Home /News /telangana /

NIZAMABAD COW GAVE BIRTH TO A STRANGE PIG LIKE ANIMAL IN KAMAREDDY DISTRICT SNR NZB

Telangana : ఆవు కడుపున వింత జంతువు .. వామ్మో అదే నిజం అంటున్న స్ఖానికులు

(ఆవు కడుపున వింత జంతువు)

(ఆవు కడుపున వింత జంతువు)

Nizamabad : వింత సంఘటన కాదు...విచిత్రమైన జంతువు. అయితే అది పుట్టింది పశువు కడున కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అది ఏ జంతువో ..ఎందుకలా పుట్టిందో అర్ధం కాక బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారమే జరిగి ఉంటుందని అపోహనపడుతున్నారు.

    (P.Mahendar,News18,Nizamabad)
    ప్రకృతిలో జీవించే పశువులు, జంతువులు, జీవులు పుట్టుకతోనే శరీర నిర్మాణంలో కొన్ని మార్పులు చేర్పులు కనిపిస్తూ ఉంటాయి. ఒక రకమైన పశువు కడుపులో మరో జాతికి చెందిన జంతువు పుట్టడం చూసి అక్కడి స్థానికులు ఆశ్చర్యపోయారు. అంతే కాదు అందుకు కాలజ్ఞానంతో ముడిపెట్టి విస్తృతంగా మాట్లాడుకుంటున్నారు. ఆ వింత జంతువును చూసేందుకు జనం తండోప తండాలుగా వస్తున్నారు. కామారెడ్డి(Kamareddy)జిల్లాలో పుట్టిన ఆ వింత జంతువు (Strange animal)గురించే ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు.

    ఆవు కడుపున పంది..
    వర్తమానంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు కాలజ్ఞాని బ్రహ్మంగారు చెప్పిన మాటలను గుర్తు చేస్తుంటాయి. నంది కడుపున పంది పుడుతుందనే నానుడి ఎంతో కాలంగా వినిపిస్తోంది. కాని కామారెడ్డి జిల్లాలో నిజంగా పంది లాంటి విచిత్రమైన జంతువు ఆవు కడుపున పుట్టింది. అసలు ఈ వార్త వినడానికే కాదు ఆ జంతువును చూడటానికి కూడా వింతగానే ఉంది. కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి మండలం కనకల్ గ్రామానికి చెందిన ఎర్రొళ్ల సాయిలు అనే వ్యక్తికి చెందిన ఆవు గురువారం రాత్రి ఈనింది. అయితే ఆవును పెంచుతున్న యజమాని సాయిలు లేగ దూడ పుడుతుందని భావించాడు. కాని పంది రూపంలో ఉన్న ఓ వింత జంతువు పుట్టడంతో చూసి ఆశ్చర్యపోయాడు.



    పుట్టిన కాసేపటికే మృతి..
    ఆవు కడుపున పుట్టిన వింత జంతువు దూడకు ఉండాల్సిన అవయవాలు తల, కాళ్లు, తోక, శరీరం అంతా పంది ఆకారంలో ఉండటంతో షాక్ అయ్యాడు. ఈ విషయాన్ని గ్రామస్తులతో పంచుకున్నాడు. అంతే వింత ఆకారంలో పుట్టిన జంతువును చూసేందుకు గ్రామస్తులు ఎగబడ్డారు.ఊరి జనమే కాదు పక్కనే ఉన్న గ్రామాల ప్రజల చెవిలో కూడా ఈ వార్త పడటంతో పెద్ద సంఖ్యలో జనం సాయిలు ఇంటికి చేరుకుంటున్నారు. విచిత్రమైన ఆకారంలో పుట్టిన పంది రూపంలో ఉన్న దూడను చూసిపోతున్నారు అయితే విచిత్రమైన ఆకారంలో పుట్టిన పంది పుట్టిన కొద్దిసేపటికే చనిపోయింది.

    ఇది చదవండి: రేవంత్‌రెడ్డితో మళ్లీ జగడానికి జగ్గారెడ్డి రెడీ .. అసలు కారణం అదేనా..!



    బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని గుర్తు చేస్తున్న జనం..
    వింత పశువును చూసేందుకు వచ్చిన వాళ్లంతా ఆవు కడుపున పంది పుట్టిందంటే వీర బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందా అని చర్చించుకుంటున్నారు. నంది కడుపున కూడా పంది పుడుతుందని మాట్లాడుకున్నారు. ఇలా పశువు కడుపున జంతువు పుట్టడం వెనుక జన్యులోపం, లేదంటే పశువుల అసంబద్ద కలయిక కారణంగా వింత ఆకారంలో పుట్టే అవకాశం ఉందని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. నిపుణులు డాక్టర్లు ఏం చెప్పినా..జనం మాత్రం కలియుగంలో కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని నమ్ముతున్నారు. నాడు బ్రహ్మంగారు చెప్పిందే ఇప్పుడు జరుగుతున్నాయని ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు.

    ఇది చదవండి: తెలంగాణలో ఈడీ ప్రకంపనలు ..అధికార పార్టీ ఎంపీ నాామా ఆస్తులు జప్తు


    Published by:Siva Nanduri
    First published:

    Tags: Kamareddy, VIRAL NEWS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు