హోమ్ /వార్తలు /తెలంగాణ /

Crime news : భార్య తనతో గడపటం లేదనే కోపంతో .. ఆమెను ఏం చేశాడో తెలుసా..?

Crime news : భార్య తనతో గడపటం లేదనే కోపంతో .. ఆమెను ఏం చేశాడో తెలుసా..?

nizamabad crime

nizamabad crime

Crime news: మద్యం మత్తు అతడ్ని ఉన్మాదిగా మార్చింది. తాగుడు అనే చెడు వ్యసనం అతనిలోని రాక్షసుడ్ని నిద్రలేపింది. నూరేళ్లు తోడుగా ఉంటానని ..వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకొని ఎనిమిదేళ్లు కాపురం చేసిన భార్యను మద్యానికి బానిసైన భర్త ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nizamabad, India

  (P.Mahendar,News18,Nizamabad)

  చెడు వ్యసనాలు ఎంతటి దారుణాలకైనా ప్రేరేపిస్తాయి. దురలవాట్లకు బానిసలైన వాళ్లు ఎంతటి కిరాతకానికైనా ఒడిగడతారని నిజామాబాద్ (Nizamabad)జిల్లాలో జరిగిన ఓ సంఘటనతో తేలింది. కలకాలం పాలు నీళ్ల‌ల క‌లిసి మెలిసి ఉంటామ‌ని బాస‌లు చేసి వివాహం చేసుకున్నారు ఆ దంప‌తులు. క‌ష్ట, సుఖాల్లో తోడు నీడల జీవితంతం ఉందామానుకున్నారు. కాని ఆమె పాలిట మొగుడే యముడి అవతారమెత్తుతాడని ఊహించలేకపోయింది. ఎనిమిదేళ్ల కాపురం చేసిన భార్యను తన వ్యసనాల కోసం హతమార్చడం అందర్ని విస్మయానికి గురి చేసింది. భార్యను ఉరివేసి భర్త చంపడానికి కారణం తెలుకున్న స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.

  Mulugu: ఇంటినే పేకాట క్లబ్‌గా మార్చేసిన బిజినెస్‌మెన్ .. ఎక్కడో..? ఎంత డబ్బు పట్టుబడిందో తెలుసా..?  తనతో ఉండటం లేదనే కోపంతో...

  నిజామాబాద్ జిల్లాలో వివాహిత హత్య స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఆర్మూర్ పట్టణానికి చెందిన స్వప్నకు బోద‌న్‌కి చెందిన ల‌క్ష్మ‌ణ్ తో ఎనిమిదేళ్ల క్రితం పెద్ద‌లు వివాహం జ‌రిపించారు. వీరి ఎనిమిదేళ్ల కాపురానికి గుర్తుగా ముగ్గురు కొడుకులు పుట్టారు.  లక్ష్మణ్ బోద‌న్ నుంచి  ఆర్మూర్‌కు వచ్చి కిరాయి ఇంట్లో ఉంటూ తాపి మేస్త్రీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. లక్ష్మణ్ గత కొద్దిరోజులుగా మద్యానికి బానిసై భార్య స్వప్నతో గొడవపడుతూ ఉండేవాడు. ఈక్రమంలోనే స్వ‌ప్న తల్లి అనారోగ్యానికి గురవడంతో తరచూ పుట్టింటికి వెళ్లి వస్తూ ఉండేది. ఆ విషయంలోనే భార్య,భర్తలిద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది.

  భార్యను చంపి పరారైన భర్త..

  స్వప్న తనతో ఉండకుండా తరచూ పుట్టింటికి వెళ్లి వస్తుండటాన్ని ల‌క్ష్మ‌ణ్ తట్టుకోలేకపోయాడు. ఆ కోపంతోనే వాళ్లు  అద్దె కు ఉంటున్న ఇంటికి తీసుకుని వెళ్లి స్వ‌ప్నపై దాడి చేశాడు. స్వ‌ప్న‌  మెడకు చున్నీ బిగించి ఉరి వేసి హత్య చేశాడు. భార్యను హతమార్చిన తర్వాత పెద్ద కొడుకును ఇంటి దగ్గర వదిలిపెట్టి మిగిలిన ఇద్దరు కొడుకులను తీసుకొని పరార్ అయ్యాడు లక్ష్మణ్. స్వప్న హత్యకు గురైన విషయాన్ని ఆమె పెద్ద కొడుకు ద్వారా తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు.

  Nagarkurnool: కొడుకు పెళ్లికి ఒప్పుకోవడం లేదని కన్నతల్లి ఏం చేసిందో తెలుసా..?  కొంప ముంచిన క్షణికావేశం..

  హత్యోదంతాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటన స్తలానికి చేరుకున్నారు. ఆమెను ముందే చంపి, ఉరివేశాడా లేక ఉరి వేశాడా అనే ఆధారాలను నోట్ చేసుకున్నారు. కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మద్యం మత్తులో కట్టుకున్న భార్యను చంపి తాను జైలుపాలవడమే కాకుండా ముగ్గురు పిల్లల్ని తల్లి, తండ్రి లేని అనాథలుగా మార్చాడని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Husband kill wife, Nizamabad, Telangana crime news

  ఉత్తమ కథలు