Home /News /telangana /

NIZAMABAD FAMILY SELFIE VIDEO GOING VIRAL IN NIZAMABAD DISTRICT SNR NZB

Nizamabad : నిజామాబాద్ జిల్లాలో సెల్ఫీ వీడియో వైరల్..అందులో ఏముందో తెలుసా

(వైరల్ సెల్ఫీ వీడియో)

(వైరల్ సెల్ఫీ వీడియో)

Video Viral: అందరికి పరాయి వ్యక్తులతో ప్రాణహాని ఉంటుంది. కాని నిజామాబాద్ జిల్లాలో సొంత కుటుంబ సభ్యులతోనే ముప్పు ఉందంటూ ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో ద్వారా తన గోడును అందరికి తెలియజేశాడు. అయితే అసలు అతడ్ని కుటుంబ సభ్యులు ఎందుకు టార్చర్ పెడుతున్నారో తెలుసా.

ఇంకా చదవండి ...
    (P.Mahendar,News18,Nizamabad)
    ప్ర‌తి మ‌నిషికి కుటుంబమే బ‌లం, బలహీనత. అన్నాదమ్ముల అనుబంధాన్ని ర‌క్త సంబంధంఅంటారు. రక్త పంచుకు పుట్టిన అన్నతమ్ములు ఒకరికొకరు తోడు ఉంటే ఎంతో బ‌లంగా ఉంటుంది. నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఓ అన్న కుటుంబ సభ్యుల వల్లే తనకు ప్రాణహాని ఉందని తనకు, తన కుటుంబానికి న్యాయం చేయకపోతే భార్య, పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని సెల్పీ వీడియో (Selfie video)ను సోష‌ల్ మీడియా(Social media)లో పోస్ట్ చేయడంతో వార్త నిజామాబాద్ (Nizamabad)జిల్లాలో వైరల్ అవుతోంది.

    ఆస్తి కోసం అన్నపైనే పగ..
    నిజామాబాద్ జిల్లాలో భార్యా పిల్లతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని బాధతో చెబుతున్న వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. బోధన్ మండలం  సాలూర గ్రామానికి చెందిన ప్రకాష్ గిరి అనే వ్యక్తితో పాటు అతని సోదరుడు మధుగిరి మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయి.  ఆ గొడవలతోనే ఒకరిపై మరొకరు పోలీస్ కంప్లైంట్ చేసుకున్నారు. ఆస్తి తగాదా కావడంతో గ్రామంలో కులపెద్దలు, గ్రామపెద్దల సమక్షంలో చర్చలు జరిపి రాజీ కుదిర్చారు. గతంలో ప్రకాష్ భార్య చెల్లెల్ని మధుతో వివాహం చేసేందుకు సంబందం మాట్లాడుకున్నారు. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగ్గదాలు ఉన్నాయని అమ్మాయి తరపు బంధువులు వివాహానికి అంగీకరించలేదు. దీంతో అన్నదమ్ముల మధ్య మళ్లీ గొడవలు మొదలయ్యాయి.



    వైరల్ అవుతున్న సెల్ఫీ వీడియో..
    తన సోదరుడు అతని తరపు బంధువుల నుంచి తన ఫ్యామిలీకి ప్రాణహాని ఉందంటూ ప్రకాష్‌గిరి తన ఆవేదన వ్యక్తం చేశాడు. తనతో పాటు ఇద్దరు పిల్లలకు రక్షణ కల్పించాలని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. ఇంకా విచిత్రమైన సమస్య ఏమిటంటే ఈ విషయంలో తనకు శత్రువులు మరెవరో కాదని అమ్మ, అక్క , బావ, నాలుగురు అత్త‌లు, మా తమ్ముడే అంటూ వారిపై పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదుచేసిన విషయాన్నిసెల్ఫీ వీడియో ద్వారా తెలియజేశాడు.

    ఇది చదవండి: కూతురు పెళ్లి..తండ్రి చావు అంతా ఆ గంటలోనే జరిగింది



    నా ఫ్యామిలీని కాపాడండి..
    తన ఫిర్యాదుతో పోలీసులు గ్రామానికి వస్తే తనను బెదిరించిన వాళ్లంతా ఊరు వదిలి వెళ్లిపోవడంతో ప్రకాష్ మరింత భయాందోళన చెందుతున్నాడు. ఎలాగైనా తనను చంపుతానని అసరమైతే జైలుకు వెళ్తానని మధు చెప్పినట్లుగా సెల్ఫీ వీడియోలో చెప్పాడు ప్రకాష్. తనకు ఎవరూ మద్దతుగా లేరని కాబట్టి పోలీసులే తనతో పాటు భార్య, పిల్లలకు రక్షణ కల్పించాలని లేనిపక్షంలో తామే ప్రాణాలు తీసుకుంటామని తన ఆవేదన వ్యక్తం చేశాడు. తమ్ముడి నుంచి ప్రాణహాని ఉందంటూ ప్రకాష్ సెల్ఫీ వీడియో విస్తృతంగా వైరల్ అవుతోంది. దీనిపై కేసులు విచారిస్తున్నారు.

    ఇది చదవండి: ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవ‌ర్ .. కారణం అదేనట


    Published by:Siva Nanduri
    First published:

    Tags: Crime news, Nizamabad District, Selfie video suicide

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు