(P.Mahendar,News18,Nizamabad)
ఇద్దరు కవల పిల్లులు పుట్టగానే తల్లి చనిపోయింది. దీంతో తండ్రి మరో వివాహం చేసుకున్నాడు. అనంతరం వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే ఇద్దరు కవల ఆడపిల్లలను వదిలించుకోవాలని సవితి తల్లి ప్లాన్ చేసింది. మీకు పెళ్లిలు చేస్తామని చెప్పి ఇద్దరు మైనర్లను రాజస్థాన్ కు చెందిన మార్వాడిలకు మద్య వర్తులతో బేరం పెట్టుకున్నారు. కవలలకు పెళ్లి చేసి పంపిచారు. పెళ్లి చేసుకున్న వారు పెట్టే నరకయాతన భరించలేక ఒక బాలిక పారిపోయి చైల్డ్ ప్రోటేక్షన్ అధికారులను కలిసింది. దీంతో ఈ పెళ్లిలకు కారణమైనా వారిపై పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
ఎస్పీ తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో ఇద్దరు కవల ఆడ పిల్లలు ఉన్నారు. వారు పుట్టగానే తల్లి మృతి చెందింది. దీంతో తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఒక బాబు, ఒక పాప పుట్టింది. అయితే ఈ ఇద్దరు కవలలకు 14 సంవత్సరాల వయస్సు రాగానే వారిని వదిలించుకోవాలని సవితి తల్లి, తండ్రి నిర్ణయించుకున్నారు. అదే అదునుగా భావించిన సవితి తల్లి తనకు తెలిసిన వారితో నా సవితి బిడ్డలను అమ్మేస్తానని చెప్పింది. దీంతో మద్య వర్తులు రాజస్తాన్ కు చెందిన శర్మణ్, కృష్ణ కుమార్ అనే ఇద్దరు మార్వాడి వ్యక్తులతో బేరం కుదుర్చుకున్నారు. ఒకరిని 80 వేలకు, మరొకరిని 50 వేలకు అమ్మెందుకు ఒప్పుకున్నారు. అయితే ఈ ఇద్దరు అమ్మాయిలకు మీకు పెళ్లి చేస్తున్నామని చేప్పారు. వీరి మాటలు నమ్మి ఆ ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. అయితే హైదరాబాద్ శివారులో ఇద్దరు కవలలకు వివాహం జరిపించారు.
వివాహం చేసుకున్న వ్యక్తులు హైదరాబాద్ సమీపంలో మకాం పెట్టారు. వివాహం అనంతరం ఇది వరకే వివాహం జరిగిందని పిల్లలు సైతం ఉన్నారని అమ్మాయిలకు తెలియడంతో వారి మధ్య గొడవ జరిగింది. కానీ వారు పెళ్లి చేసుకుని ఈ చిన్నారులను లైంగికంగా వేధించారు. దీంతో ఆ బాధలు తట్టుకోలేక అష్టకష్టాలు పడి తప్పించుకుని పారిపోయి కామారెడ్డికి చేరుకుందని ఎప్పీ తెలిపారు. చైల్డ్ ప్రోటేక్షన్ అధికారి స్రవంతిని కలిసింది. వారు మా పోలీసులకు సమాచారం అందిచారు. దీంతో ఆ బాలిక చేప్పిన వివరాలతో ఈ ఘటనకు కారణమైన వారిని అదుపులోకీ తిసుకున్నాము. తన చెల్లిని తన వద్దకు చేర్చి ఇద్దరిని చైల్డ్ ప్రోటేక్షన్ హౌస్ లో ఉంచామని ఎస్పీ తెలిపారు.
సవితి తల్లి, తండ్రి, పెళ్లి చేసుకున్న శర్మన్, కృష్ణకుమార్ వీరితో పాటు మద్యవర్తులు కాలర్ రాంబాటి, రమేష్, మహేందర్ మొత్తం ఏడుగురు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీరందరిపైన పోక్స్ చట్టం కింద అరెస్ట్ చేసిన రిమాండ్ కు తలించామని ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ కనబర్చిన వారిని అభినందించారు. ఈనెల 16వ తేదీన ఉగ్రవాయు గ్రామం నుంచి ఆ గ్రామస్తులు ఓ అమ్మాయి ఏడుస్తూ ఉందని సమాచారం ఇచ్చారని చైల్డ్ వెల్పేర్ అధికారి శ్రవంతి చెబుతున్నారు. మా సిబ్బందితో వెళ్లి అమ్మాయిని ఆరా తీయడం జరిగింది. తనకు తల్లి లేదని..తన చిన్నతనంలోనే చనిపోయిందని చెప్పింది. వారిద్దరు కవల పిల్లలని వాళ్ళ అమ్మ చనిపోవడంతో వాళ్ళ నాన్న మరో పెళ్లి చేసుకున్నాడని చెప్పింది. వాళ్ళ నాన్న చిన్నతనం నుంచి వారిని పట్టించుకోకపోవడంతో వాళ్ళ నాన్నమ్మ వద్ద పెరిగామని చెప్పింది.
ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నామని..ఆ తర్వాత స్కూల్ మాన్పించేసి వ్యవసాయ పనులకు పంపించారని చెప్పింది. గత సెప్టెంబర్ లో రాజస్థాన్ చెందిన మార్వాడి అతనికి 50వేలకు ఆమెను ఇచ్చేశాడని చెప్పింది. అతను హైదరాబాద్ కు తీసుకెళ్లి ఆమెను పెళ్లి చేసుకుని శారీరకంగా వాడుకున్నాడని చెప్పింది. అయితే ఈ అమ్మాయి కన్న ముందు అతనికి పెళ్లయి ఒక పాప కూడా ఉందని తెలిసింది. ఈ అమ్మాయి అతన్ని నిలదీయడంతో ఆమెను కొట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు. దీంతో ఆమె దగ్గర ఉన్న 100 రూపాయలతో కామారెడ్డి వరకు వచ్చింది.
ఇంటికి వెళితే మళ్ళీ నాన్న కొడతాడనే ఉద్దేశంతో ఆ గుడి వద్ద ఉంటే ఎవరైనా అన్నం పెట్టరా అని ఆశతో అక్కడ ఉన్నానని చెప్పింది. గత 20 రోజుల క్రితం ఈ అమ్మాయి అక్క ను కూడా ఎవరికో అమ్మేసినట్టుగా తెలిసిందని చెప్పింది. ఆ సమాచారం వినగానే అమ్మాయిని సురక్షితంగా మా ఆధీనంలో ఉంచుకొని ఆమెకు జరిగిన విషయాలను అడిగి తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ అమ్మాయిల ఇద్దరిని హింసించినటువంటి వారిఈ ఏడుగురిని కూడా రిమాండ్ కు తరలించారు. అక్క చెల్లెలను మా సంరక్షణలోనే ఉంచాం. వీరు చదువుకుంటే చదివిపించి వారి భవిష్యత్తు కోసం మా వంతు సహాయం అందిస్తామని ఆమె తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Nizamabad, Telangana