హోమ్ /వార్తలు /తెలంగాణ /

Cows died in fire: నిజామాబాద్​లో కలకలం.. అంబులెన్సులో తరలిస్తున్న 10 ఆవులు సజీవ దహనం.. అసలేం జరిగిందంటే?

Cows died in fire: నిజామాబాద్​లో కలకలం.. అంబులెన్సులో తరలిస్తున్న 10 ఆవులు సజీవ దహనం.. అసలేం జరిగిందంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నిజామాబాద్ జిల్లాలో ఆవుల అక్రమ రవాణా సంచలనం సృష్టిస్తోంది. రవాణా చేస్తున్న గోవులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి శివారులో ఈ ఘటన జరిగింది.

నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో ఆవుల అక్రమ రవాణా సంచలనం సృష్టిస్తోంది. రవాణా చేస్తున్న గోవుల న్నీ అగ్నికి ఆహుతయ్యాయి (Cows burn alive). నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి శివారులో ఈ ఘటన జరిగింది. ఓ అంబులెన్స్‌లో సుమారు 10 వరకూ ఆవులను తరలిస్తుండగా, ఆ వాహనం (Vehicle) మొత్తం తగలబడిపోయింది. AP25 W 0212 నంబరు గల ఆ అంబులెన్స్‌ (Ambulance)లో సుమారు 10 వరకూ ఆవులను తరలిస్తున్నారు. నిజామాబాద్ నుండి హైదరాబాద్ (Hyderabad) తరలిస్తుండగా ఇందల్వాయి వద్ద ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. కొందరు వ్యక్తులు అంబులెన్స్‌ అని స్టిక్కర్ పెట్టి టెంపో వాహనంలో 9Tempo vehicle) ఆవులను తరలిస్తున్నారు. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న అంబులెన్స్ మాక్లూర్‌తండా సమీపంలోకి చేరుకోగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

రోడ్డు పక్కనే ఆపేసి పరారి..

మంటలు భారీగా ఎగిసిపడటంతో టెంపో డ్రైవర్ (Tempo driver)​ భయపడిపోయాడు. అయితే అందులో ఉన్న ఆవులను ఏ మాత్రం విడిపించకుండా తన దారి తను చూసుకున్నాడు. ఆ డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కనే ఆపేసి పరారయ్యాడు. అయితే అప్పుడే మంటలు చూసిన బాటసారులు (walkers) వాహనంలో ఉన్నవారిని కాపాడాలనే ఉద్దేశంతో అద్దాలు పగలగొట్టారు. అయితే అప్పటికే అందులో అక్రమంగా తరలిస్తున్న ఆవులు సజీవ దహనం (Cows burnt alive) అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు (Police), అగ్నిమాప సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ఊపిరాడక చనిపోయి ఉంటాయని..

అంబులెన్స్ డ్రైవర్ పరారీలో (Ambulance driver escaped) ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో మొత్తం 10 ఆవులు సజీవ దహనం (Cows Burnt alive)అయ్యాయి. వీటి సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మంటలు అంటుకుని మరణించగా.. మరికొన్ని ఊపిరాడక చనిపోయి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. నిజామాబాద్ ఏసీపీ (Nizamabad ACP) ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి (Fire Accident) గల కారణాలపై దర్యాప్తు (Investigation) చేస్తున్నారు. వెటర్నరీ వైద్యులు (Veterinary doctors) ఆవులకు పోస్ట్‌మార్టం నిర్వహించారు.

Megastar Chiranjeevi |Talasani: మెగాస్టార్​ చిరంజీవి మరో బృహత్తర నిర్ణయం..? మేడే సందర్భంగా వెల్లడించిన మంత్రి తలసాని 

ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుచేపట్టారు. అంబులెన్స్‌ రిజిస్ట్రేషన్, టోల్ ప్లాజా దగ్గర సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఇక, ఆవులను తరలిస్తున్న అంబులెన్స్‌లో ఉన్న సిలిండర్ లీక్ కావడం వల్లే మంటలు చెలరేగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు.

గత నెలలో కూడా ఇలాంటి ఘటనలో ఆవులు సజీవ దహనం అయ్యాయి. అర్ధరాత్రి వేళ ఓ ఇంట్లో చెలరేగిన మంటల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ‌సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదంలో 10 అవులు కూడా అగ్ని కీలల్లో చిక్కుకుని మృతిచెందాయి. ఈ విషాద ఘటన హిహచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో చోటుచేసుకుంది.

First published:

Tags: Cow, Fire Accident, Nizamabad

ఉత్తమ కథలు