హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nizamabad: ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో డిజిట‌ల్ అటెండెన్స్..మొబైల్ యాప్ లో ఉపాధ్యాయుల హాజరు నమోదు..లొకేషన్లలో గందరగోళం

Nizamabad: ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో డిజిట‌ల్ అటెండెన్స్..మొబైల్ యాప్ లో ఉపాధ్యాయుల హాజరు నమోదు..లొకేషన్లలో గందరగోళం

ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో డిజిట‌ల్ అటెండెన్స్

ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో డిజిట‌ల్ అటెండెన్స్

ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో ఉపాధ్యాయుల హాజ‌ర్ పై వినూత్న పద్ధతిని తెలంగాణ విద్యాశాఖ‌ ప్రవేశపెట్టింది. అయితే గతంలో రిజిస్ట్రార్ పై సంతకం పెట్టేవారు. అయితే ఇప్పుడు స్కూల్ వ‌ద్ద ఉండి మొబైల్ లోనే యాప్ ద్వారా అటెండెన్స్ వేసే విధంగా నూత‌న ప‌ద్ద‌తిని తీసుకువ‌చ్చారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యాప్ ద్వారా టీచర్లు అటెండెన్స్ వేసుకుంటున్నారు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nizamabad, India

పి మ‌హేంద‌ర్, నిజామాబాద్ జిల్లా, న్యూస్ 18 తెలుగు ప్ర‌తినిధి.

ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో ఉపాధ్యాయుల హాజ‌ర్ పై వినూత్న పద్ధతిని తెలంగాణ విద్యాశాఖ‌ ప్రవేశపెట్టింది. అయితే గతంలో రిజిస్ట్రార్ పై సంతకం పెట్టేవారు. అయితే ఇప్పుడు స్కూల్ వ‌ద్ద ఉండి మొబైల్ లోనే యాప్ ద్వారా అటెండెన్స్ వేసే విధంగా నూత‌న ప‌ద్ద‌తిని తీసుకువ‌చ్చారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యాప్ ద్వారా టీచర్లు అటెండెన్స్ వేసుకుంటున్నారు.  ఉపాధ్యాయుల హాజరుపై పారదర్శకంగా ఉండేందుకు రాష్ట్ర భుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గత 15 రోజులుగా జియో అటెండెన్స్ యాప్ ద్వారా హాజరు విధానాన్ని అమలు చేస్తోంది. దీంతో సత్ఫలితాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో లోకేష‌న్ స‌రిగా చూపించ‌క ఇబ్బందులు  ప‌డుతున్నామ‌ని ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు.

Adilabad: ఈ పంటతో రైతులకు భారీగా ఆదాయం.. ఆదిలాబాద్ జిల్లాలో పెరుగుతున్న సాగు

నిజామాబాద్  జిల్లాలో 1,196 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 1 లక్ష 20 వేల‌ మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యాశాఖలో 5,500 మంది సిబ్బంది పని చేస్తున్నారు.  మారుమూల ప్రాంతాల్లోని బడులకు సమయానికి వెళ్లకపోవడం..వంతుల వారీగా విధులు నిర్వర్తిస్తున్నారనే ఫిర్యాదులు వ‌చ్చాయి. దీంతో ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని పెంచి.. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. గత నెల‌ 14న ఉపాధ్యాయులకు యాప్ ఇన్స్ టాలేషన్..  వినియోగం పై అవగాహన కల్పించారు. అటెండెన్స్ లో లోపాలు కొన్ని సందర్భాల్లో సమయానికి వచ్చినా ఆలస్యమైనట్లు చూపుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు. ఉదయం టైం ఇన్ అయినా సాయంత్రానికి టైం అవుట్ చూయించట్లేదని మరికొందరు చెబుతున్నారు.  లోకేష‌న్ మాత్రం స‌రిగా చూపించ‌డం లేద‌ని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

ఉదయం 9 గంటలకు స్కూల్ కి వెళ్లి యాప్ ఓపెన్ చేసి అటెండెన్స్ వేస్తున్నామ‌ని నందీపేట్ మండ‌ల్ తాల్వేద జిల్లా ప‌రిష‌త్ పాఠ‌శాల‌లో విధులు నిర్వ‌హిస్తున్నా సాయ‌న్న‌ చెబుతున్నారు. అయితే మా స్కూల్లో కేషన్ కు బదులు వేరే లోకేషన్ చూపిస్తోంది. స్కూల్ రాగానే ఇన్ పంచ టైప్ లో ఉదయం యాప్ లో ఫొటో దిగి అటెండెన్స్ వేయాలి. అయితే ఒక్కోన్న సారి గ్రీన్ వ‌స్తుంది. ఒక్కోక్క సారి రెడ్ వ‌స్తుంది. దీంతో మాకు వ‌చ్చినా రాన‌ట్టు చూపిస్తుందన్నారు. తర్వాత స్కూల్ ముగియగానే మరోసారి ఔట్ పంచ్  అటెండెన్స్ వేయాలి. అయితే ఆ స‌మ‌యంలో అంద‌రు ఒకే సారి యాఫ్ ను వాడ‌డంతో బీజీ బీజీ వ‌స్తుంది. ఇబ్బందిగా మారింద‌న్నారు. రెండు సార్లు అటెండెన్స్ చేస్తున్నా గ్రీన్ మార్క్ రాకుండా రెడ్ మార్క్ వస్తుండటంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. అటెండెన్స్ పడిందా లేదా అన్న అయోమయంలో ఉంటున్నారు. అటెండెన్స్ పడితే గ్రీన్ మార్క్ చూపించాలి. కానీ రెడ్ మార్క్ చూపిస్తుండటంతో వారు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ విధానం బాగుంది. కానీ చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తే బాగుంటుంద‌న్నారు.

గూగుల్ ప్లేస్టోర్ నుంచి జీయో అటెండెన్స్ యాఫ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. యూజర్ ఐడీ, పాస్వర్డ్ లాగిన్ అయిన తర్వాత నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి. పాఠశాలకు వచ్చినప్పుడు  టైం ఇన్ వెళ్లేటప్పుడు  టైం అవుట్ ఆప్షన్లలో సెల్ఫీ దిగాల్సి ఉంటుంది. లొకేషన్ ఆధారంగా  బడిలో ఉన్నారా..లేదా అనేది తెలిసిపోతుంది.  సెలవులు.. ఇతర ప్రభుత్వ పనిపై బయటికి వెళ్లాల్సి వచ్చిన వాటికి సంబంధించిన ఆప్షన్లు ఉంటాయి.  స్థానికంగా నెట్వ‌ర్క్  లేకపోయినా ఆఫ్లైన్లో హాజరు నమోదు చేసుకొని ఆన్లైన్లోకి వచ్చిన వెంటనే ఆ సమాచారాన్ని వెబ్సైట్లోకి అప్లోడ్ చేసేలా రూపొందించారు. అయితే  ఈ యాప్ లో చిన్న చిన్న స‌మ‌స్య‌లు ఉన్నాయి వాటిని ప‌రిష్క‌రించాల‌ని పై అధికారులు విద్యాశాఖ దృష్టికి తీసుకువెళ్లామని చెబుతున్నారు.

First published:

Tags: Nizamabad, Nizamabad District, Teachers

ఉత్తమ కథలు