NIZAMABAD FAMILY MEMBERS DONATE DEAD BODY OF OLD WOMAN TO MEDICAL STUDENTS IN NIZAMABAD DISTRICT SNR NZB
Nizamabad: 80ఏళ్ల తమతో కలిసి జీవించిన ఓ పెద్దావిడ శవాన్ని..వాళ్లంతా కలిసి ఏం చేశారో తెలుసా
(శవదానం)
Nizamabad:చావును కూడ పెళ్లిలా చేస్తుకుంటున్నారు కొందరు కుటుంబ సభ్యులు. చనిపోయిన బంధువుల మృతదేహాలే తమకు వద్దని వదిలివెళ్లిపోతుంటారు ఇంకొందరు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ ఫ్యామిలీ మాత్రం ఈ రెండు చేయకుండా శవాన్ని దానం చేశారు. ఎవరికి ...ఎందుకో తెలుసా.
ఉన్నత భావాలు కలిగిన వ్యక్తులు తమ జీవితంలో కొందరికైనా ఉపయోగపడాలని ఆలోచిస్తారు. ప్రాణం ఉన్నప్పడుతు తోచిన సాయం, అవసరమైన సహకారం అందిస్తారు. మరి చనిపోయిన తర్వాత..అప్పుడు కూడా ఏదో విధంగా ఉపయోగపడాలనే ఆలోచన అందరికి రాదు. కాని నిజామాబాద్(Nizamabad) జిల్లా ధర్పల్లి(Dharpalli)మండలం కేశారం(Kesharam)గ్రామానికి చెందిన బ్రాహ్మణపల్లి సావిత్రి కుటుబం సభ్యులకు వచ్చింది. తమ కుటుంబ సభ్యురాలు చనిపోయింది. అందరిలా సావిత్రిSavitriకి దహన సంస్కారాలు, అంత్యక్రియలు నిర్వహించడం కాకుండా పూర్తి భిన్నంగా ఆలోచించారు. 80ఏళ్ల వయసులో చనిపోయిన సావిత్రి మృతదేహాన్ని ఖననం(Burial), దహనం(Cremation)చేస్తే వచ్చే పుణ్యం కంటే...మెడికల్ కాలేజీ విద్యార్ధులకు (Medical students)మృతదేహాన్ని అప్పగిస్తే కనీసం వాళ్ల రీసెర్చ్(Research)కైనా ఉపయోగపడుతుందని భావించారు. కుటుంబ సభ్యులంతా చర్చించుకొని చివరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సావిత్రి సోమవారం(Monday)మధ్యాహ్నం 1గంట 28 నిమిషాలకు మరణించారు. సావిత్రి భర్త లింగయ్య(Lingaya), కూతురు విజయ(Vijaya), అల్లుడు నారాయణ(Narayana)తో పాటు మిగిలిన కుటుంబ సభ్యులంతా కలిసి ఆమె దేహాన్ని మెడికల్ కాలేజీ(Medical College)కి దానం చేశారు. ఇది కుటుంబ సభ్యులు చైతన్యంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయమే తప్ప తమ ఆత్మీయ బంధువుపై ప్రేమ లేకపోవడం కాదు. అప్పటి వరకు తమతో ఉన్న ఓ పెద్దావిడ చనిపోయిన తర్వాత కూడా ఏదో రకంగా ఉపయోగపడాలనే విధంగా వారి కుటుంబ సభ్యులు ఆలోచించడం ఆదర్శనీయమని పలువురు అభినందిస్తున్నారు.
చనిపోయిన తర్వాత కూడా..
సావిత్రమ్మ మృతదేహాన్ని ఆస్పత్రి వైద్యులకు అప్పగించారు ఆమె కుటుంబ సభ్యులు. సావిత్రి కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం సమాజానికి ఆదర్శం కావాలని.. ప్రజలు ఇలాంటి వాటిని ప్రోత్సహించాలని డాక్టర్ నాగ మోహన్ అన్నారు. ఈ సందర్భంగా సావిత్రి కుటుంబ సభ్యులను, బంధువులను డాక్టర్ నాగ మోహన్ అభినందించారు.
కుటుంబసభ్యుల గొప్ప మనసు..
మారుతున్న కాలానికి అనగూణంగానే చాలా మంది ఉన్నతమైన భావాలతో ఆలోచిస్తున్నారు. అందుకే ప్రాణం ఉండగా రక్తదానం చేయడం, ప్రాణపాయస్థితిలో ఉండగానే అవయవదానం చేయడం వంటివి చేస్తూ సమాజంలో నివసించే చాలా మంది ప్రజలకు కొందరు ఆదర్శప్రాయంగా మారుతున్నారు. కాని నిజామాబాద్ జిల్లాలో సావిత్ర కుటుంబ సభ్యులు ఇంకో అడుగు ముందుకే చనిపోయిన తర్వాత కూడా మరికొందరికి ఉపయోగపడాలనే విధంగా మృతదేహాన్ని మెడికల్ స్టూడెంట్స్ రీసెర్చ్‌కి పనికొస్తుందని దానం చేయడం శుభపరిణామంగా చూడాలంటున్నారు విద్యావేత్తలు, మేధావులు. అంతిమ సంస్కారాలు నిర్వహించలేని దయనీయస్థితిలో ఉన్నవాళ్లు..పేదరికంలో ఉండి దహనక్రియలు చేయలని వాళ్లు ఇలా మెడికల్ రీసెర్చ్లకు శవాలను దానం చేయడం మంచి పద్దతేనని మరికొందరు భావిస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.