హోమ్ /వార్తలు /తెలంగాణ /

September 17 Telangana: తెలంగాణ సాయుధ పోరాటంలో మూడు నెలలు బందీ అయిన దాశరథీ కృష్ణమాచార్యులు.. 

September 17 Telangana: తెలంగాణ సాయుధ పోరాటంలో మూడు నెలలు బందీ అయిన దాశరథీ కృష్ణమాచార్యులు.. 

దాశరథి కృష్ణమాచార్యులు

దాశరథి కృష్ణమాచార్యులు

తెలంగాణ సాయుద పోరాటంలో మూడు నెల‌లు బంది అయినా ధాశ‌ర‌థి కృష్ణ‌మాచారీ..  నా తెలంగాణ కోటి రతనాల వీణ అని జైలు గొడ‌ల‌పై రాశారు..          - నాటి స‌హిత్య‌మే నేత ఉద్య‌మ‌నికి స్పూర్తిగా నిలుస్తోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Nizamabad, India

  (P. Mahender, News18, Nizamabad)

  భారతదేశానికి 1947 ఆగస్టు 15వ బ్రిటిష్ వాళ్ల నుంచి స్వాతంత్య్రం (Independence) లభించినప్పటికీ తెలంగాణ మాత్రం అదనంగా మరో 13 నెలల పాటు పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ తెలంగాణ సాయుధ పోరాటం (Telangana armed struggle)లో ప్రాణాలు కోల్పోయిన వారెందరో.. విముక్తి పోరాటంలో నిజాంకు (Nizam) వ్యతిరేకంగా రాసిన సాహిత్యం ప్రధాన పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు.. తమ కవితలు రచనల ద్వారా తెలంగాణ (Telangana) వీరోచిత పోరాటంపై ప్రభావం చూపిన కవులను వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన నిజాం పాలకులు కొంతకాలం పాటు నిజామాబాద్ ఖిలా జైలులో బంధించారు. ఇలా బంధించబడిన వారిలో దాశరథి కృష్ణమాచార్యులు (Dasharathi Krishnamacharya), వట్టికోట ఆళ్వారులు తదితరులు ఉన్నారు. దాశరథి కృష్ణమాచార్య నిజామాబాద్ జైలులో మూడు నెలల పాటు ఉన్నట్లు సమాచారం.

  ఈ సమయంలో దాశరథి జైలు గోడలపై ప‌ళ్లు  తోముకునే బొగ్గుతో నిజాం పాలనకు వ్యతిరేకంగా సాహిత్యాన్ని రాశారు. 'నా తెలంగాణ కోటి రత నాల వీణ (Na Telangana Koti Rata Nala Veena)' అని గోడలపై రాశారు. ఈ కవితాంశం అప్పటి నిజాం విముక్తి పోరాటంతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో తొలి.. మ‌లి విడ‌త ఉద్య‌మాలోనూ తిరుగులేని ప్ర‌భావాన్ని చూపింది.. ఉద్య‌మాల‌ను ముందుకు న‌డిపింది.

  తెలంగాణ భూభాగం స్వేచ్ఛ పొందిన అనంతరం దాశరథి (Dasharathi Krishnamacharya)..  1977 ఆగస్టు 19న రాష్ట్ర ఆస్థాన కవిగా నియమితులయ్యారు. 1978లో గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సొసైటీ నుంచి 'ఆంధ్ర కవితా సారధి' బిరుదు పొందారు. 1987లో కళా సరస్వతి ఆంధ్రరత్న పురస్కారం పొందారు. 1987 నవంబర్ 5న దాశరథి మరణించారు.

  ఇప్పటికీ దాశరథి సాహిత్యం తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పుతూనే ఉంది.

  దాశరథి  (Dasharathi Krishnamacharya) జైలు గొడ‌ల‌పై రాసిన కొన్ని క‌వితాంశాలు.

  మ‌రిచిపోండి అన్ని వాదాలు, మాన‌వ‌తా వాదాలే మన వేదాలు..

  నేడు గెలుపు రేపు ఓటమి.. నేడోటమి రేపు గెలుపు అదేరా జీవితం.. మరి ఎందుకు ఏడవటం..?

  పువ్వుతోటి వ‌జ్ర‌మైన తెగిపోతుంది.. పాట‌తో శిల‌యైనా క‌రిగిపోతుంది..

  పేదల గూర్చి నేను మ్రోగింతును రుద్రవీణ..  పలికింతును విప్లవ గీతికావని..

  ఓ నిజాం పిశాచమా.. కానరాడు.. నిన్ను బోలిన రాజు మాకెన్నడేని..  తీగెలను తెంపి అగ్నిలో దింపినావు..

  నా తెలంగాణ కోటి రతనాల వీణ.. అని సాహిత్యాన్ని ధాశ‌ర‌థి కృష్ణ‌మాచార్యులు రాశారు.

  దాశర‌థి కృష్ణ‌మాచార్యులు  (Dasharathi Krishnamacharya) ఉన్న జైలును మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వ‌ర్ రెడ్డి సంద‌ర్శించారు.. ఆయ‌న రాసిన క‌విత‌ల‌ను చ‌దివారు.  దాశర‌థి కృష్ణ‌మాచార్యుల చిత్ర పాఠానికి పూల‌మాల‌ వేసి నివాళులు అర్పించారు.. ఇది విలీన దినోత్స‌వం కాదు. విమోచ‌న దినోత్స‌వం అని మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వ‌ర్ రెడ్డి అన్నారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్​ 17 (September 17)ను తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా (Telangana Jateeya Samaikyata Dinotsavam) జరుపుకొంటోంది. ఇదే  సందర్భంగా కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవంగా ఉత్సవాలు జరుపుకోవాలని నిర్ణయించింది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Nizamabad, September 17, Telangana

  ఉత్తమ కథలు