హోమ్ /వార్తలు /తెలంగాణ /

Crime news : మద్యం తాగొచ్చి కూతుర్ని కాటేసిన తండ్రి .. ఇంతటి దారుణం ఎక్కడ జరిగిందో తెలుసా..?

Crime news : మద్యం తాగొచ్చి కూతుర్ని కాటేసిన తండ్రి .. ఇంతటి దారుణం ఎక్కడ జరిగిందో తెలుసా..?

FATHER RAPE DAUGHTER

FATHER RAPE DAUGHTER

Crime news: సమాజంలో ఆడ‌పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణే లేకుండా పోతోంది. ఆడ‌పిల్ల ఎవ‌రితో చ‌నువుగా ఉండాలి. కన్నతండ్రి ద‌గ్గ‌ర కూడా రక్ష‌ణ లేకపోతే ఇంకా ఎక్క‌డ ఉంటుంది. నిజామాబాద్ జిల్లాలో ఓ క‌న్న తండ్రి చేసిన దురాగతం ఆలస్యంగా బయటపడింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Nizamabad, India

(P.Mahendar,News18,Nizamabad)

సమాజంలో ఆడ‌పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణే లేకుండా పోతోంది. ఆడ‌పిల్ల ఎవ‌రితో చ‌నువుగా ఉండాలి. కన్నతండ్రి ద‌గ్గ‌ర కూడా రక్ష‌ణ లేకపోతే ఇంకా ఎక్క‌డ ఉంటుంది. మాన‌వ మృగాల కోసంం ఎన్ని కఠిన చ‌ట్టాలు తీసుకొచ్చినప్పటికి కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు తమ పైశాచికానందం కోసం ఎంతటి దారుణాలకైనా తెగిస్తున్నారు. నిజామాబాద్(Nizamabad)జిల్లాలో ఓ క‌న్న తండ్రి(Father)చేసిన దురాగతం ఆలస్యంగా బయటపడింది. సభ్యసమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించిన నిందితుడ్ని విడిచిపెట్టవద్దని ప్రజాసంఘాలు కోరుతున్నాయి.

Crime news: భార్య,భర్తల మధ్య చిచ్చు పెట్టిన ప్రియుడు .. భర్త మృతి .. తర్వాత ఏం జరిగిందో తెలుసా..?వావి, వరసలు మర్చిపోయి..

నిజామాబాద్ జిల్లా బోద‌న్  పట్టణంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. రాకాసిపేట్‌లోని గోసం బస్తీలో శాఖమూరి సావిత్రి అనే మహిళ ఇళ్లలో పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది.సావిత్రికి భర్త మహేష్ కొడుకు, ఓ కూతురు ఉన్నారు. కొడుకు వయసు 14ఏళ్లు కాగా కూతురు వయసు 12 సంవత్సరాలు. 8వ త‌ర‌గ‌తి చ‌దువుతోంది. వీరంతా రాకాసిపేట్‌లో నివాసముంటున్నారు. ఇంటి పెద్ద మహేష్ కూలీ పని చేస్తుండే వాడు. కొద్ది రోజులుగా పని లేకపోవడంతో మద్యం తాగి ఇంట్లోనే కాళీగా ఉంటున్నాడు. ఈనెల 2న‌ సావిత్రి బోద‌న్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైట్ ఇచ్చింది. భర్తపై ఆమె చేసిన ఫిర్యాదుతో పోలీసులే షాక్ అయ్యారు.

కన్నకూతురిని కాటేసిన తండ్రి...

సావిత్రి కూలీ పనికి వెళ్లిన సమయంలో తన భర్త మహేష్‌ 12సంవత్సరాల కూతురిపై అత్యాచారానికి పాల్పడినట్లుగా ఫిర్యాదులో పేర్కొంది. మూడ్రోజుల పాటు ఆగ‌స్టు 31, సెప్టెంబ‌ర్ 1వ తేది, 2న ఇంట్లో ఉన్న కూతుర్ని లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా తెలిపింది. సావిత్రి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు లేడి పోలీస్ టీంతో బాలిక వాంగ్ములం రికార్డు చేసినట్లుగా ఏసీపీ కిర‌ణ్ కుమార్ తెలిపారు. కన్నబిడ్డపై అఘాయిత్యానికి పాల్పడిన బాలిక తండ్రి మ‌హేష్‌పై  సెక్ష‌న్ 376, పోక్స్ చ‌ట్టం కింద  కేసులు నమోదు చేయడం జరిగింది.

Hyderabad: మాదాపూర్‌ ఎస్‌ఐకి రెండేళ్ల జైలుశిక్ష .. ఛీ ఆ విషయంలో కక్కూర్తి పడినందుకే..పోలీసులకు భార్య ఫిర్యాదు ..

కూతురిపై తండ్రే అత్యాచారానికి పాల్పడిన విషయం బయటపడటంతో మహేష్ పరార్‌ అయ్యాడు. నిందితుడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు శనివారం మధ్యాహ్నం బోధన్ బ‌స్టాండ్ ప్రాంతంలో ప‌ట్టుకున్నారు. నిందితుడ్ని కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. గతంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఆరు నెలల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయడంతో 10 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ కేసులో కూడా 6నెలలు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి  మ‌హేష్‌కు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. వావి, వరసలు మర్చిపోయి ఆడవాళ్లపై బరితెగిస్తున్న నేరస్తులకు త్వరగా కఠిన శిక్ష పడేలా చూడాలని స్థానిక మ‌హిళ సంఘ‌లు డిమాండ్ చేస్తున్నాయి.

First published:

Tags: Minor girl raped, Nizamabad, Telangana crime news

ఉత్తమ కథలు