హోమ్ /వార్తలు /తెలంగాణ /

Family suicide : వ్యాపారి ఫ్యామిలీ చావుకి ఆ నలుగురే కారణం .. సూసైడ్‌ లెటర్‌లో ఏముందంటే..?

Family suicide : వ్యాపారి ఫ్యామిలీ చావుకి ఆ నలుగురే కారణం .. సూసైడ్‌ లెటర్‌లో ఏముందంటే..?

family suicide

family suicide

Family suicide: నిజామాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫ్యామిలీ సూసైడ్‌ కేసు కలకలం రేపుతోంది. ముందుగా కుటుంబ సభ్యులకు విషం ఇచ్చి వారు చనిపోయిన తర్వాత అతను ప్రాణాలు తీసుకున్నాడు. ఈ నాలుగు మరణాలకు కారణం రియల్ ఎస్టేట్ వ్యాపారి బిజినెస్ పార్టనర్స్ వేధింపులే కారణమని తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nizamabad, India

(P.Mahendar,News18,Nizamabad)

నిజామాబాద్‌(Nizamabad)లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫ్యామిలీ సూసైడ్‌ కేసు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈకేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నాలుగు  మరణాలకు రియల్ ఎస్టేట్ వ్యాపారి(Real estate dealer)తో కలిసి వ్యాపారం చేస్తున్న పార్టనర్స్ (Partners)వేధింపులే కారణమని తెలుస్తోంది. వాటిని తట్టుకోలేకే యజమాని ముందుగా కుటుంబ సభ్యులకు విషం ఇచ్చాడు. వాళ్లు చనిపోయిన తర్వాత తాను ప్రాణాలు తీసుకున్నాడు. ఈకేసులో సూసైడ్‌ లెటర్‌(Suicide letter)కీలకంగా మారింది.

Mulugu: ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ విషయంలో టీఆర్ఎస్ అధిష్టానం మాట నిలబెట్టుకుంటుందా..?సూసైడ్‌ కేసులో ట్విస్ట్ ..

నిజామాబాద్‌లో జరిగిన ఫ్యామిలీ సూసైడ్ కేసులో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన కొత్తకొండ‌ సూర్యప్రకాష్ అతని భార్య అక్షయ , కూతురు ప్రత్యూష, కొడుకు ఆద్వైత్‌కు విషమిచ్చి తనూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కొత్త కొండ‌ సూర్యప్రకాష్ కుటుంబం  బతుకుదెరువు కోసం 40 ఏళ్ల క్రితం నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ కు వెళ్లింది. అక్కడే ఐరన్ హార్డ్‌వేర్ షాపు, పెట్రోల్ బంక్‌ వ్యాపారం ఉంది. ఎనిమిది ఏళ్ల క్రితం పెట్రోల్ బంక్‌ను అమ్మేసి హైదరాబాద్ కు మకాం మార్చారు. హైదరాబాద్‌లో నలుగురు భాగస్వాములతో కలిసి సూర్యప్రకాష్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగారు.

పార్టనర్స్ టార్చర్‌ భరించలేక ..

ఉమ్మడి వ్యాపారంలో భాస్వాముల మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయి. అవి కాస్తా గొడవలకు దారి తీశాయి. సూర్యప్రకాష్ పార్టనర్స్‌ పలుమార్లు ఇంటికి వ‌చ్చి దాడి చేశారు. దీంతో సూర్య ప్ర‌కాష్ త‌న కుటుంబాన్ని తీసుకుని పదిహేను రోజుల క్రితం  నిజామాబాద్ వచ్చి ఓ హోటల్ లో ఉంటున్నారు. అయితే శ‌నివారం ఉద‌యం నుంచి ఎవ‌రు బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఎలాంటి పూడ్ ఆర్డర్ చేయలేదు.హోటల్‌ సిబ్బంది తలుపు తట్టినప్పటికి తెరవకపోవడంతో నిద్రపోతున్నారేమోనని వదిలేశారు. ఆదివారం రూమ్ క్లీనింగ్ కోసం డోర్‌ కొట్టినప్పటికి తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు.

BJP | KTR : బండి సంజయ్‌,బీజేపీ నేతలపై కేటీఆర్ సెటైర్ .. వైరల్ అవుతున్న వీడియో ఇదేహోటల్‌లోనే శవాలు ..

పోలీసులు గది తలుపులు తెరిచి చూడటంతో వ్యాపారి సూర్య ప్రకాష్ ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. బెడ్‌పైన అయన భార్య, ఇద్దరు పిల్లలు విగత జీవు లుగా కనిపించారు. కుటుంబ సభ్యులకు ముందుగా కేక్‌లో విషం కలిపి తినిపించిన సూర్యప్రకాష్ వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత ఉరి వేసుకున్నట్లు గదిలో దొరికిన ఆనవాళ్లను బట్టి పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. మృతదేహాల నుంచి రక్తం కారడంతో పిల్లల ముక్కుల్లో దూది కూడా పెట్టాడు. భార్య మృత దేహంపై దుప్పటి కప్పాడు. కుటుంబ సభ్యుల మృతదేహాలను సక్రమంగా బెడ్లపైన పడు కోబెట్టిన సూర్యప్రకాష్ భార్య చున్నితో ఉరివేసుకు న్నాడు. గదిలో పోలీసులకు లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు.

నలుగురి ప్రాణాలు తీసిన ఆ నలుగురు..

సూసైడ్‌ లెటర్‌తో పాటు రియల్ ఎస్టేట్‌ వ్యాపారంలో భాగస్వాములు సూర్య ప్ర‌కాష్ ఇంటిపైకి వ‌చ్చి దాడి చేసినట్లు లేఖలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కిరణ్ కుమార్, వెంకట్ అనే ఇద్దరు మోసం చేశారు. తన చావుకు వారే కారణమని రాసినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరి  పేర్లు కూడా సూసైడ్ నోట్ ఉన్నట్లుగా స‌మాచారం.  అందరం క‌లిసి వ్యాపారం చేద్ద‌మ‌ని  నాలుగురితో జ‌త‌క‌ట్టాడు.. కానీ చివ‌ర‌కు ఆ నాలుగురు వ్యాపార భాగస్వాముల‌ కార‌ణంగానే తాను త‌న కుటుంబ‌సభ్యులతో కలిసి ప్రాణాలు విడిచారు.సూర్యప్రకాష్‌ బంధువులు మాత్రం నలుగురు చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

First published:

Tags: Family suicide, Nizamabad, Telangana crime news

ఉత్తమ కథలు