబం. అయితే ద‌త్తాత్రేయ రావు సిర్పూర్క‌ర్ చ‌దువు కోసం నిజామాబాద్ జిల్లాకు మారారు. బ‌డా బ‌జార్‌లోని పోతాలింగ‌న్న గుడి సందులో నివాసం ఉండేవారు. ద‌త్తాత్రేయ‌కు కృష్ణ‌బాయితో వివాహం జ‌రిగింది. వీరికి ఇద్ద‌రు కుమారులు. మొద‌టి సంతానం రాజేశ్వ‌ర్ సిర్పూర్క‌ర్ పుట్టిన ఐదు సంవ‌త్స‌రాల‌కే స్వ‌ర్గ‌స్తులు అయ్యారు. రెండ‌వ కుమారుడు మ‌నోహ‌ర్ రావు సిర్పూర్క‌ర్ .. 23 జూన్ 1946 లో జ‌న్మించారు. నిజామాబాద్ న‌గ‌రంలోని నివాసమున్నారు.  సుభాష్‌ చంద్రబోస్‌ అడుగుజాడల్లో..
  1935లో భారత్‌లోని దక్కన్ రాష్ట్రంలో బ్రిటిషర్స్.. నిజాం రాజాకులు పాలించే వాళ్లు. వీళ్లు ప్రజల్ని వేధించడం, చిత్రహింసలకు గురి చేయడం నగదు దోచుకోవడం, కొట్టడం చేస్తుంటేవారు. ఆడవాళ్లకు ర‌క్ష‌ణ లేకుండా పోయింది. అదే సమయంలో దత్తాత్రేయరావు ఆయన మిత్రుడు త్రేంబక్ పాటక్ కలిసి దేశం కోసం ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకున్నారు. అప్పుడే సుభాష్ చంద్రబోస్ భారతదేశ వాసులకు ఒక పిలుపును ఇచ్చారు.. “మీరు మీ రక్తన్ని ఇవ్వండీ, నేను మీకు స్వాతంత్య్రం ఇప్పిస్తాను” ఆ పిలుపుతో దత్తాత్రేయ రావు సిర్పూర్కర్ “ఆజాద్ హింద్ పోజ్ లో చేరారు. దత్తాత్రేయ రావు సిర్పూర్కర్ ఆయన కలలు సాకారం కావడం చాలా సంతోష పడ్డారు. దేశం కోసం తన సర్వస్వాన్ని అర్పించారు. వీరు భారత దేశానికి బ్రిటిషర్స్.. దక్కన్ ప్రాంతం నిజాం రాజరికం నుండి ప్రజలను విముక్తి కలిగియల‌ని అనుకున్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ పైలట్ గా చేరారు. సుభాష్ చంద్ర బోస్ తో బర్మ, సింగపూర్, జపాన్, జర్మనీ, దేశాలలో శిక్షణ పొంది భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గోన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్‌లో ఉంటు దత్తాత్రేయ రావు సిర్పూర్కర్ తన ప్రాంతం సమాచారం తన మిత్రుడు త్రేంక్ పాటక్ ద్వారా తెలుసుకునేవారు.

  యుద్ధ సామాగ్రి తయారిలో నిష్ణాతుడు..
  ఆజాద్ హింద్ ఫౌజ్‌లో పెద్ద బాధ్యత ఆయన బుజాలపై పడింది. పీస్తోల్, తపంచ, తల్వార్, రైఫల్, బాంబులు లాంటి యుద్ధ సామాగ్రీలు తయారు చేయడానికి శిక్షణ పొందారు. దాంట్లో నిపుణులు అయ్యారు. తాను తయారు చేసిన యుద్ధ సామాగ్రీని భారత దేశ స్వాతంత్య్ర పోరాట వీరులకు పంపేవారు. ఈ విధంగా తాను భారత దేశం కొరకు తనవంతు సహాయం చేశారు. ఒక పండుగ జరుపుకోవడానికి దత్తు కుటంబ సభ్యులు వారి స్వ‌గ్రామం సిర్పూర్ కి వెళ్లారు. గ్రామ ప్రజలకు బట్టలు, దాన్యము పంచి పండుగ జరుపుకున్నారు. ఆకస్మికంగా రాజాకారులు దత్తు బడా బజార్ ఇంటి పై దాడి చేశారు. కాని వాళ్ళకు ఇంటి సభ్యులు ఎవరు దొరక్కపోవడంతో ఇంట్లో ఉన్న నగలు డ‌బ్బులు దోపిడి చేశారు. విషయం తెలుసుకున్న దత్తు ఆజాద్ హింద్ ఫౌజ్‌ నుంచి నిజామాబాద్‌కు వచ్చారు. అదే విషయం ఆజాద్ హిందు ఫౌజ్ అధికారులకు తెలియగానే.. దత్తు ని తీసుకుపోవడానికి సైనికులని నిజామాబాద్ కు పంపారు.

  Independence Day 2022 : గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేసిన కేసీఆర్..7ఏళ్లలో తెలంగాణ రాబడి 3రెట్లు పెంచామన్న సీఎం  గుర్తించని ప్రభుత్వాలు..
  అప్పటి నుండి దత్తాత్రేయ సిర్పూర్కర్ మీలిట‌రీ దత్తు గా ప్రసిద్ధి చెందారు. నిజామాబాద్ లో ఉంటూ బ్రిటీష్ వారు.. రాజాకారులతో పోరాడడానికి వ్యూహం చేసేవారు. దత్తు ఆజాద్ హింద్ ఫౌజ్ లో శిక్షణ పొందిన యుద్ధ సామాగ్రీలు తన ఇంటిలోని బడా బజార్ నిజామాబాద్ లో సొంతగా తయారు చేసేవారు. ఇంటిలో ఒక ప్రయోగశాలలోనే రైఫల్, పీస్తోల్, బంధుక్, తపంచా, బాంబ్, కూరాబీన్ లాంటి యుద్ధ సామాగ్రీలు తయారు చేసేవారు. వాటిని భద్రపరిచేందుకు ఒక రూమ్ ఉండేది... యుద్ధ సామాగ్రీలకు సరిపడా రసాయానాలు వారు జర్మనీ, అమెరికా, జపాన్ నుండి తెప్పించేవారు.

  విగ్రహం ఏర్పాటు చేయండి..
  ద‌త్తుకి బడా బజార్ లో బట్టల దుకాణం ఉండేది. ఒక రోజు ఆయన బోజనానికి దుకాణం నుండి ఇంటికి వచ్చే సమయంలో రాజాకారులు ఆయన పై దాడి చేశారు... ఆ దాడిలో దత్తు తన వద్ద ఉన్న పిస్తోల్ తో రాజాకారులని ఎదురుకొని నాలుగురు రాజాకాకులను చంపేశారు. త్రేంబక్ పాటక్ కి తెలియగానే తన వంతు సహాయం అందించి మిగత రాజాకారులు సైనికులను బంధించారు.ఆ సైనికులు క్షమాపణ కోరుతూ ప్రాణభిక్ష కోరారు. అప్పుడు ఒక షరతులు విధిస్తూ బహిష్కరించారు. అయితే తర్వాత జరిగిన పరిణామాలతో అనే ప్రత్యేక ఆయుధం తయారు చేశారు దత్తు. ఆ ఆయుదం నుంచి ఒకే సారి 50-60 చర్రలు వ‌చ్చి శత్రువులను చంపే విధంగా తయారు చేశారు. దానితో పాటు రెండు గన్లు తయారు చేశారు. రెండో గన్ ద్వారా 25 గోలీలు ఒకేసారి బ‌య‌ట‌కు వ‌చ్చేవి..ఇలా అన్నిటి లైసెన్స్ ఆయన దగ్గర ఉండేవి... వీరు తయారు చేసిన యుద్ధ సామాగ్రీని నిజామాబాద్ జిల్లా ఖిల్లా ప్రాంతంలో ఉన్న నంది గుట్ట అడవులలో ప్రయోగం చేసేవారని వారి కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు.

  కుటుంబ సభ్యుల వినతి..
  3 జూన్ 1947 రోజున బ్రిటిష్,రాజాకార సైనికులను హ‌త‌మ‌ర్చేందుకు ద‌త్తు వ్యూహం ర‌చ్చించారు. అప్పుడు ఆయన కుమారుడు మనోహర్ రావు సిర్పూర్కర్ వయస్సు 11 నెలల 11 రోజులు. ఈ సమాచారం బ్రిటిష్, రాజాకారుల సైనికులకు తెలిసింది. వారు దత్తు బడా బజార్, పోతాలింగన్న గుడి నిజామాబాద్ గల ఇంటి పై దాడికి దిగారు. ద‌త్తు ఒక్కడే వారితో యుద్ధనికి దిగారు. బ్రిటిష్, రాజాకార సైనికుల పై బాంబు దాడులు చేశారు. అ దాడులలో చాలా మంది సైనికులు చనిపోయారు... మిగత సైనికులు పారిపోయారు.. ఈ బాంబు దాడులో ద‌త్తు గాయపడ్డారు... తానే స్వయంగా తన దగ్గర ఉన్న టాంగ రీక్ష ద్వారా ఆసుపత్రిలో చేరారు. ఈ నిజామాబాద్ బడా బజార్ లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంట‌ల‌ మధ్య జరిగింది. సాయంత్ర‌ 5 నుంచి 6 గంట‌ల త‌ర్వాత రాజాకారులు దత్తు ఇంట్లో నుండి యుద్ధ సామాగ్రీలు.. పైసలు ఆభరణాలు దోపిడి చేశారు.

  Independence Day 2022 : టీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో వాళ్లకు నో టికెట్ .. 15న పుట్టిన పిల్లలకు 12ఏళ్ల వరకు ఉచిత ప్రయాణం  దేశానికి ప్రాణాలు అర్పించారు..
  ద‌త్తు భార్య కృష్ణ బాయి కూరాబీన్ 50 నుండి 60 చర్రలు ఒకేసారి వెళ్లి ఆయుధం.. రెండు గన్నులను ఇంట్లో ఉన్న బావిలో దాచిపెట్టింది. ఇప్పుడు ఆ బావి స్తలంలో ఆకస్మాతుగా మేడి చెట్టు స్వయన దత్తాత్రేయుడుగా వెలిశాడు. ఆ తర్వాత రజాకారులుకృష్ణబాయి సిర్పూర్కర్ ని ఆరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఈ బాంబు దాడి వార్త దూర ప్రాంతాలకు విస్తరించింది. నాందేడ్ లో ఉన్న వాళ్ల కృష్ణ బాయి తమ్ముళ్లు సవాళ్ళ రామ్, ఘనా శామ్ నిజామాబాద్ వచ్చి కృష్ణబాయిని విడిపించారు. ద‌త్తు 8 నుండి 9 రోజుల వరకు ఆసుపత్రిలో ప్రాణాలు విడిస్తూ తన యుద్ధాన్ని కొనసాగించాలని భార్యతో మాట తీసుకొని 11 జూన్ 1947 రోజున మధ్యాహ్నం 2 గంట‌ లకు ప్రాణాలు విడిచారు దత్తు. భర్తకు ఇచ్చి మాట ప్రకారం అటుపై కృష్ణబాయి సిర్పూర్కర్ తన మాట నిలబెట్టుకొని 1976 లో ప్రాణ త్యాగం చేశారు.

  విగ్రహాలు నెలకోల్పేనా..
  75ఏళ్ల స్వాతంత్ర్య ఉద్యమానికి ముందు జరిగిన విషయాన్ని ఇప్పుడు దత్తు మనవళ్లు గుర్తు చేసుకుంటూ తమ తాత‌య్య ద‌త్తాత్రేయ రావు సిర్పూర్క‌ర్ సేవాల‌ను గుర్తించి వారికి సముచిత స్థానం క‌ల్పించాల‌ని మ‌న‌వ‌డు ఉమా మ‌హేష్ సిర్పూర్క‌ర్ కోరుతున్నారు. మా తాతాగారి విగ్ర‌హాన్ని ఆయ‌న సొంత ఊరు సిర్పూర్‌లో ఒకటి మరొకటి .. నిజామాబాద్ బ‌డా బ‌జార్ లోని ఆయ‌న ఇంటి వ‌ద్ద ఏర్పాటు చేయాల‌ని కోరుతున్నారు. అలాగే ఆయనకు ప్ర‌శంస ప‌త్రం అందించాల‌ని భారత స్వాతంత్ర వ‌జ్రోత్స‌వ‌ల సంద‌ర్బంగా కోరారు.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Independence Day 2022, Nizamabad, Telangana News

  తదుపరి వార్తలు