Home /News /telangana /

NIZAMABAD FOUR KILLED IN A ROAD ACCIDENT IN NIZAMABAD DISTRICT SNR

Road accident : నేషనల్ హైవేపై గాల్లో పల్టీలు కొట్టిన కారు .. స్పాట్‌లో నలుగురు మృతి

(CAR ACCIDENT)

(CAR ACCIDENT)

Road accident: రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు విడిచారు. తెల్లవారుజామున అతివేగంగా వెళ్తున్న కారు బోల్తా పడటంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురిలో నలుగురు స్పాట్‌లో మృతి చెందగా ..మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Nizamabad, India
నిజామాబాద్(Nizamabad)జిల్లాలో రహదారి రక్తంతో తడిసిపోయింది. బుధవారం(Wednesday)తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో స్పాట్‌లో నలుగురు మృతి(Four died) చెందారు. ముప్కాల్‌ (Mupkal) మండలం కొత్తపల్లి సమీపంలో వేగంగా వెళ్తున్న కారు టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. TS13 EF3029 నెంబర్ కలిసిన కారు హైదరాబాద్(Hyderabad)నుంచి నిర్మల్(Nirmal)వెళ్తుండగా ముప్కాల్‌ దగ్గర ప్రమాదానికి గురైంది. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి నిద్రలో ఉండటం వల్ల టైర్ పంక్చర్ అయిన విషయాన్ని గమనించలేకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Telangana : హాస్టల్‌లో బాలిక మృతి ..శవాన్ని ఇంటికి తీసుకెళ్లి అప్పగించడంపై పేరెంట్స్ ఆగ్రహం



దుర్ఘటన ..
జాతీయ రహదారి 44పై జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. కారును రోడ్డు పక్కకు తప్పించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన కారులో మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. చనిపోయిన వాళ్లలో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తుస్తున్నారు. మృతుల వివరాల ఆధారంగా బంధువులు, కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు పోలీసులు.
Published by:Siva Nanduri
First published:

Tags: Nizamabad, Road accident, Telangana News

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు