హోమ్ /వార్తలు /తెలంగాణ /

OMG :హెడ్‌ మాస్టర్ వల్ల ఫోర్త్ క్లాస్ స్టూడెంట్ మృతి .. ప్రాణానికి లక్ష ఖరీదు కట్టిన గ్రామ పెద్దలు

OMG :హెడ్‌ మాస్టర్ వల్ల ఫోర్త్ క్లాస్ స్టూడెంట్ మృతి .. ప్రాణానికి లక్ష ఖరీదు కట్టిన గ్రామ పెద్దలు

crime(FILE)

crime(FILE)

OMG: నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది సంవత్సరాల విద్యార్ధి మృతికి స్కూల్ హెడ్‌ మాస్టర్ కారణమయ్యాడు. పసివాడి ప్రాణాన్ని బలిగొన్న ప్రధానోపాధ్యయుడు విషయాన్ని బయటకు రాకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Nizamabad, India

నిజామాబాద్(Nizamabad)జిల్లాలో తొమ్మిది సంవత్సరాల విద్యార్ధి (9Years old student)చావుకు స్కూల్ హెడ్‌ మాస్టర్(Headmaster)కారణమయ్యాడు. పసివాడి ప్రాణాన్ని బలిగొన్న ప్రధానోపాధ్యయుడు విషయాన్ని బయటకు రాకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. పిల్లవాడి ప్రాణానికి గ్రామానికి చెందిన పెద్దలు వెల కట్టిన సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ హెడ్‌ మాస్టర్‌పై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ బాలుడి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Viral video : పరిహారం ఇప్పించమని ఎమ్మెల్యే కాళ్లు పట్టుకున్న వృద్ధుడు .. వైరల్ అవుతున్న వీడియో

హెడ్‌ మాస్టర్ దుశ్చర్య..

నిజామాబాద్ రూరల్ మండలం గుండారం గ్రామానికి చెందిన అమీర్‌ రెండు కుమారుడు 9సంవత్సరాల అనీస్‌ దురదృష్టవశాత్తు చనిపోయాడు. గ్రామంలోని ప్రాధమిక పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్న అనీస్‌కు ఈనెల 22వ తేదిన స్కూల్‌ హెడ్ మాస్టార్ సాయిలు జిరాక్స్ తీసుకురమ్మని బయటకు పంపాడు. ప్రధానోపాధ్యుయుడు చెప్పిన పని కోసం బయటకు వెళ్లిన అనీస్‌ స్కూల్‌కి తిరిగి ఆలస్యంగా రావడంతో సాయిలు కోపోద్రేకుడయ్యాడు. అనీస్‌ని రెండు చెవులు మెలిపెట్టాడు. ఆలస్యం ఎందుకైందని ప్రశ్నిస్తూనే కొట్టడానికి కర్ర కోసం వెదుకుతుండగా అనీస్ భయంతో హెడ్‌ మాస్టర్‌ నుంచి తప్పించుకునే క్రమంలో వరండా నుంచి కింద పడ్డాడు.

పసివాడి ప్రాణానికి ఖరీదు..

ఈసంఘటనలో అనీస్‌ శరీరంలోని సున్నీత ప్రాంతంలో బలమైన దెబ్బ తగలడంతో ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న స్టూడెంట్ తల్లిదండ్రులు బోరున విలపిస్తుంటే అసలు చనిపోవడానికి కారణమైన విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు..హెడ్‌ మాస్టర్‌ నిర్లక్ష్యాన్ని కప్పి పుచ్చేందుకు గ్రామ పెద్దలు రంగంలోకి దిగారు. ఓవైపు కన్నబిడ్డ శవంగా మారడం చూసి బోరున విలపిస్తున్న అనీస్‌ తల్లిదండ్రులకు లక్ష రూపాయలు ఇచ్చి కేసు, కంప్లైంట్ లేకుండా చేతులు దులుపుకుందమని ప్రయత్నించారు.

Farmer Success : మూడున్నర నెలల్లో పెట్టుబడికి రెట్టింపు ఆదాయం .. బోడ కాకరకాయ సాగులో సీక్రెట్‌ అదేనంటున్న రైతు

కప్పిపుచ్చే ప్రయత్నం..

ప్రధానోపాధ్యాయుడిగా ఉన్న సాయిలు స్కూల్ విద్యార్ధిని వ్యక్తిగత పని కోసం బయటకు పంపడమే చేసిన పెద్ద తప్పు. ఆ పని చేసుకొని రావడంలో ఆలస్యమైందని దండించడానికి ప్రయత్నించడం వల్లే తమ బిడ్డ చనిపోయాడని అనీస్‌ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జరిగిన విషయాన్ని మసి పూసి మారేడు కాయ చేయాలని చూస్తున్న పెద్దలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయంలో హెడ్‌ మాస్టర్ సాయిలుపై కఠిన చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Nizamabad, Student, Telangana crime news

ఉత్తమ కథలు