నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోరు ఆసక్తికరం...టీఆర్ఎస్‌లో వర్గపోరుకు ఆజ్యం..

ఛైర్మన్ ప‌ద‌వి కోసం ఎమ్మెల్యేల మధ్య పోటీ పోటీ నెల‌కొంది.. ఆ పదవిని త‌మ వారికి ఇవ్వాలి అంటే లేదు మా కుటుంబ సభ్యులకు కావాలంటూ నేతలు పట్టుబడుతున్నారు.

news18-telugu
Updated: February 15, 2020, 10:33 PM IST
నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోరు ఆసక్తికరం...టీఆర్ఎస్‌లో వర్గపోరుకు ఆజ్యం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మ‌న్ పీఠాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ కైవ‌సం చేసుకుంది.. ఛైర్మన్ ప‌ద‌వి కోసం ఎమ్మెల్యేల మధ్య పోటీ పోటీ నెల‌కొంది.. ఆ పదవిని త‌మ వారికి ఇవ్వాలి అంటే లేదు మా కుటుంబ సభ్యులకు కావాలంటూ నేతలు పట్టుబడుతున్నారు. ఐతే డీసీసీబీ లేదంటే డీసీఎంఎస్ ఛైర్మన్ పీఠం, తమ బంధువులకు ఇప్పించుకునేందుకు, నువ్వానేనా అంటూ అధిస్టానం వ‌ద్ద‌కు వెళ్లారు.. అధిష్టానం ఎవ‌రి వైపు మొగ్గ‌చూపుతుందో.. ఎవ‌రిని డీసీసీబీ చైర్మ‌న్ గిరి వరిస్తుందో చూద్దాం. నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ పీఠం పై అధికార పార్టీ పాగావేసింది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఉండే కీలకమైన ఈ పదవిని తమ బంధువులకు దక్కేలా ఎమ్మెల్యేలు పావులు క‌దుతున్నారు.. ఛైర్మన్ రేసులో ఉన్న ముఖ్య నేతల బంధుగణం డైరెక్టర్లుగా నామినేషన్లు వేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డీసీసీబీ పదవి దక్కాలంటే ఏదైనా సహకార సంఘం డైరెక్టర్ గా ఎన్నికై, సొసైటీ ఛైర్మన్ పదవి పొందాల్సి ఉంటుంది. దీంతో డీసీసీబీ ఛైర్మన్ రేసులో ఉన్న ద్వితీయశ్రేణి నేతలంతా తమ సహకార సంఘాన్ని ఏకగ్రీవం చేసుకున్నారు. ప్రతిపక్ష పార్టీలు సహకార ఎన్నికల్లో చేతులెత్తేయడంతో డీసీసీబీతో పాటు డీసీఎంఎస్ స్ధానాలు గులాబీ పార్టీ కైవసం చేసుకోనుంది. ఇంత వరకు బాగానే ఉన్నా అధికార పార్టీకి డీసీసీబీ ఛైర్మన్ ఎన్నిక అసలు సమస్యగా మారింది.. ఛైర్మన్ రేసులో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు భాస్కర్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తండ్రి బిగాల కృష్ణమూర్తి గుప్తా ఉన్నారు. ఆటూ మంత్రి ప్రశాంత్ రెడ్డి తన బంధువు రమేష్ రెడ్డి కోసం ప్ర‌యాత్నాలు చేస్తున్నాడు.. మరోవైపు టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన అమర్ నాథ్ బాబు సైతం తన వంతు ప్రయత్నాలు మొదలెట్టసరని స‌మాచారం.

కామారెడ్డి జిల్లా బాన్సువాడకు నియోజకవర్గానికి చెందిన స్పీకర్ పోచారం తనయుడు భాస్కర్ రెడ్డి ఈ పాటికే దేశాయిపేట సహకారం సంఘం డైరెక్టర్ గా ఏకగ్రీవం అయ్యారట. మిగతా డైరెక్టర్ స్ధానాలను సైతం ఏకగ్రీవం చేయించి పీఏసీఎస్ ఛైర్మన్ గా రెండోసారి పీఠం ఎక్కనున్నారు. గతంలో డీసీసీబీ ఛైర్మన్ గా పోటీ పడ్డా అనివార్య కారణాలతో మరో నేత ఈ పదవి దక్కించు కున్నారు. ఈసారి పకడ్బందీ వ్యూహాంతో డీసీసీబీ ఛైర్మన్ కానీ, ఆప్కాబ్ డైరెక్టర్ పదవి కానీ దక్కించుకోవాలని స్కెచ్ వేస్తున్నారట. అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా తన తండ్రిని జడ్పీ ఛైర్మన్ చేయాలని చివరి నిమిషం వరకు ప్రయత్నం చేశారు. సమీకరణాలు కలసిరాక ఆయన తన తండ్రిని డీసీసీబీ ఛైర్మన్ రేసుకు నిలబెట్టారు... ఈ మేరకు మాక్లూర్‌ సొసైటీ డైరెక్టర్‌ స్థానాలను మొత్తం ఏకగ్రీవం చేయించారు.. కేటీఆర్ ను కలిసి తన మసన్సులో మాట చెప్పేందుకు ఎమ్మెల్యే గణేష్ గుప్తా రెడీ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. మంత్రి ప్రశాంత్ రెడ్డి సైతం తన బంధువు కుంట రమేష్ రెడ్డికి డీసీసీబీ పీఠం దక్కేలా చూస్తాననే హామి ఇచ్చారట. వేల్పూర్ సొసైటీ ఛైర్మన్‌గా రమేష్ రెడ్డిని ఏకగ్రీవం చేసి, మంత్రి తన స్టైల్ లో చక్రం తిప్పుతున్నారనే ప్రచారం జరుగుతోంది. పెంటఖుర్దు సొసైటీ ఏకగ్రీవం చేసిన సీనియర్ నేత అమర్ నాథ్ బాబు సీఎం కేసీఆర్ ఆశీస్సులతో డీసీసీబీ ఛైర్మన్ పీఠం కోసం తనవంతు ప్రయత్నాలు మొదలెట్టేశారట. మాజీ మంత్రి మండవ సహకారంతో అమర్ నాథ్ బాబు ఈ పీఠం కోసం పోటీపడుతున్నారనే ప్రచారం జ‌రుగుతుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు ఎవ‌రిని వ‌రిస్తాయో అంతుచిక్కడం లేదు.. ఎంతామంది ప్ర‌య‌త్నాలు చేసిన సీఎం కేసీఆర్ చివ‌రి నిమిషంలో కొత్త వారిని తెర‌పైకి తెచ్చిన ఆశ్య‌ర్య‌పోవాల్సిన ప‌నిలేద‌ని పార్టీ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుకుంటున్నాయి.. ఎవరి పంతం నెగ్గుతుందో ఎవరి బంధుగణానికి పదవి దక్కుతుందో తెలియాలంటే వేచిచూడాల్సిందే.

(పి.మ‌హేంద‌ర్, న్యూస్ 18తెలుగు, ప్ర‌తినిది)

First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు