Home /News /telangana /

NIZAMABAD FOUR KILLED AFTER CAR COLLIDES WITH DIVIDER IN NIZAMABAD DISTRICT SNR

Telangana : కొంప ముంచిన నిద్రమత్తు .. కళ్లు మూసి తెరిచేలోపే గాల్లో కలిసిన నాలుగు ప్రాణాలు

నిజామాబాద్ జిల్లాలో నిద్రమత్తులో కారు డివైడర్‌ని ఢీకొట్టడంతో నలుగురు మృతి | Four killed after car collides with divider in Nizamabad district

నిజామాబాద్ జిల్లాలో నిద్రమత్తులో కారు డివైడర్‌ని ఢీకొట్టడంతో నలుగురు మృతి | Four killed after car collides with divider in Nizamabad district

Telangana : రహదారి రక్తంతో తడిసిపోయింది. తెల్లవారు జాము సమయంలో నిజామాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంతో వాతావరణం ఒక్కసారిగా భీతిల్లిపోయింది. కారులో ప్రయాణిస్తున్న ఫ్యామిలీలో నలుగురు స్పాట్‌లో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nizamabad, India
రహదారి రక్తంతో తడిసిపోయింది. తెల్లవారు జాము సమయంలో నిజామాబాద్(Nizamabad)జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంతో వాతావరణం ఒక్కసారిగా భీతిల్లిపోయింది. కారులో పక్క రాష్ట్రానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన చిన్న పొరపాటుతో నాలుగురి ప్రాణాలు(Four died) గాల్లో కలిసిపోయాయి. అందరూ ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్లు కావడం..అందులో ఇద్దరు చిన్నారులు ఉండటంతో ఘటన స్ధానికంగా కలకలం రేపింది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో చెల్లాచెదురుగా పడివున్న మృతదేహాల దృశ్యాలు స్థానికులకు కంట తడిపెట్టించాయి.

Political survey : ఆ జిల్లాలో ప్రధాన పార్టీకి చెందిన ఆ ఏడుగురికి ఈసారి టికెట్ డౌటే .. తేల్చి చెప్పిన పొలిటికల్ సర్వే



కొంప ముంచిన నిద్రమత్తు..
నిజామాబాద్(Nizamabad)జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 6గంటల సమయంలో బాల్కొండ క్రాస్‌ ముప్కాల్‌ (Mupkal) మండలం కొత్తపల్లి సమీపంలో వేగంగా వెళ్తున్న కారు డివైడర్‌ని ఢీకొని పల్టీలు కొట్టింది. ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. TS13 EF3029 నెంబర్ కలిసిన కారు రాత్రి 11గంటల సమయంలో మహరాష్ట్రలోని వార్ధా నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ముప్కాల్‌ దగ్గర ప్రమాదానికి గురైంది.



ఒకే ప్రమాదంలో నలుగురు మృతి..
కారులో మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నారు. హైదరాబాద్‌ టోలిచౌకిలోని అరుణాకాలనీలో నివాసముండే జుబేర్ ఇబ్రహీం అనే గ్లాస్ ఎంపోరియం బిజినెస్ చేస్తున్న వ్యక్తి తన భార్య ఇద్దరు పిల్లులు, బావమరదులతో కలిసి ప్రయాణిస్తున్నాడు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి సయ్యద్ సమీ నిద్రమత్తులో డివైడర్‌ని ఢీకొట్టాడు. కారు స్పీడుతో ఉండటం వల్ల మూడు పల్టీలు కొట్టింది. ప్రమాదంలో జరిగినప్పుడు కారులో ఉన్న ఏడుగురిలో డ్రైవింగ్ చేసిన సమీతో పాటు ఇబ్రహీం భార్య మిర్జాబేగం, ఆరు సంవత్సరాల అహీల్ అహ్మద్‌తో పాటు 6నెలల పసిపాప ఫిజా మృతి చెందారు.

Telangana : హాస్టల్‌లో బాలిక మృతి ..శవాన్ని ఇంటికి తీసుకెళ్లి అప్పగించడంపై పేరెంట్స్ ఆగ్రహం



దుర్ఘటన ..
జాతీయ రహదారి 44పై జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. కారును రోడ్డు పక్కకు తప్పించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన కారులో మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. నిద్రమత్తులో కారు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా తేల్చారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తుస్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Nizamabad, Road accident, Telangana News

తదుపరి వార్తలు