Home /News /telangana /

NIZAMABAD DAUGHTER IN LAW KILLED HER UNCLE FOR INTERFERING IN AN EXTRAMARITAL AFFAIR IN NIZAMABAD DISTRICT SNR NZB

Extramarital Affair: ఆ పని చేయవద్దన్నాడని మామ ప్రాణం తీసిన కోడలు

(మామ మర్డర్‌కి కోడలు స్కెచ్)

(మామ మర్డర్‌కి కోడలు స్కెచ్)

Extramarital Affair:ఓ కోడలు మామను హత్య చేయించింది. భర్త దుబాయ్‌లో ఉంటున్నాడని..బంధువుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలియిన మామ కోడల్ని నిలదీసినందుకు ప్రియుడి సాయంతో హత్య చేసి అడ్డుతొలగించుకుంది. నేరం బయటపడటంతో పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు.

ఇంకా చదవండి ...
    (P.Mahendar,News18,Nizamabad)
    పెద్దలు కుదిర్చిన బంధుత్వాలను తమ స్వార్ధం కోసం తెంచుకుంటున్నారు. ఇది పద్దతి కాదని చెప్పే పెద్దలను అడ్డుతొలగించుకుంటున్నారు. శారీరక సుఖం కోసం కట్టుకున్న వాళ్లను, కట్టుబాట్లను తెంచుకొని హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. హత్యలు చేసే స్థాయికి దిగజారిపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఓ కోడలు తన వివాహేతర సంబంధానికి అడ్డుపడుతున్నాడని ఏకంగా మామయ్యనే ప్రియుడి సహాయంతో హతమార్చింది. నిజామాబాద్(Nizamabad)జిల్లా ఇందల్వాయి(Indalwai)మండలం గన్నారం (Gannaram)గ్రామానికి చెందిన గంగారాం(Gangaram)ను పొలంలో వడ్ల కుప్పపై పడుకున్న సమయంలో కొట్టి చంపారు. అదే సమయంలో పక్కనే ఉన్న మరో వడ్లకుప్ప దగ్గర కాపలా ఉన్న వృద్ధుడు గంగారాంను హతమార్చడం చూసి పోలీసులకు చెప్పడంతో కేసు నమోదు చేసుకొని హత్యకు గల కారణాలు, నిందితుల్ని పట్టుకున్నారు. గంగారాం హత్యకు వివాహేతర సంబంధమే(Extramarital Affair)కారణమని పోలీసలు తేల్చారు. మృతునికి ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు బతుకుదెరువు కోసం దుబాయ్‌ వెళ్లాడు. అతని భార్య లత(Latha) అత్తమామల దగ్గర ఉంటోంది. మదనపల్లి గ్రామానికి చెందిన దుంపటి శ్రీనివాస్‌(Srinivas) అనే సమీప బంధువు గంగారాం పొలం కౌలు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఈక్రమంలోనే శ్రీనివాస్‌తో లతకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈవిషయం మామ గంగారాంకు తెలియడంతో పద్దతి మార్చుకోమని కోడలికి మంచిగా చెప్పాడు. తీరు మార్చుకోకపోవడంతో పలుమార్లు గొడవపడ్డారు. విషయం చేయి దాటిపోతోందని గ్రహించిన గంగారం శ్రీనివాస్‌ని కౌలు మాన్పించాడు. తన ప్రియుడ్ని తనకు దూరం చేశాడన్న కోపంతో రగిలిపోయిన లత కొద్ది రోజులు పుట్టింటింకి వెళ్లింది. వరి కోతలు పూర్తై పంట చేతికి రాగానే తన పొలం తనకు అప్పగించమని కోడలు లత ప్రియుడు శ్రీనివాస్‌ని వెంటబెట్టుకొచ్చి మామ గంగారంతో గొడవపెట్టుకుంది. ఈక్రమంలోనే పొలం, పంట రెండూ ఇవ్వడం కుదరదని చెప్పడంతో ఎలాగైనా మామను అడ్డు తొలగించుకోవాలని చూశారు.

    కోడలి రూపంలో ఉన్న రాక్షసి..
    ఈ నెల‌ 23న గంగారాంతో గొడవపడింది కోడలు లత. మరుసటి రోజే మర్డర్ స్కెచ్‌ వేసుకున్నారు. 24న రాత్రి ప్రియుడు శ్రీనివాస్‌తో పాటు మదనపల్లి గ్రామానికి చెందిన బి.సురేష్ ఇద్దరూ కలిసి గన్నారం గ్రామానికి వచ్చారు. వడ్ల కుప్పపై పడుకున్న గంగారాం ఛాతీపైన కూర్చుని శ్రీనివాస్ వెదురు కర్రతో గొంతుపైన అదిమి ప‌ట్టుకుని.. పక్కనే ఉన్న రాయితో తలపై కొట్టి హత్య చేశాడు. ఇందుకు సురేష్ సహకరించారు. ఆ శ‌బ్దానికి పక్కనే ఉన్న మరో వడ్ల కుప్ప వద్ద కాపలాగా ఉన్న వృద్ధుడు జాజుల పెద్దనారాయణ నిద్రలేచి వీరిని అడ్డుకోవాలని చూడగా అతడిపై రాయితో దాడి చేసి హత్యాయ త్నం చేశారు. ఇంతలో వాహనాలు రావడంతో అక్కడి నుంచి నిందితులిద్దరూ పరారయ్యారు.

    నిజామాబాద్ జిల్లాలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మామను హత్య చేయించిన కోడలు | Daughter in law killed her uncle for interfering in an extramarital affair in Nizamabad district
    (మామపై కత్తి దూసిన కోడలు)


    ప్రియుడితో మామకు స్కెచ్..
    హత్య జరిగినట్లుగా సమాచారం అందుకున్న ఇందల్వాయి పోలీసులు కేసు న మోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీస్ విచార ణలో మృతుని కోడలు లత ఆమె ప్రియుడు శ్రీనివాస్‌తో పాటు సురేష్ అనే మరో వ్యక్తి హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో అంగీకరించారు. ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండుకు తరలించారు. వివాహేతర సంబంధం కోసం ఆస్తి గొడవ పెట్టుకొని మామను హత్య చేసిన కేసును రోజుల వ్యవధిలో చేధించిన సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుళ్లను ఏసీపీ అభినందించారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Illicit relationship, Nizamabad District

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు