నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని కపిల హోటల్ లో ఒకే ఫ్యామిలీకి (Family) చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదిలాబాద్ కు చెందిన కొత్తకోట సూర్యప్రకాశ్ అనే వ్యక్తి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. భార్య అక్షయ, ఇద్దరు పిల్లలతో (ప్రత్యూష అద్వైత్).. 15 రోజులుగా నిజామాబాద్ హోటల్ లో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇవాళ నలుగురు హోటల్ గదిలో విగతజీవులుగా కనిపించారు.భార్య, పిల్లలు పురుగుల మందు తాగి చనిపోగా.. సూర్యప్రకాశ్ ఉరివేసుకుని కనిపించాడు. మొదట భార్య, పిల్లలకు పురుగుల మందు తాగించిన సూర్యప్రకాశ్.. అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. సూర్య ప్రకాశ్ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు వివరించారు. ఆత్మహత్యకు (Family suicide) గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లి..
కాగా, గతంలోనూ నిజామాబాద్‌కు చెందిన ఓ కుటుంబం అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకుంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన నలుగురు కుటుంబసభ్యులు, సురేశ్ ,శ్రీలత, బార్యభర్తలతో పాటు ఇద్దరు కుమారులు ఆశీష్, అఖిల్‌లు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లారు. విజయవాడ వన్‌టౌన్‌లో ఉన్న కన్యకాపరమేశ్వరి సత్రంలో పప్పుల అఖిల్ పేరుతో రూమ్‌ను అద్దెకు తీసుకున్నారు. అయితే శనివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో అప్పుల బాధతో చనిపోతున్నట్లు వారి బంధువుకు మెసేజ్ సైతం పెట్టారు.
వెంటనే స్పందించిన బంధువు సత్రం నిర్వాహకులకు ఫోన్ చేసి చెప్పడంతో హుటాహుటిన వెళ్లి చూడగా తల్లీ శ్రీలతతో పాటు మరోకుమారుడు అప్పటికే చనిపోయినట్టు పోలీసులు గుర్తించారు. కాగా వారిపక్కన మందులు సైతం ఉన్నట్టు గమనించారు. ఆ తర్వాత తండ్రి సురేశ్‌తో పాటు మరో కుమారుడు కృష్ణనదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులకు సమాచారం అందించింది. పోలీసుల ప్రాధమిక సమాచారం ప్రకారం అప్పుల వాళ్ల వేధింపులతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అంచనావేశారు. మృతుల కుటుంబానికి ఓ పెట్రోల్ బంకుతో పాటు మెడికల్ షాపు కూడా ఉన్నట్టు తెలిపారు.
ఇలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఉరవకొండకు చెందిన మాధవయ్య కూరగాయల వ్యాపారి ఆర్ధిక ఇబ్బందులతో కుటుంబంతో సహా ఆత్మహత్యకు యత్నించాడు. ధర్మవరంలో చేనేత మగ్గంనేస్తూ జీవనం సాగిస్తున్న మాధవయ్యకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మాధవయ్య భార్య కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మృతి చెందింది. భార్య వైద్యం కోసం అప్పులు చేయడం, నలుగురు పిల్లల పోషణ కష్టం కావడంతో ధర్మవరం నుంచి ఉరవకొండకు వచ్చేశాడు. అక్కడ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటున్నాడు. ఐతే భార్య చనిపోవడం, ఆర్ధికంగా ఇబ్బందులు ఎక్కువ కావడంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. రాయదుర్గం సమీపంలోని కనేకల్ చెరువులో నలుగురు పిల్లలతో కలిసి దూకేశాడు. గుర్తించిన స్థానికులు పోలీసుల సాయంతో వారిని ఆస్పత్రికి తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Family suicide, Nizamabad