Nizamabad: బాగుపడతారని నేరాలు చేసిన బాలనేరస్తుల్ని అబ్జర్వేషన్ హోమ్‌కి తెస్తే అక్కడ కూడా మళ్లీ తప్పు చేశారు. నిజామాబాద్ జువైనల్ హోమ్ అధికారుల కళ్లుగప్పి బాత్రూం గోడకు రంద్రం చేసుకొని ఐదుగురు పారిపోయారు.
(P.Mahendar,News18,Nizamabad)
వాళ్లు బాలనేరస్తులు(juvenile offenders)కాదు. దేశముదుర్లు. చిన్నతనంలోనే నేరం చేస్తే తెలిసీ తెలియక చేసి ఉంటారని వాళ్లలో పరివర్తన తీసుకురావడం కోసం అధికారులు అబ్జర్వేషన్ హోమ్(Observation Home)లో ఉంచారు. అక్కడ కూడా తమ నేరపూరితమైన తెలివి తేటలు ఉపయోగించారు. పోలీసుల కళ్లు గప్పి పరార్ అయ్యారు. ఎంత విచిత్రంగా ఎస్కేప్ అయ్యారో తెలిసిన తర్వాత నిజామాబాద్(Nizamabad)జిల్లా పోలీసులే ఆశ్చర్యపోతున్నారు.
జైలుకు వచ్చి కూడా తప్పు చేశారు..
మైనర్లు నేరం చేస్తే వారిలో పరివర్తన తెచ్చేందుకు నేరాల పట్ల పరిపక్వత తీసుకురావడం కోసం ఆబ్జర్వేషన్ హోమ్‌లో ఉంచుతారు. నేరాలు చేసిన పలువురు మైనర్లను నిజామాబాద్ జిల్లా కేంద్రం నాగారంలో ఉన్న బాయ్స్ అబ్జర్వేషన్ హోంలో ఉంచారు. అయితే ఆదివారం రాత్రి జువైనల్ హోంకు సంబందించిన ఐదుగురు బాలనేరస్తులు పరార్ అయ్యారు. బాత్రూం గొడకు రంద్రం చేసి అందులోంచి తప్పించుకున్నట్లుగా అబ్జర్వేషన్ హోమ్ సూపరింటెండెంట్ సోమవారం ఉదయం పోలీసులకు పిర్యాదు చేశారు.
బాత్రూం గోడకు రంద్రం పెట్టిన బాలనేరస్తులు..
బాయ్స్ అబ్జర్వేషన్ సూపరింటెండెంట్ ఫిర్యాదుతో నిజామాబాద్ 5వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అబ్జర్వేషన్ హోమ్ నుంచి తప్పించుకున్న ఐదుగురు బాలనేరస్తుల్లో ఇద్దరు జగిత్యాల జిల్లాకు చెందిన వాళ్లు కాగా అధిలాబాద్ జిల్లా, కొమురంభీమ్ ఆసీఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లాకు చెందిన వాళ్లు ముగ్గురు ఉన్నట్లుగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సూపరింటెండెంట్ పేర్కొన్నారు. పరారిలో ఉన్న ఐదుగురు చోరీ కేసుల్లో నిందితులుగా ఉండి జువైనల్ హోమ్‌కు తరలించారు. జువైనల్ హోమ్‌లో రాత్రి విధులు నిర్వహించి గార్డ్స్ నిర్లక్ష్యం వల్లనే బాల నేరస్తులు బాత్ రూమ్ గోడకు రంద్రం చేశారు. అటుపై గొడను పగుల గోట్టి పారిపోయారు. జైల్లో గోడను పగలగొట్టే వరకు ఎవరు చూడపోవడం ఏమిటనే అనుమానం అందరిలో కలుగుతోంది. అయితే ఐదుగురు బాల నేరస్తులు చాకచ్యంగా తప్పించుకోవడంపై అధికారులు అదివారం విధులు నిర్వహించిన వారి పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
అధికారులు ఏం చేస్తున్నారు..
తెలిసి తెలియని వయసులో నేరాలకు పాల్పడిన వాళ్లను అబ్జర్వేషన్ హోమ్‌లో ఉంచి చదువు కోవాలి అనుకునే వాళ్లకు చదువు చెప్పిస్తారు. లేదంతో చేతివృత్తులు, కులవృత్తులకు సంబంధించిన పనులు చేయిస్తారు. ఫలితంగా జీవితంలో నేరాలు చేయకుండా తమ కాళ్లపై నిలబడతామనే నమ్మకం కలిగించడానికి ఈ రకమైన పనులు చేయిస్తారు.బాలనేరస్తుల్లో ఇలాంటి మార్పులు తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం ఈ అబ్జర్వేషన్ హోమ్ ఏర్పాటు చేసింది. వాటిని బాల నేరస్తులు ఉపయోగించుకుని సమాజంలో మంచిగా బ్రతికే విధంగా తమ జీవితాన్ని మలుచుకోవాలి తప్ప మళ్లీ నేరాలు చేసి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని న్యాయనిపుణులు సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.