(P.Mahendar,News18,Nizamabad)
అవసరానికి అప్పు చేస్తే ...అది కాస్తా ఉరి తాడుగా మారి పీకకు చుట్టుకున్నట్లైంది. అప్పు చేసింది రూపాయి అయితే వడ్డీ(Interest) పది రూపాయలు కావడంతో బాధితుడు తట్టుకోలేకపోయాడు. అప్పు ఇచ్చిన వ్యక్తి వేధింపులు భరించలేకపోయాడు. చివరకు న్యాయం జరుగుతుందని కలెక్టరెట్(Collectorate)కు వచ్చి కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నిజామాబాద్(Nizamabad)లో కలకలం రేపింది. పేదలు, మధ్యతరగతి కుటుంబాలను పీడ్చుకుతింటున్న వడ్డీ వ్యాపారులకు కళ్లెం వేయమని బాధితుడితో పాటు భార్య, పిల్లలు వేడుకోవడం అందర్ని కలచివేసింది.
ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం..
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బొమ్మ శ్రీనివాస్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలను తీసుకొని వచ్చి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడం కలకలం రేపింది. అక్కడే ఉన్న సిబ్బంది, అధికారులు అతడ్ని అడ్డుకున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారని ప్రశ్నించడంతో తన గోడు వెళ్లబోసుకున్నాడు. నందిపేట మండలం కుద్వాన్పూర్ గ్రామానికి చెందిన బొమ్మ శ్రీనివాస్ మచ్చర్ల గ్రామానికి చెందిన శ్రీరాముల సత్యనారాయణ, శ్రీరాముల కృష్ణ అనే అన్నదమ్ముల దగ్గర 2020లో లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నాడు.
కలెక్టరెట్ ముందు కలకలం..
లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చిన సత్యనారాయణ, కృష్ణ అన్నదమ్ములు శ్రీనివాస్ దగ్గర వందకు పది రూపాయల వడ్డీ చొప్పున బాధితుడి దగ్గర నుంచి వడ్డీ తీసుకుంటున్నారు. తీసుకున్న అప్పు కంటే మూడు రెట్లు అధికంగా వడ్డీ వసులు చేశారు వడ్డీ వ్యాపారాలు. వడ్డీ వసూలు చేస్తూనే కాస్త డబ్బులు కట్టడం ఆలస్యమైనా వేధింపులకు గురి చేస్తూ ఉండటంతో శ్రీనివాస్ తట్టుకోలేకపోయాడు. వడ్డీ వ్యాపారుల ఆగడాలతో విసిగిపోయాడు. తన గోడు వెళ్లను ఆదివారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో బోసుకుందామనుకున్నాడు. ఆదివారం బోనాల పండుగ కావడం ప్రజావాణి నిర్వహించకపోవడంతో దిగాలు చెందాడు.
వడ్డీ వ్యాపారులపై చర్యలు..
సోమవారం ఉదయమే భార్య, పిల్లలతో కలిసి కలెక్టర్ కార్యాలయానికి వచ్చాడు బాధితుడు శ్రీనివాస్. కలెక్టరెట్ గేటు ముందు పెట్రోల్ పోసుకున్నాడు. ఆత్మహత్యాయత్నం చేసుకుంటుడగా స్థానికులు అడ్డుకున్నారు. అంతలో కలెక్టరేట్ నుంచి బయటకు వెళ్తున్న కలెక్టర్ నారాయణ రెడ్డి కాళ్లపై పడి బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ అధిక వడ్డీ వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Family suicide, Telangana News