హోమ్ /వార్తలు /తెలంగాణ /

Crime news : మూడో భార్య కూతురిపై టీఆర్ఎస్ నేత అత్యాచారం .. ఐస్‌క్రీమ్‌లో మత్తు కలిపి..

Crime news : మూడో భార్య కూతురిపై టీఆర్ఎస్ నేత అత్యాచారం .. ఐస్‌క్రీమ్‌లో మత్తు కలిపి..

Nizamabad minor rape

Nizamabad minor rape

Crime news: అతని కళ్లు కామంతో మూసుకుపోయాయి. భార్య మొదటి భర్తతో కలిగిన సంతానంపై కన్నేశాడు. మూడో పెళ్లి చేసుకున్న ఓ గల్లీ లీడర్ వరసకు కూతురయ్యే 16ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన నేరం బయటపడగానే పరార్ అయ్యాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Nizamabad, India

(P.Mahendar,News18,Nizamabad)
ఆ కామాంధుడి కళ్లు మూసుకుపోయాయి. వావి, వరసలు మరిచిపోయాడు. అప్పటికే ఇద్దరు భార్యలు వదిలించుకున్న దుర్మార్గుడు మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా మూడో భార్య కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిజామాబాద్(Nizamabad) జిల్లాలో ఓ గ్రామ వార్డు స‌భ్యుడు(Village Ward Member) వెలగబెట్టిన తప్పుడు చూసి స్థానికులే కాదు అధికార పార్టీ (Trs)నేతలు తలదించుకుంటున్నారు. చేసిన తప్పు బయటపడటంతో పారిపోయాడు నిందితుడు.


Telangana : నూడిల్స్ తిన్నందుకు స్టూడెంట్‌ని చావ బాదిన టీచర్ .. పాపం అసలేం జరిగిందంటేమైనర్‌పై కన్నేసిన కామాంధుడు..

నిజామాబాద్ జిల్లాలో జరిగిన దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామానికి చెందిన అధికార పార్టీ వార్డ్ మెంబర్ బైర చంద్రశేఖ‌ర్ ఓ వివాహితతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే ఆమె మొదటి భర్త ద్వారా ఆమెకు అప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిని ఆర్మూర్ లోని మామిడి పల్లి చౌరస్తా ప్రాంతంలో ఒక ఇంట్లో అద్దెకు ఉంచాడు. అయితే ఆ మ‌హిళ  ఆదివారం రోజు పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష రాసేందుకు వెళ్లింది. అయితే అదే స‌మ‌యంలో ఇంటికి వచ్చిన వార్డ్ మెంబర్ చంద్రశేఖర్ పిల్లలకు ఐస్ క్రీమ్‌లో మత్తు మందు క‌లిపి తినిపించాడు. పిల్ల‌లు మత్తులో ఉండగా 16 సంవత్సరాల బాలికపై అఘాయిత్యాని కి పాల్ప‌డ్డాడు.వావి, వరసలు మర్చిపోయి..

బాధిత మైనర్ బాలికకు తీవ్రంగా రక్తస్త్రావం కావడంతో వెంటనే తన బైక్‌పై ఆర్మూర్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకువెళ్లాడు. అయితే ఆసుప‌త్రి సిబ్బంది చికిత్స చేసేందుకు నిరాకరించారు. దీంతో నిజామాబాద్ ప్రభుత్వ జ‌న‌ర‌ల్ ఆస్పత్రి తీసుకువ‌చ్చాడు. ఆసుప‌త్రిలో  చేర్చి, బాలిక తల్లి పోన్ నంబర్ ఇచ్చి పరారయ్యాడు. విష‌యం తెలిపిన‌ బాధితురాలి తల్లి స్థానిక ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలికను వైద్య పరీక్షలు నిర్వ‌హించారు. బాలిక కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే అత్యాచారం చేసిన వార్డు సభ్యుడు బైర‌ చంద్రశేఖర్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Nagarkurnool: కడుపు నొప్పి తట్టుకోలేకపోయిన వ్యక్తి బాధలో ఏం చేశాడో తెలుసా..?ఐస్‌క్రీమ్‌లో మత్తు కలిపి అత్యాచారం..

చేపూర్‌ కాలనీ హరిపురంలో నివసిస్తున్న నిందితుడు చంద్రశేఖర్‌కి గతంలో రెండు పెళ్లిళ్లు జరిగినట్లుగా తెలుస్తోంది. వాళ్ల అతనితో విడిపోయిన తర్వాతే మూడో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని సహజీవనం చేస్తున్నట్లుగా తేల్చారు పోలీసులు. పరారీలో ఉన్న చంద్రశేఖర్‌ను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎంత‌టి క‌టిన చ‌ట్టాలు తీసుకు వ‌చ్చిన అన్ని తెలిసిన వ్య‌క్తులు సైతం భ‌యం లేకుండా బాలిక‌పై అత్య‌చార‌కు పాల్ప‌డుతున్నారు. ఇలాంటి వారిపై వెంట‌నే జ‌డ్జిమెంట్ ఇచ్చి క‌టినంగా శిక్షించాల‌ని మ‌హిళ సంఘ‌లు డిమాండ్ చేస్తున్నాయి.

First published:

Tags: Minor girl raped, Nizamabad, Telangana crime news

ఉత్తమ కథలు